వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

అంకుర సంస్థల పర్యావరణ వ్యవస్థపై భాగస్వాములతో శ్రీ పీయూష్‌ గోయల్‌ దృశ్య-శ్రవణ మాధ్యమ సమావేశం

Posted On: 02 APR 2020 7:34PM by PIB Hyderabad

అంకుర సంస్థల పర్యావరణ వ్యవస్థపై భాగస్వాములతో కేంద్ర రైల్వే, వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్‌ గోయల్‌ ఇవాళ దృశ్య-శ్రవణ మాధ్యమ సమావేశం నిర్వహించారు. ప్రముఖ అంకుర సంస్థలతోపాటు సెబి, సీబీడీటీ, సీబీఐసీ, నీతి ఆయోగ్‌, సిడ్బి తదితర సంస్థల ఉన్నతాధికారులు కూడా ఇందులో పాల్గొని దేశంలో కోవిడ్‌-19 ప్రభావం, జాతీయ దిగ్బంధం తదితర పరిస్థితులపై చర్చించారు. ఆయా సంస్థలు అందిస్తున్న సహాయ సహకారాలకుగాను మంత్రి అభినందనలు తెలిపారు. అయితే, దేశం ప్రస్తుతం అనూహ్య సంక్షోభ పరిస్థితుల్లో ఉన్నందున సకాలంలో పరిష్కార చర్యలు చేపట్టాల్సి ఉందని సూచించారు. ‘యాక్షన్‌ కోవిడ్‌-19 టీమ్‌’ పేరిట రూ.100 కోట్లతో కార్యాచరణకు శ్రీకారం చుట్టడం హర్షణీయమన్నారు. అంకుర సంస్థల ప్రతినిధులు వివిధ సమస్యలను మంత్రి దృష్టికి తేవడంతోపాటు తమ సూచనలను అందజేశారు. దీపిసౌ శ్రీ గోయల్‌ స్పందిస్తూ సంయుక్త కృషితో సమస్యలను అధిగమిద్దామని పిలుపునిచ్చారు.

***



(Release ID: 1610519) Visitor Counter : 136