సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
కరోనా యుద్ధ వీరులకు గౌరవసూచకంగా ఎర్రకోట, కుతుబ్ మినార్,హుమయూన్ సమాధి వద్ద ప్రత్యేక దీపాలంకరణ
ప్రపంచ పురావస్తు దినోత్సవం సందర్భంగా భారతదేశ పురావస్తు సర్వే విభాగం, ఢిల్లీ సర్కిల్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు
Posted On:
18 APR 2020 9:30PM by PIB Hyderabad
కరోనా వైరస్ మహమ్మారిని అంతమొందించడానికిగాను కృషి చేస్తున్న పోరాట వీరులకు కృతజ్ఞత తెలపడానికి భారతదేశ పురావస్తు సర్వే సంస్థకు చెందిన ఢిల్లీ విభాగం ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. చారిత్రక ప్రదేశాలైన ఎర్రకోట, కుతుబ్ మినార్, హుమయూన్ సమాధిలను ప్రత్యేక వెలుగులతో అలంకరించి సంఘీభావం తెలిపింది. ఈ కార్యక్రమంతోపాటు పురవాస్తు సంస్థ ఢిల్లీ విభాగంవారు...స్కూలు విద్యార్థులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. వారసత్వ సంపదను రక్షించుకోవాలనే సంకల్పాన్ని వారిలో నింపడానికిగాను వారితో ప్రతిజ్ఞ చేయించింది.
ఈ కార్యక్రమంలో ఘజియాబాద్ , ప్రతాప్ విహార్ లోని సిఎస్ హెచ్ పి పబ్లిక్ స్కూలు విద్యార్థులు, నొయిడాలోని ఏఎస్ పి ఎం స్కాటిష్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. స్కాటిష్ స్కూల్ కు చెందిన 1ఎ, 1 బి విద్యార్థులు, సిఎస్ హెచ్ పి పబ్లిక్ స్కూల్ కు చెందిన 9, 10, 11వ తరగతి విద్యార్థులు ఈ ఆన్ లైన్ ప్రతిజ్ఞా కార్యక్రమంలో పాల్గొన్నారు.
నిస్వార్థ సేవాభావంతో కరోనాపై యుద్ధం చేస్తున్న పోరాట వీరులకు కృతజ్ఞత తెలపడానికిగాను పురావస్తు సంస్థ ఢిల్లీ విభాగం తన పరిధిలోని మూడు చారిత్రాత్మక ప్రదేశాలను ప్రత్యేక దీపాలతో అలంకరించింది. మనం విజయం సాధిస్తామనే సందేశాన్నిస్తూ ఎర్రకోట దగ్గర కొవ్వొత్తులతో భారతదేశ చిత్రపటాన్ని రూపకల్పన చేశారు.
కుతుబ్ మినార్ వద్ద నివాస గృహ ఆకారంలో కొవ్వొత్తులను వెలిగించారు. ఇంట్లోనే వుండండి, భద్రంగా వుండండి అనే సందేశాన్నిచ్చారు.
హుమయూన్ సమాధి వద్ద 41 కొవ్వొత్తులను వెలిగించారు. కరోనా వైరస్ మహమ్మారిని నిరోధించడానికిగాను 41 రోజులపాటు సాగుతున్న పోరాటాన్ని ప్రతిబింబించేలా 41 కొవ్వొత్తులను వెలిగించారు.
*******
(Release ID: 1616266)
Visitor Counter : 165