కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
లాక్ డౌన్ వల్ల ఇప్పటివరకు 34 లక్షల పిఓఎస్ బి (పోస్టాఫిస్ సేవింగ్స్ బ్యాంకు) లావాదేవిలు, 6.5 లక్షల ఐపిపిబి (భారతీయ పోస్ట్ ప్రెమెంట్స్ బ్యాంకు) లావాదేవిలపై ప్రభావం
Posted On:
01 APR 2020 6:34PM by PIB Hyderabad
ప్రస్తుత లాక్ డౌన్ కాలంలో మార్చి 31వ తేదీ వరకు 34 లక్షల పిఓఎస్ బి (పోస్టాఫిస్ సేవింగ్స్ బ్యాంకు) లావాదేవిలు, 6.5 లక్షల ఐపిపిబి (భారతీయ పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు) లావాదేవిలపై ప్రభావం పడింది.
స్పీడ్ పోస్ట్ రిజిస్టర్డ్ లెటర్స్, పార్సిళ్లు, మనీ ఆర్డర్లతో సహా సుమారు 2 లక్షల అకౌంటబుల్ మెయిల్స్ పంపిణీ చేశారు.
అవసరమైన తపాలా మరియు ఆర్థిక సేవలను అందించడానికి సంచార పోస్టాఫీసులు కేరళ, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, మరికొన్ని సర్కిళ్లలో పనిచేస్తున్నాయి. ఈ సంచార పోస్టాఫీసుల రూట్లను అవసరాలను బట్టి నిర్ణయిస్తారు.
సరకు రవాణా (కార్గో) విమానయాన సంస్థలు మరియు సొంత మెయిల్ మోటారు నెట్‌వర్క్‌ను ఉపయోగించడం ద్వారా దేశంలోని ఎంపిక చేసిన ప్రదేశాల నుండి గమ్యస్థానాలకు వివిధ సంస్థల అభ్యర్థనల ప్రకారం వెంటిలేటర్లు, కోవిడ్-19 టెస్ట్ కిట్లు మరియు ఇతర వైద్య పరికరాలను కూడా పోస్టల్ విభాగం తరలిస్తోంది.
ఇటువంటి సేవలు అందించడానికి సర్కిళ్లు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సంప్రదిస్తున్నాయి.
పుదుచ్చేరి నుండి ఒడిశా రాష్ట్ర మెడికల్ కార్పొరేషన్, గుజరాత్ స్టేట్ మెడికల్ కార్పొరేషన్లకు వెంటిలేటర్లను పోస్టల్ నెట్‌వర్క్ ద్వారా పంపించారు. ఆన్-లైన్ మెడిసిన్ కంపెనీ నెట్‌మెడ్స్.కామ్, ఇ-కామర్స్ కంపెనీ అమెజాన్ కూడా మెట్రోలు మరియు కొన్ని ఇతర ప్రదేశాలలో ఔషధాలు, అవసరమైన వస్తువుల పంపిణీ కోసం ఇండియా పోస్ట్‌ను సంప్రదించాయి.
మెడికల్ కిట్ల పంపిణీ కోసం తెలంగాణ సర్కిల్ ఆరోగ్య శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇండియన్ డ్రగ్ మాన్యుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ (ఐడిఎంఎ) భాగస్వామ్యంతో గుజరాత్ సర్కిల్ సూరత్, భరూచ్, వల్సాద్, రాజ్‌కోట్, జైపూర్, పూణే మరియు కోల్‌కత్తాలకు వైద్య సామాగ్రి మరియు అవసరమైన మందులను పంపించింది. కోల్‌కతా నుండి సిలిగురి, రాంచీ, పాట్నాకు రోడ్డు రవాణా నెట్‌వర్క్ ద్వారా మందులు రవాణా చేశారు.
వితంతుల కోసం గుజరాత్ ప్రభుత్వ పథకం గంగా స్వరూప్ యోజన కింద, వితంతు లబ్ధిదారులకు గ్రామీణ మరియు చిన్న పట్టణ ప్రాంతాల్లో ఇటువంటి చెల్లింపులు జరిగేలా గుజరాత్ సర్కిల్ విస్తృతమైన యంత్రాంగాన్ని సిద్ధం చేసింది. 4 లక్షల పోస్ట్ ఆఫీస్ సేవింగ్ బ్యాంక్ ఖాతాల్లో రూ.51 కోట్లు జమ అయ్యాయి. వాటి పంపిణీ ఏప్రిల్ 3 నుండి ప్రారంభమవుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఆసరా సామాజిక భద్రతా పథకం కింద రూ .509 కోట్లు తెలంగాణ సర్కిల్‌కు ద్వారా పంపిణీ చేయనున్నారు. ఇది వృద్ధాప్య, వికలాంగ, వితంతు పెన్షన్ లబ్ధిదారులకు నిర్దేశించింది.
అవసరమైన వారికి చేరేందుకు ఆహార పదార్థాలు, పొడి రేషన్ల పంపిణీకి లాజిస్టిక్ సహాయాన్ని అందించడానికి సర్కిల్స్ వివిధ జిల్లాల యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థలతో భాగస్వామ్యం అవుతున్నాయి. పంచాయతీ కార్యదర్శి, టెలిమెడిసిన్ సెంటర్లు, ప్రజా ప్రతినిధుల స్థాయికి అభ్యర్థనలను పంపడానికి సర్కిల్స్ టెలిగ్రామ్ గ్రూపులు మరియు హెల్ప్ లైన్ నంబర్లను కూర్పు చేశాయి. తన ట్విట్టర్ సేవా హ్యాండిల్‌లో అందుకున్న మందులు మరియు అవసరమైన వస్తువుల అభ్యర్థనలకు శాఖా పరంగా సేవలందించడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ అభ్యర్థనలపై వెంటనే స్పందించి వాటిని గమ్యాలకు సాధ్యమైనంత తక్కువ సమయంలో చేర్చడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి.

(పోర్ట్‌బ్లెయిర్ మునిసిపాలిటీ ప్రాంతంలో ప్రాణ రక్షణ మందుల పంపిణీ కోసం అండమాన్ అడ్మినిస్ట్రేషన్ పోస్ట్ ఆఫీస్ సహాయం కోరింది)

డాక్టర్ రాజగోపాల్ త్రివేండ్రం ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలియేటివ్ సైన్స్, రీజినల్ క్యాన్సర్ సెంటర్ త్రివేండ్రం, కొంతమంది ఆసుపత్రి అధికారులకు పంపిణీ చేసిన మందులతో కూడిన స్పీడ్ పోస్ట్ పార్శిల్

కటక్ వద్ద పోస్ట్ మాన్ ద్వారా ఔషధాలు, నిత్యావసరాల పంపిణీ

పుదుచ్చేరి నుండి బుక్ చేసుకున్న అహ్మదాబాద్ & భువనేశ్వర్ కోసం వెంటిలేటర్లు
(Release ID: 1610137)
Visitor Counter : 254