గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
బ్యాంకు బిజినెస్ కరెస్పాండెంట్లుగా ‘ఎస్‌హెచ్‌జి’ మహిళలు
కోవిడ్ -19 దిగ్బంధం నడుమ పీఎంజేడీవై ఖాతాలకు
తొలివిడత రూ.500 సహాయం పంపిణీలో కీలకపాత్ర
Posted On:
13 APR 2020 3:24PM by PIB Hyderabad
కోవిడ్ -19 దిగ్బంధంతో దేశంలో అనేకమందికి ఉపాధి, వేతనం లభించని దుస్థితి ఏర్పడింది. ముఖ్యంగా రోజు కూలీలు, వలస కార్మికులు, నిరాశ్రయులు, నిరుపేదలు అగచాట్ల పడుతున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం 20.39 కోట్ల మంది మహిళలకు చెందిన ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన (PMJDY) బ్యాంకు ఖాతాల్లో ప్రతి నెలా రూ.500 వంతున 3 నెలలపాటు జమచేస్తామని హామీ ఇచ్చింది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఒకవైపు ఈ బాధ్యతను నిర్వర్తిస్తుండగా మరోవైపు పీఎం కిసాన్ యోజన ఖాతాలకు ప్రభుత్వం నేరుగా రూ.2,000 వంతున నగదు బదిలీ చేస్తోంది. ఈ సొమ్ము తీసుకోవడానికి వచ్చే లబ్ధిదారులతో బ్యాంకులలో విపరీత రద్దీ ఏర్పడింది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానాల్లో భాగంగా స్వయం సహాయ సంఘాల సభ్యులైన మహిళలను బ్యాంకు బిజినెస్ కరెస్పాండెంట్/‘బ్యాంకు సఖి’ (BC Sakhi/Bank Sakhi)గా నియమించింది. వీరంతా ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయంలో తొలివిడతగా విడుదలైన రూ.500 నగదును లబ్ధిదారులకు నేరుగా పంపిణీ చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. వారికి గుర్తింపు కార్డులతోపాటు అత్యవసర సేవల కింద కోవిడ్-19 పాసులను బ్యాంకులు జారీచేశాయి. శానిటైజర్‌తో హస్త పరిశుభ్రత, సామాజిక దూరం, మాస్కుల ధారణవంటి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఆదేశాలిచ్చాయి. తదనుగుణంగా 16కుపైగా రాష్ట్రాల్లో 8,800 మంది ‘బీసీ సఖీ’, 21,600 మంది ‘బ్యాంకు సఖి’లు స్వచ్ఛందంగా ఇంటింటికీ వెళ్లి నగదు పంపిణీ చేస్తున్నారు. వీరిలో 50 శాతం స్వచ్ఛందంగా ఈ బాధ్యత నిర్వర్తిస్తుండటం విశేషం. ఈ విధంగా బ్యాంకులు లేనిచోట్ల వాటి సేవలు తమ ముంగిటకు రావడంతో గ్రామీణ సమాజాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
*****
(Release ID: 1613960)
Visitor Counter : 195