శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 ని తుదముట్టించడానికి మాస్కుల ప్రమాణాల పెంపు ; మూడు పొరల వైద్య మాస్కులు, ఎన్-95 రెస్పిరేటర్లకు యాంటీ-వైరల్ నానో-పూత
అత్యంత ప్రమాద హేతువులైన పరిస్థితులను ఎదుర్కొనే అదనపు రక్షణ కవచాన్ని సమకూర్చే లక్ష్యంతో పీపీఈ, మాస్కులు తదితర తొడుగులపై అత్యంత ప్రభావాన్ని చూపే యాంటీమైక్రోబియల్ సూక్ష్మ కణాలు : డిఎస్టి కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ
నాడు పోస్టు చేయడమైనది:
23 APR 2020 6:44PM by PIB Hyderabad
నానో మిషన్ లో భాగంగా, ఢిల్లీ ఐఐటీ కి చెందిన ప్రొఫెసర్ అశ్విని కుమార్ అగర్వాల్ అభివృద్ధి చేసిన యాంటీ-వైరల్ నానో పూత ప్రమాణాలు పెంచేలా సరైన పదార్థాన్ని వినియోగించడానికి, అటువంటి పదార్థంతో కోవిడ్-19 ని ఎదుర్కొనే మూడు పొరల మెడికల్ మాస్కులు, ఎన్-95 రెస్పిరేటర్ల భారీ ఎత్తున ఉత్పత్తి చేయడానికి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఆమోదం తెలిపింది.
బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగస్ మొదలైన వాటికి వ్యతిరేకంగా బలమైన యాంటీమైక్రోబయాల్ చర్యను వెండి కలిగి ఉంటుంది. ఇదే మిషన్ లో భాగంగా ఢిల్లీ ఐఐటీ స్మితా రీసెర్చ్ ల్యాబ్ లో ప్రొఫెసర్ అగర్వాల్ ఎన్9 బ్లూ నానో సిల్వర్ ని అభివృద్ధి చేసారు. వీటి ప్రమాణాలు పెంచే దిశగా పనిని బెంగళూరు రెసిల్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఢిల్లీ నానోక్లీన్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి కృషి జరుగుతోంది.
"పోటీ ప్రపంచంలో నాణ్యమైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, విజ్ఞానాన్ని అందిస్తున్న డిఎస్టి గత రెండు దశాబ్దాలుగా దేశంలో నానోసైన్స్ కార్యకలాపాలను చేపట్టింది. నానోసైన్స్‌లో శాస్త్రీయ ప్రచురణల సంఖ్య పరంగా చుస్తే నేడు భారతదేశం ప్రపంచంలో 3 వ స్థానంలో ఉంది. అత్యంత ప్రభావవంతమైన యాంటీమైక్రోబయాల్ వాడకం పిపిఇలు, ముసుగులు మొదలైన వాటిపై నానోపార్టికల్స్ అనేది వైద్య సిబ్బంది లాంటి అధిక ప్రమాదం ఉన్నవారికి అదనపు రక్షణ పొరను అందించే ఉపయోగకరమైన అప్లికేషన్ " అని డిఎస్టి కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ అన్నారు.
ప్రొఫెసర్ అగర్వాల్, తన బృందంతో కలిసి, కోవిడ్-19 కు వ్యతిరేకంగా ఈ మిశ్రమం యాంటీవైరల్ లక్షణాలను ఢిల్లీలోని ఎయిమ్స్, ఐఎల్బిఎస్ సహకారంతో అంచనా వేయాలని ప్రతిపాదించారు.
అధిక శక్తివంతమైన యాంటీమైక్రోబయల్ ఏజెంట్ అయిన ఎన్9 బ్లూ నానోసిల్వర్, సినర్జిస్టిక్ ప్రభావాన్ని సాధించడానికి జింక్ సమ్మేళనాలతో నానోకాంప్లెక్స్‌లను రూపొందించడానికి మరిన్ని మార్పులు జరుగుతున్నాయి.
తదనంతరం, కోవిడ్ -19 వైరస్ ఉన్న నోటి తుంపర్ల నుండి ప్రమాదవశాత్తు కలుషితం కాకుండా ధరించేవారిని రక్షించే సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ఈ సూక్ష్మ పదార్ధాలను ఫేస్‌మాస్క్‌లు, ఇతర పిపిఇలపై పూతలుగా వర్తింపజేస్తారు. పరిశోధకులు పైపూతల జీవిత కాలం, ఉష్ణోగ్రత, తేమ, సమయం వంటి విభిన్న నిల్వ పరిస్థితులతో వాటి సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. ఫేస్‌మాస్క్‌లు, పిపిఇలను తయారు చేసి క్షేత్ర స్థాయి పరీక్షలకు సిద్ధం చేస్తారు.
[మరిన్ని వివరాల కోసం సంప్రదించండి: డాక్టర్ అశ్విన్ కుమార్ అగర్వాల్ (ashwini@smita-iitd.com, +919810585313)]
(రిలీజ్ ఐడి: 1617674)
సందర్శకుల సూచీ సంఖ్య : : 182