ఆర్థిక మంత్రిత్వ శాఖ
ప్రపంచ బ్యాంకు - ఐ ఎం ఎఫ్ అభివృద్ధి కమిటీ సమావేశానికి హాజరైన ఆర్ధిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్
కోవిడ్ -19 ఎదుర్కోవడానికి పేదలు , దుర్భలులకు సహాయం అందించడం, సంస్థలు చట్టబద్ధంగా పాటించవలసిన నియమాల అమలులో వెసులుబాటు సహా ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఇతర దేశాలతో పంచుకున్న ఆర్ధికమంత్రి
Posted On:
17 APR 2020 7:44PM by PIB Hyderabad

వీడియో కాన్ఫరెన్సు ద్వారా గురువారం జరిగిన అభివృద్ధి కమిటీ 101వ ప్లీనరీ సమావేశంలో ఆర్ధిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. కోవిడ్ -19 మహమ్మారి వాళ్ళ తలెత్తిన అత్యవసర పరిస్థితి నేపథ్యంలో ప్రపంచ బ్యాన్కు బృందం ప్రతిస్పందన, అంతర్జాతీయ అభివృద్ధి సంఘంలో ఉన్న దేశాలకు మద్దతుగా చర్యలు అనే అంశాలు ఎజెండాగా సమావేశం సాగింది.
మా దేశంలో ఉన్న జనాభా పరిమాణం దృష్ట్యా ఇండియా కోవిడ్ -19 విజృంభించి ఉండేది. అయితే ప్రభుత్వం అందుకు అవకాశం ఇవ్వకుండా ఆరోగ్య వ్యవస్థలు సరిగా పనిచేసేలా చర్యలు తీసుకుంది. సామాజిక దూరం పాటించడం , ప్రయాణాలపై ఆంక్షలు , ప్రభుత్వ ప్రయివేటు రంగాలలో ఇంటినుంచి పనిచేయడం, ఇంటిలో సురక్షితంగా ఉండటం వంటి చర్యలతో పాటు ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకొని పరీక్షలు, వేరుగా ఉంచడం, చికిత్సలు చేయడం వంటి ఆరోగ్య సేవలు అందించడం వాళ్ళ మహమ్మారి ప్రభావాన్ని అదుపు చేయగలిగామని మంత్రి తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన 2300 కోట్ల అమెరికా డాలర్లకు విలువైన ఆర్ధిక ప్యాకేజీలో
ఉచిత ఆరోగ్య బీమా, నగదు బదిలీలు, ఉచిత ఆహారం, గ్యాస్ పంపిణీ మరియు ప్రభావిత శ్రామికుల సామాజిక భద్రతకు చర్యలు ఉన్నాయి. అదే సమయంలో ఆర్ధిక అవకాశాలు కోల్పోయిన సంస్థలకు ప్రధానంగా చిన్న, మధ్యతరహా సంస్థలకు ఆదాయపు పన్ను, జీఎస్టీ , కస్టమ్స్ , ఆర్ధిక సేవలు మరియు కార్పొరేట్ వ్యవహారాలకు సంబంధించి చట్టబద్ధంగా, ప్రభుత్వ నియంత్రణకు లోబడి నిర్వర్తించవలసిన కర్తవ్యాల విషయంలో ప్రభుత్వం వారికి వెసులుబాటు కల్పించడమే కాక కొన్ని రాయితీలు కూడా ఇచ్చిందని శ్రీమతి సీతారామన్ వెల్లడించారు. ఈ విషయంలో కేంద్ర బ్యాంకు కూడా సర్దుబాటుకు అనువైన రీతిలో వ్యవహరించిందన్నారు. మార్కెట్లో చంచలత్వం లేకుండా రెగ్యులేటర్లు చర్యలు తీసుకుంటున్నారు. రానున్న రోజుల్లో మానవతా సహాయం మరియు ఆర్ధిక ఉద్దీపన ద్వారా భాగస్వామ్య పక్షాలతో కలిసి అదనపు సహాయం అందించేందుకు ప్రభుత్వం విస్తారంగా కృషిచేస్తోంది.
విశ్వ సమాజంలో బాధ్యతగల పౌరులుగా మన దేశం అవసరంలో ఉన్న దేశాలకు మందులను సరఫరా చేస్తోందని, పరిస్థితి ఎదురైతే మున్ముందు మరిన్ని దేశాలకు కూడా సరఫరా చేస్తామని ఆమె అన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోవిడ్ -19 రెస్పాన్స్ ఫెసిలిటీ ఏర్పాటు విషయంలో సత్వరం స్పందించి సమర్ధవంతమైన చర్యలు తీసుకున్నందుకు ఆమె ప్రపంచ బ్యాంకు బృందాన్ని అభినందించారు.
***
(Release ID: 1615520)
Visitor Counter : 197