వ్యవసాయ మంత్రిత్వ శాఖ
ఈ-నామ్ వేదికలో కొత్త అంశాలకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీకారం
ఈ కొత్త అంశాలు కోవిడ్-19పై మన పోరులో కీలక చర్యలు: శ్రీ తోమర్
Posted On:
02 APR 2020 7:36PM by PIB Hyderabad
జాతీయ వ్యవసాయ విపణి (ఈ-నామ్) వేదికలో సాఫ్ట్‌వేర్‌పరంగా జోడించిన కొత్త అంశాలను కేంద్ర వ్యవసాయ-రైతు సంక్షేమ-గ్రామీణాభివృద్ధి-పంచాయతీరాజ్ శాఖల మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ఇవాళ ప్రారంభించారు. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం కోసం వారు నేరుగా టోకు మండీలకు రావాల్సిన అవసరం లేకుండా వ్యవసాయ విపణి వేదిక బలోపేతం కోసం ఈ కొత్త అంశాలను ప్రభుత్వం జోడించింది. కోవిడ్-19పై పోరాటం సాగుతున్న వేళ వ్యవసాయ మార్కెట్లలో రద్దీ తొలగింపు లక్ష్యంగా జోడించిన అంశాలు ఇలా ఉన్నాయి: 1) గిడ్డంగి ఆధారిత విక్రయ విభాగం 2) ఎఫ్‌పీఓ విక్రయ విభాగం. దీంతోపాటు మండీల మధ్య, రాష్ట్రాల మధ్య విక్రయాల వెసులుబాటు కోసం రవాణా విభాగం స్థాయి పెంచబడింది.
ఈ సందర్భంగా శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ- ఈ-నామ్ పోర్టల్‌లో ఇప్పటికే 16 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 585 మండీలను సమీకృతం చేసినట్లు తెలిపారు. త్వరలో అదనంగా 415 మండీలను చేర్చి మొత్తం 1,000కి పెంచనున్నట్లు వివరించారు. పరోక్ష బేరసారాలు, మొబైల్ ఆధారిత చెల్లింపులద్వారా కోవిడ్-19పై పోరాటంలో భాగంగా సామాజిక దూరం పాటించే వీలుంటుందన్నారు. ప్రస్తుతం జోడించిన అంశాలు ఈ పోరుకు మరింత బలాన్నిస్తాయని చెప్పారు.
-
ఈ-నామ్ సాఫ్ట్‌వేర్‌లో ‘బదలాయించదగిన గిడ్డంగి రసీదు’ (e-NWR)ల విభాగం
-
గిడ్డంగుల అభివృద్ధి-నియంత్రణ ప్రాధికార సంస్థ- WDRAలో నమోదైన గిడ్డంగుల కోసం చెల్లింపుల సదుపాయంతో గిడ్డంగి వాణిజ్య ప్రక్రియ ప్రారంభం.
-
డబ్ల్యూడీఆర్‌ఏ నమోదిత గిడ్డంగులకు రైతులు ఉత్పత్తులను తరలించే సౌలభ్యం
-
ఆంధ్రప్రదేశ్ (23), తెలంగాణలో (14) గిడ్డంగులకు ఇప్పటికే గుర్తింపు జారీ
-
ఎఫ్‌పీఓ విక్రయ విభాగం
-
రైతు వ్యవసాయోత్పత్తుల సేకరణ సంస్థలు తామున్న చోటనుంచే వాటి చిత్రాలు, ఇతర వివరాల అప్‌లోడ్‌సహా బిడ్డింగ్ చేసే వెసులుబాటుతో విక్రయ విభాగం ప్రారంభం.
-
తమ ఉత్పత్తుల నాణ్యత నివేదిక/ఫొటోను ఎఫ్‌పీఓలు అప్‌లోడ్ చేసే వెసులుబాటు; దీంతో బిడ్డింగ్‌కు ముందు వ్యాపారులు పరిశీలించుకునే వీలు.
-
రవాణా సదుపాయ విభాగం ప్రారంభం
-
ప్రస్తుతం వ్యక్తిగత వ్యాపారులకు వ్యక్తిగత రవాణాదారులు ఈ-నామ్‌ద్వారా సేవలందిస్తున్నారు. ఈ విధానం స్థానంలో ఇప్పుడు పెద్ద రవాణా సంస్థలతో సంధానానికి వీలు కల్పించే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. దీంతో ఇక 3,75,000 ట్రక్కులు అందుబాటులోకి వస్తాయి.
ఈ కొత్త సదుపాయాలతో రైతులు మండీలకు రాకుండానే తమ ఉత్పత్తులను గిట్టుబాటు ధరకు విక్రయించుకునే వీలు కలుగుతుందని శ్రీ తోమర్ చెప్పారు. అలాగే భారీ/టోకు కొనుగోలుదారులతోపాటు ఆహార తయారీ సంస్థల ప్రతినిధులు మండీలకు వెళ్లే అవసరం లేకుండా నేరుగు కొనుగోలు చేసే వీలు కల్పించాలని రాష్ట్రాలకు సూచించినట్లు తెలిపారు.
*******
(Release ID: 1610517)
Visitor Counter : 186