పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

లక్ష కిలోమీటర్ల వైమానికి దూరం ప్రయాణించిన లైఫ్ లైన్ ఉడాన్ విమానాలు

Posted On: 03 APR 2020 8:45PM by PIB Hyderabad

లైఫ్ లైన్ ఉడాన్ కింద ఎయిర్ ఇండియా, అలయన్స్ ఎయిర్, ఐ.ఎ.ఎఫ్. పవన్ హాన్స్ మరియు ప్రైవేట్ కారియర్ కు చెందిన 97 విమానాలు నడుస్తున్నారు. వీటిలో 71 విమానాలను ఎయిర్ ఇండియా మరియు అలయన్స్ ఎయిర్ నడుపుతున్నాయి. వీటి ద్వారా ఇప్పటి వరకూ సుమారు 119 టన్నుల సరుకు ఇప్పటి వరకూ రవాణా చేయబడింది. ఇందులో భాగంగా ఈ విమానాలు లక్ష కిటలో మీటర్ల వైమానాక దూరం ప్రయాణించాయి.

ఈ రవాణాలో భాగంగా కోవిడ్ -19 సంబంధిత కారకాలు, ఎంజైములు, వైద్య పరికరాలు, పరీక్షా వస్తు సామగ్రి, వ్యక్తిగత రక్షణ పరికరాలు (పి.పి.ఈ), మాస్క్ లు, చేతి తొడుగులు, హె.ఎల్.ఎల్. మరియు ఐ.సి.ఎం.ఆర్. ఇతర పదార్థాలు ఉన్నాయి. రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలు కోరిన పోస్టల్ ప్యాకెట్లు, సరుకులతో లైఫ్ లైన్ ఉదాన్ విమానాలు తేదీలు వారీగా ఈ క్రింది విధంగా నడిచాయి.

క్ర. సం.

తేది

ఎయిర్ ఇండియా

అలయన్స్

ఐ.ఎ.ఎఫ్.

ఇండిగో

స్పైస్ జెట్

1

26.3.2020

02

-

-

-

02

2

27.3.2020

04

09

01

-

--

3

28.3.2020

04

08

-

06

--

4

29.3.2020

04

10

06

--

--

5

30.3.2020

04

-

03

--

--

6

31.3.2020

09

02

01

 

--

7

01.4.2020

03

03

04

--

-

8

02.4.2020

04

05

03

 

 

 

మొత్తం విమానాలు

34

37

18

06

02

 

లైఫ్ లైన్ ఉడాన్ విమానాలు హబ్ మరియు స్పోక్ మోడల్ లో పని చేస్తాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్ కతా, హైదరాబాద్, బెంగళూరులలో కార్గో హబ్ లు పని చేస్తున్నాయి. లైఫా లైన్ ఉడాన్ విమానాలు డిబ్రుఘర్, అగర్తలా, ఐజ్వార్, దిమాపూర్, ఇంఫాల్, కోయంబత్తూర్, త్రివేండ్రం, భువనేశ్వర్, రాయ్ పూర్, రాంచీ, పోర్ట్ బ్లెయిర్ మరియు గోవా లాంటి ప్రదేశాలను కలుపుతూ పని చేస్తున్నాయి. ఈశాన్య భారతదేశం, ద్వీప భూభాగాలు మరియు కొండ రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. లడఖ్, డిమాపూర్, ఇంఫాల్, గౌహతి పోర్ట్ బ్లెయిర్ ల కోసం మోకా, ఎయిర్ ఇండియా మరియు ఐ.ఎస్.ఎఫ్. కలిసి సహకారం అందించాయి.

చేరవేసిన సరుకులో ఎక్కువ భాగం తక్కువ బరువు ఉండే మాస్క్ లు, చేతి తొడుగులు, మరియు ఇతర వినియోగ పదార్థాల భారీ ప్యాకేజీలు ఉన్నాయి. టన్ను పధార్థానికి ఎక్కువ కార్గో స్థలం అవసరం. ప్రయాణీకులు సీటింగ్ ఏరియా మరియు ఓవర్ హెడ్ క్యాబిన్లలో తగిన జాగ్రత్తలతో సరుకును నిల్వ చేయడానికి ప్రత్యేక అనుమతి కూడా తీసుకోవడం జరిగింది.

       

మార్చి 24 నుంచి 31 మధ్య కాలంలో స్పైస్ జెంట్ 103 కార్గో విమానాలను 1,42,000 కిలోమీటర్ల వైమానిక దూరంలో 800 టన్నుల సరుకు రవాణా చేసింది. ఈ 103 విమానాలలో 32 విమానాలు అంతర్జాతీయ గమ్యాలు చేరుకున్నాయి.  2020 మార్చి 25 నుంచి 31 తేదీల్లో బ్లూ డార్ట్ 32 దేశీయ కార్గో విమానాలతో 30,800 కిలోమీటర్ల దూరం ప్రయాణించి 464 టన్నుల సరుకును చేరవేసింది. స్పైస్ జెట్ మరియు బ్లూ డార్ట్ వంటి దేశీయ కార్గో ఆపరేటర్లు వాణిజ్య ప్రాతిపదికన కార్గో విమానాలను నడుపుతున్నారు.

అంతర్జాతీయంగా మోకా మరియు ఎయిర్ ఇండియా చైనా అధికారులతో కలిసి క్లిష్టమైన వైద్య సామగ్రి కోసం భారతదేశం మరియు చైనా మధ్య కార్గో ఎయిర్ బ్రిడ్జిని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నాయి. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మరియు విమాన యాన పరిశ్రమ వైద్య పరికరాలను భారతదేశపు మారుమూల ప్రాంతాలకు అత్యంత సమర్థవంతంగా మరియు తక్కువ ఖర్చుతో రవాణా చేయడం ద్వారా  కోవిడ్ -19 కు వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న యుద్ధానికి మద్ధతు ఇచ్చేందుకు నిశ్చయించుకుంది. 


(Release ID: 1610931) Visitor Counter : 105