నౌకారవాణా మంత్రిత్వ శాఖ

కొవిడ్-19ని ఎదుర్కోడానికి పోర్టులకు సంబంధించిన వారితో శ్రీ మన్సుఖ్ మాండవియా వీడియో కాన్ఫరెన్స్

Posted On: 03 APR 2020 7:34PM by PIB Hyderabad

ఓడరేవుల  కార్యకలాపాలలో భాగస్వామ్యులయ్యే  వినియోగదారులుకొరియర్కార్గో సర్వీసులుదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కస్టమ్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులులాజిస్టిక్ సర్వీస్ ప్రొవైడర్ల తో షిప్పింగ్ మంత్రి (ఇంచార్జి) శ్రీ మన్సుఖ్ మాండవియా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశంలో లాక్డౌన్ కారణంగా ఓడ రేవుల కార్యకలాపాలపై ప్రభావంఎదురయ్యే సవాళ్లుతీసుకుంటున్న చర్యలను ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో షిప్పింగ్ మంత్రిత్వ శాఖ అధికారులుఅన్ని ప్రధాన ఓడరేవుల చైర్‌పర్సన్‌లు పాల్గొన్నారు

ఈ అసాధారణమైన సంక్షోభంలో ఓడరేవుల సంబంధిత అన్ని వ్యవస్థలువ్యక్తుల సహకారం కావాలని  శ్రీ మన్సుఖ్ మాండవియా విజ్ఞప్తి చేశారు. ఈ సంక్షోభాన్ని పోర్ట్ ఆపరేషన్ కోసం అవకాశంగా మార్చడానికి ప్రయత్నాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారుతద్వారా వీటితో సంధానమై ఉన్న వ్యవస్థలు సజావుగా నడుస్తాయన్నారు.

ఓడరేవులునిర్వహణకార్మికుల భద్రత,c దాని వాటాదారులు ఎదుర్కొంటున్న ఇతర సవాళ్లకు సూచనలను శ్రీ మాండవియా ఆహ్వానించారు. కోవిడ్-19 మహమ్మారి వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను నిర్వహించడానికి పోర్ట్ ఆపరేషన్ మరియు కంటైనర్ మేనేజ్‌మెంట్‌లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంపై శ్రీ మాండవియా నొక్కి చెప్పారు.

అధిక పోర్టు ఆపరేషన్ వ్యయంసరుకు రవాణాఓడరేవు రద్దీకార్మికుల కొరతకార్మికులుట్రక్ డ్రైవర్ల కదలికసరఫరా నిర్వహణలాక్డౌన్ కారణంగా ఇతర ఇబ్బందులపై ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. 

                                                ****


(Release ID: 1610906)