విద్యుత్తు మంత్రిత్వ శాఖ

విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎన్హెచ్పిసి చెల్లుపత్రం ద్వారా ఏడాదికి 6.80% చొప్పున రు.750 కోట్ల వసూలు

Posted On: 23 APR 2020 5:24PM by PIB Hyderabad

భారత ప్రభుత్వ విద్యుత్ శాఖ పరిధిలోని ఎన్హెచ్పిసి  లిమిటెడ్ 10 సంవత్సరాల ఋణ కాలానికి 6.80% వడ్డీ రేటు చొప్పున ప్రైవేటు బాండుల ద్వారా రు.750 కోట్లను సేకరించింది. ఈ నిర్మితిలో ఆధారిత పరిమాణం రు.500 కోట్లు ఉండగా గ్రీన్ షూ ఐచ్ఛికంతో రు.250 కోట్లు ఉన్నాయి.

ఈ ఇష్యూకు  ఈ కొవిడ్-19 వ్యాపిస్తున్న సమయంలో కూడా మార్కెట్లో మిక్కిలిగా  3.87సార్లు ఎక్కుగా అనగా  రు.2899కోట్లు  వాటాలకు మించి దరఖాస్తులు వచ్చాయి. 6.80% వడ్డీ రేటు  చెల్లు పత్రం ప్రస్తుత విత్త సంబంధిత విధానంలో కనిష్టం మరియు ఇది 7.10%తో 10 సంవత్సరాల కాలానికి చెల్లబడియగు ఏఏఏ రేటు పొందిన పత్రాల కన్నా కూడా 30బిపిఎస్ లేదా 0.30% తక్కువ.  ఎన్హెచ్పిసి అత్యంత ఎక్కువ  ఋణ అధికార పత్రాలు కలిగినది మరియు  ప్రముఖ రేటింగ్ ఏజెన్సీలతో ఏఏఏ రేటింగ్ పొందినది.



(Release ID: 1617602) Visitor Counter : 155