రాష్ట్రప‌తి స‌చివాల‌యం

డా.బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా భారత రాష్ట్రపతి శుభాకాంక్షలు

నాడు పోస్టు చేయడమైనది: 13 APR 2020 3:30PM by PIB Hyderabad

డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా భారత రాష్ట్రపతి శ్రీ రామనాథ్ కోవింద్ జాతికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన జాతినుద్దేశించి ఇచ్చిన సందేశంలో  భారత సంవిధానకర్త డా.భీం రావ్ అంబేద్కర్ భారత పౌరులందరికీ నా శుభాకాంక్షలు అని తెలిపారు. 

సంస్కరణకర్తగా, న్యాయవేత్తగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా మరియు న్యాయ కోవిదుడిగా డా. అంబేద్కర్ జాతికి అమూల్యమైన సేవలను అందించారు.
సామాజిక సామరస్యం మరియు సమానత సమాజంలో పెరగాలని ఆయన కోరుకున్నారు. ఇందుకోసం ఆయన తన జీవిత కాలన్ని దేశానికి మరియు సమాజ సేవకు అంకితం చేసారు. గత కొన్ని దశాబ్దాలుగా మన దేశ పౌరులు ప్రజాస్వామ్య విలువలతో జీవిస్తున్నారంటే అది ఆయన జాతి అందజేసిన ప్రగతిశీల, సంఘటిత రాజ్యాంగం వలననే.

డా. అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశ పౌరులుగా మనం ఆయన  గొప్ప ఔన్నత్యం, పోరాటం మరియు ఆయన నెలకొల్పిన విలుల నుండి మనం స్ఫూర్తి పొందాలి.  మన దేశ ఔన్నత్యాన్ని పెంచడానికి మరియు దృఢమైన భారత నిర్మాణానికి డా. అంబేద్కర్ బోధనలను నుండి ఆలోచనలను మన జీవితంతో అన్వయించుకోవాలి. కొవిడ్-19 కారణంగా దేశ ప్రజలందరూ సామాజిక దూరాన్ని పాటిస్తూ తమ తమ ఇళ్ళ వద్దనే డా. అంబేద్కర్ జయంతిని జరుపుకోవాలి.

హిందీలో సందేశం కోసం ఈ క్రింది లింకును క్లిక్ చేయండి


(రిలీజ్ ఐడి: 1614069) సందర్శకుల సూచీ సంఖ్య : : 155
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Tamil , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Punjabi