వ్యవసాయ మంత్రిత్వ శాఖ

లాక్‌డౌన్ ప్రారంభ‌మైన‌ప్ప‌టినుంచి ప‌నిచేస్తున్న‌ వ్య‌వ‌సాయ మార్కెట్‌ల రెట్టింపు

గ‌త నెల‌లో మండీల‌కు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చిన ప్ర‌ధాన కూర‌గాయ‌లు, మార్చి 16 నాటికి మార్కెట్‌‌కు వ‌చ్చిన ఆరు రెట్ల ఉల్లిగ‌డ్డ‌లు, రెట్టింపు మొత్తంలో ట‌‌మోటాలు, ఆలుగ‌డ్డ‌లు మార్కెట్‌కు రాక‌
ఆలుగ‌డ్డ‌లు, ప‌ప్పుధాన్యాల పంట చేతికిరావ‌డం దాదాపు పూర్తి,
దాదాపు పూర్తి కావ‌స్తున్న చెర‌కు , గోధుమ‌, ర‌బి ఉల్లిపాయ‌ల పంట సేక‌ర‌ణ ప‌నులు

Posted On: 23 APR 2020 7:58PM by PIB Hyderabad

లాక్‌డౌన్ స‌మ‌యంలో  క్షేత్రస్థాయిలో రైతుల వ్యవసాయ కార్యకలాపాలను సులభతరం చేయడానికి కేంద్ర ప్ర‌భుత్వ‌ వ్యవసాయ, సహకార , రైతు సంక్షేమ శాఖ అనేక చర్యలు తీసుకుంటోంది. ఇందుకు సంబంధించిన కార్య‌కలాపాల స్థితిగ‌తుల‌ను కింద పేర్కొన‌డం జ‌రిగింది:

దేశంలో 2587 ప్ర‌ధాన వ్య‌వ‌సాయ మార్కెట్లు ఉండ‌గా అందులో 1091 మార్కెట్లు లాక్‌డౌన్‌ప్రారంభంలో  26.032020 నాటికి ప‌నిచేస్తున్నాయి. వీటిని 21-04-2020 నాటికి 2069 మార్కెట్ల‌కు పెంచారు.
ఉల్లిగ‌డ్డ‌లు, ఆలుగ‌డ్డ‌లు, ట‌మోటాలు మండీల‌కు రావ‌డం 16-03-2020 తో పోలిస్తే 21-04-2020 నాటికి వ‌రుస‌గా 622 శాతం, 187 శాతం, 210 శాతం పెరిగాయి.
 2020 ర‌బీ సీజ‌న్‌లో మ‌ద్ద‌తు ధ‌ర‌కు  ప‌ప్పుధాన్యాలు, నూనె గింజ‌ల సేక‌ర‌ణ ప్ర‌స్తుతం 20 రాష్ట్రాల‌లో కొన‌సాగుతోంది. 1,73,064 మెట్రిక్‌ట‌న్నుల పప్పుధాన్యాలు, 1,35,993 మెట్రిక్ ట‌న్నుల నూనెగింజ‌లను నాఫెడ్‌, ఎఫ్.సి.ఐ  రూ 1447.55 కోట్ల రూపాయ‌ల‌కు సేక‌రించింది. దీనివ‌ల్ల‌ 1,83,989 మంది రైతులు ప్ర‌యోజ‌నం పొందారు.
జాతీయ వెదురు మిష‌న్ కింద రాష్ట్రాలు త‌మ కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించాయి. రానున్న వ‌ర్షాకాలానికి సంబంధించి ప్ర‌యోజ‌నం పొందేందుకు అవి త‌మ కార్య‌క‌లాపాలు మొద‌లుపెట్టాయి. ఉత్త‌రాఖండ్‌లోని పితోరాఘ‌డ్‌లో వెదురు న‌ర్స‌రీలో మాస్క్‌లు వేసుకుని త‌మ‌ కార్య‌క‌లాపాలు ప్రారంభించారు. వీరికి ఆహారం ఇత‌ర స‌దుపాయాలు క‌ల్పిస్తున్నారు. గుజ‌రాత్‌లోని శ‌బ‌ర‌కంఠ‌, వ‌న‌స‌ద జిల్లాల‌లో కూడా న‌ర్స‌రీలు ప్రారంభ‌మయ్యాయి. ఫార్మ‌ర్ ప్రొడ్యూస‌ర్ ఆర్గ‌నైజేష‌న్లు అస్సాంలోని కామ‌రూప్ జిల్లా డిమోరియా లో ‌585 హెక్టార్ల‌లో ప్లాంటేష‌న్ ప్రారంభించాయి.
ప్ర‌ధాన‌మంత్రి కిసాన్‌స‌మ్మాన్ నిధి(పిఎం-కిసాన్) ప‌థ‌కం కింద లాక్ డౌన్ స‌మ‌యంలో 24-03-2020 నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ 8.938 కోట్ల మంది రైతుకుటుంబాలు ప్ర‌యోజ‌నం పొందాయి. వీరికి ఇప్ప‌టివ‌ర‌కూ 17,876.7 కోట్ల‌రూపాయ‌లు విడుద‌ల చేయ‌డం జ‌రిగింది..
 22-04-2020 నాటికి పంట‌నూర్పిళ్ల  స్థితిగ‌తులు:
గోధుమ‌లు:
గోధుమలు పండించే  ప్రధాన రాష్ట్రాలలో, పంట కోత‌లు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. రాష్ట్రాలు అందించిన స‌మాచారం  ప్రకారం మధ్యప్రదేశ్‌లో 98-99 శాతం గోధుమ పంట కోతలు పూర్త‌య్యాయి., రాజస్థాన్‌లో 88-90 శాతం, ఉత్తర ప్రదేశ్‌లో 75-78 శాతం, హర్యానాలో 40-45 శాతం, పంజాబ్‌లో 35-40శాతం, 82 ఇతర రాష్ట్రాల్లో -84శాతం కోత‌లు పూర్త‌య్యాయి.
ప‌ప్పుధాన్యాలు:
 రాష్ట్రాలు తెలిపిన దాని ప్ర‌కారం, పప్పుధాన్యాల పంట కోత‌లు దాదాపు అన్ని రాష్ట్రాల్లో పూర్తయ్యాయి
చెరకు: మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ,పంజాబ్‌ల‌లో 100 శాతం చెరకు పెంపకం పూర్తయింది. తమిళనాడు, బీహార్, హర్యానా  ఉత్తరాఖండ్‌ల‌లో  సుమారు 92-98 శాతం కోత పూర్తయింది, ఉత్తరప్రదేశ్ లో 80-85 శాతం కోత పూర్తయింది.
ఆలుగ‌డ్డ‌లు: ఆలుగ‌డ్డ‌ల పంట రైతుల  చేతికి వ‌చ్చింది, నిల్వ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది.
 ఉల్లిగ‌డ్డ‌లు :  చిన్న క‌మ‌తాలు గ‌ల రైతులు ర‌బీ ఉల్లిగ‌డ్డ‌లు వ్య‌వ‌సాయ క్షేత్రాల నుంచి సేక‌ర‌ణ  పూర్తి చేశారు. పెద్ద క‌మ‌తాల‌లో పంట తీయ‌డం జ‌రుగుతోంది. ఇది మే రెండోవారం వ‌ర‌కుకొన‌సాగ‌వ‌చ్చు.

***

 



(Release ID: 1617717) Visitor Counter : 208