పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
ఎల్.పి.జి. సిలిండర్లు మరియు పి.ఎం.యు.వై. లబ్ధిదారులకు ఉచిత సిలిండర్ల సరఫరా గురించి జిల్లా నోడల్ అధికారుల (డి.ఎన్.ఓ)తో చర్చించిన పెట్రోలియం సహజవాయు మరియు ఉక్కుశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రదాన్
సామాజిక మార్పునకు ఉజ్వల యోజన ఓ యానకం, కరనోకు వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటంలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రకటన
Posted On:
03 APR 2020 6:30PM by PIB Hyderabad
కోవిడ్ -19 నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో జిల్లాల్లో ఎల్పీజీ సిలిండర్ల పంపిణీని అంచనా వేసేందుకు కేంద్ర పెట్రోలియ్, సహజవాయు మరియు ఉక్కు శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఈ రోజు చమురు మార్కెటింగ్ కంపెనీల జిల్లా నోడల్ అధికారుల(డి.ఎన్.ఓ)తో చర్చించారు. తమకు కేటాయించిన ప్రాంతాల్లో ఎల్.పి.జి. డెలివరీలకు ఈ డి.ఎన్.ఓ.లే బాధ్యత వహిస్తాయి. ఈ సమావేశంలో సహజవాయు మంత్రిత్వశాఖ కార్యదర్శి, సీనియర్ అధికారులతో పాటు ఐ.ఓ.సి.ఎల్, బి.పి.సి.ఎల్, హెచ్.పి.సి.ఎల్ నుంచి ముగ్గురు ఓ.ఎం.సి.లు ఇందులో పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, సామాజిక మార్పునకు ప్రధాన యానకంగా ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన కీలక పాత్ర పోషిస్తుందని, కరోనా వైరస్ వ్యాప్తికి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. 14.2 కిలోల సిలిండర్లకు 3 రీఫిల్స్ లభ్యత మరియు ముందస్తు రిటైల్ సెల్లింగ్ ధర మిగులు పి.ఎం.యు.వై. కష్టమర్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయడం, పి.ఎం.యు.వై. లబ్ధిదారుల కోసం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం తాలుకా వివరాలు తదితర అంశాల గురించి ఆయన ప్రధానంగా మాట్లాడారు. ఈ పపిణీని సజావుగా అమలు చేసేందుకు ప్రతి వారూ పూర్తి స్థాయిలో తమ బాధ్యతను నిర్వర్తించాలని ఆదేశించారు.
లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ అత్యవసరాలైన 15 పోర్ట్ టెర్మినల్స్, 195 ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్లు మరియు రవాణా నెట్ వర్క్ లు పని చేస్తున్నాయని, తద్వారా దేశంలో ఎల్పీజీ ఉత్పత్తుల లభ్యతం మరియు నిరంతరాయ సరఫరా కొనసాగుతుందని భరోసా ఇచ్చారు. ఓ.ఎం.సి. అధికారులను మరియు ఎల్పీజీ డెలివరీ బాయ్స్ ను అభినందించిన ఆయన, దేశంలోని ప్రతి మూల అన్ని గృహాలకు నిరంతరాయంగా ఎల్పీజీ సరఫరా కొనసాగుతోందని, దీని కోసం తమ బృంద సభ్యులు గొప్ప కృషి చేస్తున్నారని, ప్రతి రోజు 60 లక్షలకు పైగా సిలిండర్ల పంపిణీ కొనసాగుతోందని, డి.ఎన్.ఓ.లు, పంపిణీ దారులు, డెలీవరీ బాయ్స్ అంకిత భావంతో కృషి చేయకుంటే ఇది సాధ్యమయ్యేది కాదని అభిప్రాయపడ్డారు. ఎల్పీజీ డెలివరీ చేసేవారు తమకు మరియు సమాజానికి అవసరమైన అన్ని ఆరోగ్య జాగ్రత్తలు తీసుకునేలా చూడాలని, సామాజిక దూరం పాటించాలని, వారి సంక్షేమం కోసం రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా సహా ప్రభుత్వం తీసుకున్న వివిధ కార్యక్రమాల గురించి వారికి అవగాహన కల్పించాలని సూచించారు.
స్థానిక పరిపాలనా అధికారులతో సమన్వయం చేసుకుంటూ పని చేయాలని, సమాచార మాధ్యమాలు మరియు సామాజిక మాధ్యమాల ద్వారా సమాజంతో నిరంతరం సమాచారాన్ని పంచుకోవాలని, అవసరమైన సామగ్రికి నిరంతరం భరోసా కల్పించాలని డి.ఎన్.ఓ.లను కోరారు. అన్ని భద్రతా విధానాలను అవలంబించాలని, ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలియజేసే వివిధ ఆరోగ్య చర్యలను ప్రతి ఒక్కరికీ తెలియజేయాలని సూచించారు. ఏప్రిల్ 5న రాత్రి 9 గంటలకు 9 నిముషాల పాటు ఇంట్లో లైట్లను ఆర్పి కొవ్వొత్తి లేదా దీపం లేదా టార్చ్ లేదా మొబైల్ ఫోన్ ఫ్లాష్ లైట్లను వెలిగించడం ద్వారా దేశానికి సంఘీభావం తెలిపేందుకు ప్రధానమంత్రి చేసిన విజ్ఞప్తికి గరిష్ట స్పందన లభించేందుకు కృషి చేయాలని డి.ఎన్.ఓ.లకు సూచించారు.
లాక్ డౌన్ ప్రారంభంలో చిన్న పాటి సమస్యలు ఎదురైనప్పటికీ, తర్వాత అన్నీ సర్దుకున్నాయని డి.ఎన్.ఓ.లు ఆయన నివేదించారు. సిలిండర్ డెలివరీ వెయిటింగ్ పిరియడ్ తగ్గిందని, ఎల్పీడీ డెలివరీ బాయ్స్ కు, సరఫరాలో వివిధ స్థాయిల్లో పని చేస్తన్న క్షేత్ర స్థాయి సిబ్బందిలో 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటన మనోధైర్యాన్ని నింపిందని తెలిపారు. పి.ఎం.యు.వై. లబ్ధిదారుల కోసం ప్రభుత్వం ప్రకటించిన రిలీఫ్ ప్యాకేజీని కూడా డి.ఎన్.ఓ.లు ప్రచారం చేస్తున్నారు.
(Release ID: 1610919)