శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఆటోమెటెడ్ వెంటిలేటర్ల తయారీ కోసం విప్రో త్రీడీతో ఒప్పందం చేసుకున్న శ్రీ చిత్ర తిరునాల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ (ఎస్.సి.టి.ఐ.ఎమ్.ఎస్.టి)
Posted On:
02 APR 2020 6:23PM by PIB Hyderabad
జాతీయ ప్రాధాన్యత కలిగిన శ్రీ చిత్ర తిరుణాల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ (ఎస్.సి.టి.ఎమ్.ఎస్.టి) సంస్థ బెంగళూరులోని విప్రో త్రీడీతో కలిసి ఆర్టిఫిషియల్ మాన్యువల్ బ్రీతింగ్ యూనిట్ (ఎ.ఎం.బి.యు)ను అభివృద్ది చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఎస్.సి.టి.ఎమ్.ఎస్.టి. రూపు దిద్దిన అత్యవసర వెంటిలేటర్ వ్యవస్థ అభివృద్ధి, క్లినికల్ ట్రయల్ మరియు తయారీని కోసం ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం జరిగింది.
భారతదేశం కోవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో తలెత్తబోయే అత్యవసరాలు తీర్చేందుకు ఈ వెంటిలేటర్లు సహాయపడతాయి. ఆర్టిఫిషియల్ మాన్యువల్ బ్రీతింగ్ యూనిట్ (ఎ.ఎం.బి.యు) బ్యాగ్ లేదా బ్యాగ్ – వాల్వ్ – మాస్క్ (బి.వి.ఎం) అనేది చేతితో తీసుకెళ్ళగల పరికరం. ఇది రోగికి శ్వాస తీసుకోవడానికి తగినంత వెంటిలేషన్ అందించడానికి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం దీని పని తీరు కోవిడ్ -19 రోగులకు ప్రయోజనకారి అవుతుందా లేదా అనే విషయం తెలియడానిక మరి కొంత సమయం పట్టవచ్చు. ప్రస్తుతానికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొనే రోగుల విషయంలో, ఐ.సి.యు అందుబాటులో లేని సమయంలో ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
వేగవంతమైన ఉత్పత్తిని ప్రారంభించేందుకు తక్షణం అందుబాటులో ఉన్న భాగాలతో ఈ పరికరం రూపొందించబడింది. తద్వారా ఇది ప్రత్యామ్నాయ పరిష్కారం అవుతుంది. క్లిష్ట పరిస్థితుల్లో సులభంగా వెంటిలేషన్ సౌకర్యాన్ని రోగివద్దకు తీసుకు వెళ్లేందుకు ఇది మంచి పరికరం.
ఈ పోర్టబుల మరియు బరువు తక్కువ ఉండే ఈ పరికరం కంట్రోల్డ్ రేట్ ఆఫ్ ఎక్స్ పిరేషన్, ఇన్స్పిరేటరీ టూ ఎక్స్ పిరేటరీ రేషియో, టిడల్ వాల్యూమ్ లాంటి వాటి ద్వారా సానుకూల పీడన వెంటిలేషన్ ను అందించగలుగుతుంది. వెంటిలేషన్ అందనంగా అందించేందుకు పాజిటివి ఎండ్ ఎక్స్ పిరేటరీ ప్రెజర్ (పి.ఈ.ఈ.పి) వాల్వు అందుబాటులో ఉంది. ఈ పరికరం ఐసోలేషన్ గదిలో సహాయ సిబ్బందికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కోవిడ్ రోగులకు సురక్షితమైన మరియు సమర్థవంతమైన వెంటిలేషన్ అందించగలదని భావించబడుతోంది.
ఒక వారంలో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసినట్లు ఎస్.సి.టి.ఐ.ఎం.ఎస్.టి. సంచాలకు ఆశాకిశోర్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ -19 వేగంగా వ్యాప్తిస్తున్న తీవ్రమైన పరిస్థితుల్లో సులభమైన ఆర్టిఫిషియల్ మాన్యువల్ బ్రీతింగ్ యూనిట్ (ఎ.ఎం.బి.యు) సహాయకారిగా ఉంటుందని అన్నారు. ఈ సంస్థ ఎప్పటినుంచో అప్పటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక వైద్య పరికరాలను అభివృద్ధి చేస్తోందని, ప్రస్తుత కీలక పరిస్థితుల్లో కూడా ఇదే తరహా ప్రయోజనకారి అయిన వైద్య పరికరాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలిపారు. మన ఆహ్వానానికి విప్రో త్రీడీ సానుకూలంగా స్పందించిందని, సాంకేతిక బృందాలతో విస్తృతంగా చర్చించి నమానాను అంచనా వేశామని, వారి సహకారంతో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి, వీటి తయారి త్వరితగతిన ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలిపారు.
ఈ ఒప్పందంలో మెరుగుదల, క్లినికల్ ట్రయల్స్ మరియు ఉత్పత్తిలో ఉమ్మడి భాగస్వామ్యం ఉండనుంది. కోవిడ్ -19 మహమ్మారి వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో ఈ ప్రయోజనాత్మక ఒప్పందం దేశానికి మేలు చేయనుంది. శరత్, నగేష్, వినోద్ కుమార్ ల నిపుణుల బృందంతో పాటు ఆర్టిఫిషియన్ ఆర్గానిక్ డివిజన్ సభ్యులు, బయో మెడికల్ టెక్నాలజీ విభాగం, అనస్థీషియా విభాగపు సిబ్బంది వంటి అనేక విభాగాలు ఇందులో పాలు పంచుకోనున్నాయి.
(మరిన్ని వివరాల కోసం సంప్రదించండి... శ్రీమతి స్వప్న వామదేవన్, పి.ఆర్.ఓ, ఎస్.సి.టి.ఐ.ఎం.ఎస్.టి, ఫోన్ - 9656815943, ఈ మెయిల్: pro@sctimst.ac.in)
(Release ID: 1610461)
Visitor Counter : 242