పర్యటక మంత్రిత్వ శాఖ
"దేఖో అప్నా దేశ్" వెబినార్ సీరీస్ కింద "వారణాసిలో ఫోటో వాకింగ్ : కనులకు పండుగ" పేరిట 7వ వెబినార్ నిర్వహించిన పర్యాటక మంత్రిత్వ శాఖ
Posted On:
23 APR 2020 4:40PM by PIB Hyderabad
ప్రపంచం యావత్తు ఇంతకు ముందెన్నడూ కనివిని ఎరుగని సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. రవాణా పరిశ్రమ, వ్యక్తిగత పర్యాటకుల మనసులను సాధారణ పరిస్థితుల పునరుజ్జీవనం దిశగా ఆలోచించేలా చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రయత్నంలో భాగంగా భారతదేశానికి చెందిన వైవిధ్యభరితమైన పర్యాటక, సాంస్కృతిక వైభవాన్ని కళ్లకు కట్టినట్టు చూపించడానికి "దేఖో అప్నా దేశ్" శీర్షికతో వెబినార్ సీరీస్ నిర్వహిస్తోంది. పర్యటనల పట్ల అభిరుచి, ఆసక్తి గల వారిని ప్రాంతీయ, నగర సాంప్రదాయం, సంస్కృతి, వైభవం, చరిత్ర వివరించే నిపుణులతో అనునసంధానం చేయడం దీని లక్ష్యం. ఈ సీరీస్ లో భాగంగా పర్యాటక మంత్రిత్వ శాఖ "వారణాసిలో ఫొటో వాకింగ్ : కళ్లకు విందు...విరాసత్, సంస్కృతి ఔర్ వ్యంజన్" పేరిట 2020 ఏప్రిల్ 23వ తేదీన 7వ వెబినార్ ను నిర్వహించింది.
వారణాసి హెరిటేజ్ వాక్స్ అనే ప్రత్యేక బ్రాండ్ కు మాతృ సంస్థ అయిన సిటీ ఎక్స్ ప్లోరర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన బృందం ఈ వెబినార్ ను సమర్పించింది. ఇందులో వారణాసి వైవిధ్యం, మర్మం, అధ్యాత్మికత, సంస్కృతిక అక్షరాస్యత, జీవిత అనుభవాలు, వ్యక్తిగత జ్ఞాపకాలను వివరించారు. ఈ సెషన్ ప్యానెలిస్టుల్లో డాక్టర్ సచిన్ బన్సల్ - చీఫ్ ఎక్స్ ప్లోరర్ (సిటీ ఎక్స్ ప్లోరర్స్ వ్యవస్థాపకుడు), శ్రీ శ్రవణ్ చించ్వాడ్కర్ (వారణాసి సంస్కృతిపై మంచి అవగాహన గల వ్యక్తి), శ్రీ శశాంక్ శర్మ (గైడ్) ఉన్నారు.
భారతదేశం ప్రతిష్ఠను నిలబెట్టడంలో ముందువరుసలో నిలిచే విధంగా వారణాసికే ప్రత్యేకమైన కొన్ని సాంస్కృతిక కథనాలు, నోరూరించే రుచులు, ప్రతీ ఒక్క ప్రదేశంలోను వెలుగులోకి రాకుండా ఉండిపోయిన జీవన సాంప్రదాయాలు విలసిల్లే ప్రపంచానికి చెందిన అత్యంత ప్రాచీనమైన నగరాల్లో ఒకటిగా వారణాసిని ఆ వెబినార్ ప్రదర్శించింది. ఈ నగరంలో మైళ్ల దూరం విస్తరించిన ఘాట్ లు, ప్రతీ ఒక్క వ్యక్తి ప్రార్థనలకు ఒక జవాబు ఇవ్వగల లెక్కలేని దేవాలయాలు, లక్షలాది మంది దేవీ దేవతా మూర్తుల గురించి వివరించింది. వెబినార్ నిర్వహించిన మార్గంలో నిలిచిన ప్రతీ చోటులోనూ దాగి ఉన్న వారణాసి ప్రాచీన చరిత్ర, సాంస్కృతిక వైభవం, ఆధ్మాత్మిక అనుసంధానత, రుచికరమైన వంటల గురించి సవివరంగా ప్రస్తావించింది.
వారణాసి జీవితంపై పర్యాటకుల దృష్టికోణాన్ని కేంద్రీకరింపచేసే విధంగా వివరణతో ఈ వెబినార్ ప్రారంభమయింది. వారణాసిలో నడక (ద వాకింగ్ ఆఫ్ వారణాసి), దైవం-దైవత్వం (ద డివైన్ అండ్ డివైనిటీ), ప్రాచీన నగరంలో ఆహారం (ఫుడ్ ఆఫ్ ద ఏనిషెంట్ సిటీ) అనే శీర్షికలతో వివిధ ప్రాంతాల మీదుగా సాగుతూ చక్కని అనుభూతి కలిగించింది. "వాకింగ్ ఆఫ్ వారణాసి" పేరిట తెలతెలవారుతుండగానే ప్రారంభమైన యాత్రలో నగర ప్రశాంతతను కనులకు కట్టినట్టు చూపించారు. "డివైన్ అండ్ డివైనిటీ" పేరిట సాగిన యాత్రలో నగరంలోని పూలమార్కెట్, విశ్వనాథుని దర్శనం, దశాశ్వమేథ ఘాట్ లో ఎంతో ప్రాచుర్యం పొందిన సాయంత్ర హారతి వంటివి చూపి వీక్షకులను భక్తి తన్మయత్వంలో నింపారు. "ఫుడ్ ఆఫ్ ఏనిషెంట్" సిటీ పేరిట సాగిన రెండు యాత్రల్లో మనిషి నోట్లోని రుచి కణాలను తట్టి లేపే రంగురంగుల ఆహార పదార్థాలు ఖచోరీ సబ్జీ, మలయ్యో, లస్సీ, జిలేబీ-దహీ, టమాటార్ ఛాట్, పాలక్ పట్టా ఛాట్, బనారసీ పాన్ వంటివి చూపారు. రామ్ భండార్, బ్లూలస్సీ, దీపక్ తంబుల్ భండార్, రాజేశ్ చౌరాసికా పాన్ వాటా (చౌక్ ప్రాంతం), బాబా తండై, భర్తేందు భవన్, దీనా ఛాట్ భండార్, కాశీ ఛాట్ భండార్ సహా అన్ని రకాల సాంప్రదాయిక రుచులు లభించే ప్రదేశాల మీదుగా యాత్ర సాగే విధంగా ఈ రూట్ ను రూపొందించారు. ఈ వాక్ చివరి ఘట్టంగా వారణాసికి చెందిన సమున్నతమైన, బహుళ ప్రాచుర్యం పొందిన పండుగల గురించి నక్కత్తయ్య, నాగ్ నత్తయ్య, భస్మ్ హోలీ, దేవ్ దీపావళి వంటి ప్రత్యేక వేడుకలకు సంబంధించిన కథనాలతో రూపొందించారు. డాక్టర్ సచిన్ బన్సల్ మహోత్కృష్టమైన చేనేత సాంప్రదాయాలు, సంగీతోత్సవాలను పరిచయం చేస్తూ స్థానిక ప్రతినిధుల సంభాషణలతో ఆసక్తికరమైన కథనాలతో ఈ వెబినార్ ముగించారు.
ఈ వెబినార్ వీక్షకులందరి నుంచి చక్కని స్పందన లభించింది. వారిలో విదేశీ ప్రాంతీయులు కూడా ఉన్నారు.
(Release ID: 1617720)
Visitor Counter : 161