రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

కరోనా వైరస్(కోవిడ్ -19)పై పోరాటానికి మద్దతు కొనసాగిస్తున్న భారత వైమానిక దళం

Posted On: 03 APR 2020 8:20PM by PIB Hyderabad

నావెల్ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అడ్డుకునే ప్రయత్నాలకు భారత వైమానిక దళం (ఐ ఏ ఎఫ్) తన మద్దతును కొనసాగిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాప్తిని సమర్ధవంతంగా, అమోఘంగా అడ్డుకునేందుకు అవసరమైన మందులు తదితర సాధనాలను భారత వైమానిక దళం రవాణా చేస్తోంది.

గత రెండు రోజుల్లో ఈశాన్య ప్రాంతంలోని  గువాహతి, డీబ్రూగర్ మరియు మోహన్ బారి నుంచి ; మధ్య భారత ప్రాంతంలోని ప్రయాగ్ రాజ్,  గోరఖ్ పూర్, బరేలి మరియు ఆగ్రా నుంచి;  కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూ & కాశ్మీర్ మరియు లద్దాఖ్ నుంచి అత్యవసర మందులను మరియు సరుకులను ఐ ఏ ఎఫ్ విమానంలో తరలించారు.

అంతేకాకుండా రెండవ తేదీ గురువారం “ఆపరేషన్ సంజీవని” పేరిట  ఐ ఏ ఎఫ్ విమానంలో అత్యవసర మందులను మాల్దీవులలోని మాలేకు తీసుకెళ్ళారు. లాక్ డౌన్ వల్ల మాల్దీవులలో మందుల సరఫరా నిలిచిపోయి మందుల కొరత ఏర్పడింది. వివిధ శాఖలు, ప్రభుత్వ సంస్థల  సహకారంతో ఇండియా ఆపరేషన్ విజయవంతంగా పూర్తిచేయగలిగింది. 

విశ్వ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి వైమానిక దళం నిరంతర తోడ్పాటును అందజేస్తోంది. దేశవ్యాప్తంగా వైమానిక దళం స్థావరాలలో క్వారెంటైన్ సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసి సిద్ధంగా ఉన్నారు. 

 


(Release ID: 1610876) Visitor Counter : 192