శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కోవిడ్ వ్యాప్తి క‌ట్ట‌డికి ప్రాంతీయ నిర్దిష్ట వ్యూహాలు, నిర్ణయాలు తీసుకొనేందుకు

సహాయపడేలా అందుబాటులోకి “ఇంటిగ్రేటెడ్ జియోస్పేషియల్ ప్లాట్‌ఫాం” అప్లికేష‌న్‌
- “ఆరోగ్య సేథు” మొబైల్ అప్లికేష‌న్‌కు అనుబంధంగా ఉండేలా “స‌హ‌యోగ్” వేదిక‌

Posted On: 15 APR 2020 7:23PM by PIB Hyderabad

కోవిడ్‌-19 వ్యాప్తి క‌ట్ట‌డికి నిర్ణయాలు తీసుకొనేందుకు వీలుగా జియోస్పేషియల్ డేటాసెట్‌లు, ప్రమాణాల-ఆధారిత సేవలు మరియు విశ్లేషణాత్మక సాధనాలతో కేంద్ర శాస్ర్త, సాంకేతిక శాఖ‌
(డీఎస్‌టీ) సమగ్ర జియోస్పేషియల్ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చింది. రికవరీ దశలో సామాజిక - ఆర్థిక ప్రభావాన్ని అంచనా వేస్తూ నిర్వహించడానికి ప్రాంతీయ నిర్దిష్ట వ్యూహాలు రూపొందించ‌డానికి వీలుగా దీనిని తీర్చిదిద్దారు. ఈ స‌రికొత్త డిజిట‌ల్ వేదిక‌ను తొల‌త రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు చేప‌డుతున్న ప్రజారోగ్య పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయ‌నుంది. ఆ తదనంతరం పౌరులు మరియు ఏజెన్సీల వారు ఆరోగ్యం, సామాజిక-ఆర్థిక ఇబ్బందులు మరియు జీవనోపాధికి సంబంధించిన సవాళ్లను మ‌రింత స‌మ‌ర్థంగా వ్యవహరించేందుకు వీలుగా జీయోస్పాట‌ల్ స‌మాచారం అందించేలా రూపొందించారు. స‌ర్వే ఆఫ్ ఇండియా (ఎస్‌వోఐ) త‌యారు చేసి నిర్వ‌హిస్తున్న “స‌హ‌యోగ్” మొబైల్ అప్లికేష‌న్‌, వెబ్ పోర్ట‌ల్ https:// indiamaps.gov.in/soiapp/ కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ ద్వారా కోవిడ్‌ నిర్దిష్ట‌మైన‌ జియోస్పేషియల్ డేటాసెట్లను సేకరించేందుకు వీలుగా అనుకూలీకరించబడింది. కోవిడ్-19 మ‌హమ్మారి క‌ట్ట‌డికి గాను భారత ప్రభుత్వ ప్రతిస్పందన కార్యకలాపాలను గురించి తెలుసుకొంటూ వాటిని మ‌రింత పెంచడానికి వీలుగా దీనిని త‌యారు చేశారు. కోవిడ్ వ్యాప్తి పెరిగిన నేప‌థ్యంలో పాటించాల్సిన నియంత్ర‌ణ ప్ర‌ణాళిక‌లో భాగంగా భార‌త ప్ర‌భుత్వపు వ్యూహం ప్ర‌కారం అవ‌స‌ర‌మైన స‌మాచారపు పారామితులు “స‌హ‌యోగ్” అప్లికేష‌న్‌లో జ‌త‌చేయ‌బ‌డ్డాయి. కాంటాక్ట్ ట్రేసింగ్, ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించ‌డం, స్వీయ-అంచనా లక్ష్యాల కోసం భారత ప్రభుత్వం ప్రారంభించిన “ఆరోగ్య సేథు” మొబైల్ అప్లికేషన్‌కు ఇది అనుబంధంగా ఉంటూ ప్రజ‌ల‌కు మ‌రింత మెరుగైన స‌మాచారాన్ని అందించ‌నుంది. కోవిడ్‌ను ఎదుర్కోవ‌డంలో భాగంగా మధ్య ప్రదేశ్, ఒడిశా, పంజాబ్, జమ్మూ కాశ్మీర్లలోని స్టేట్ స్పేషియల్ డేటా ఇన్‌ఫ్రాస్ట్రక్చ‌ర్ (ఎస్ఎస్‌డీఐ) సంబంధిత ఆరోగ్య డేటా సెట్లతో అనుసంధానం కోసం రాష్ట్ర జియోపోర్టల్స్ ద్వారా సంబంధిత రాష్ట్రాల్లోని రాష్ట్ర మరియు జిల్లా స్థాయి అధికారులకు అనుషంగిక ప్రమాణాల ఆధారిత జియోస్పేషియల్ డేటా సేవలను అందిస్తోంది.
కీల‌క నిర్ణ‌యాలు తీసుకొనేందుకు స‌హాయ‌ప‌డుతుంది..
ఈ ఇంటిగ్రేటెడ్ జియోస్పేషియల్ ప్లాట్‌ఫాం జాతీయ ఆరోగ్య అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల‌ మేనేజ్‌మెంట్‌ను మ‌రింత‌గా బలోపేతం చేయ‌నుంది. ఈ వేదిక నిరంత‌రాయంగా ప్రాదేశిక డేటా, ఇత‌ర విలువైన‌ సమాచారం, మానవ, వైద్య, సాంకేతిక, మౌలిక సదుపాయాలు, సహజ వనరుల మధ్య అనుసంధానానికి గల అవ‌కాశాలు సామాజిక-ఆర్థిక పునరుద్ధరణ ప్రక్రియకు కూడా ఇది మద్దతు ఇవ్వ‌నుంది.నిర్ణయాలు తీసుకోవడం, పాలన, అభివృద్ధి కోసం భౌగోళిక  స‌మాచారాన్ని జియోస్పాట‌ల్ స‌మాచారంతో స‌మీకృతం చేయ‌డం చాలా అవసరం. కోవిడ్‌-19 వ్యాప్తి వంటి ప్ర‌తికూల ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఇంటిగ్రేటెడ్ జియోస్పేషియల్ ప్లాట్‌ఫాం స‌హ‌యోగ్ వేదిక “అరోగ్య –సేథు” వేదిక‌లాగే ఉప‌యుక్తంగా ఉంటుంద‌ని డీఎస్‌టీ శాఖ కార్య‌ద‌ర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ తెలిపారు. స‌మీకృత భౌగోళిక సమాచారాన్ని స‌మ‌గ్ర‌ప‌ర‌చేందుకు డీఎస్‌టీ తీసుకున్న నిర్ణ‌యంతో కోవిడ్ వ్యాప్తి చేసిన బహుళస్థాయి సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి వేగంగా ప్రాదేశిక సమాచార-ఆధారిత నిర్ణయాలు తీసుకోవడంలో దేశానికి సహాయపడ‌నున్నాయి. 


(Release ID: 1615225) Visitor Counter : 294