శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 వ్యాప్తిపై ప్రజలలో అవగాహన పెంచేందుకు టిఐఎఫ్ఆర్ చొరవ
కోవిడక్ష-19 విషయంలో ప్రచారంలో ఉన్నఅపోహలను తొలగించేందుకు సహాయం చేయడం దీని ఉద్దేశం
సులభంగా అర్థం చేసుకునేందుకు వీలైన పద్ధతిలో ఎక్కువమందికి చేరేలా ప్రాంతీయ భాషలలో అందించే ఏర్పాటు
Posted On:
01 APR 2020 11:36AM by PIB Hyderabad
చైనాలోని ఉహాన్‌లో బయటపడిన కోవిడ్ -19 ప్రస్తుతం ప్రపంచమంతా వ్యాపించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని మహమ్మారిగా ప్రకటించింది. ప్రస్తుతం ఇది 204 దేశాలకు వ్యాపించింది. ఈ మహమ్మారి తో పాటే ప్రజలలో దీనికి సంబంధించిన మూఢనమ్మకాలు, భయాలు, అపోహలు ప్రచారంలోకి వచ్చాయి. ఇలాంటి సమయంలో అతి పెద్ద సవాలు ప్రజలను సామాజిక దూరంపాటించేలా చేయడం, ఐసోలేషన్ , క్వారంటైన్, లాక్‌డౌన్ పాటించమని చెప్పడం.
సామాజిక దూరాన్ని మనమెందుకు పాటించాలి? ఇందుకు సంబంధించిన అపోహలను తొలగించి ప్రజారోగ్య విషయంలో శాస్త్రీయ దృష్టితో ప్రజలకు దీనిపై అవగాహన కల్పించేందుకు టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చి ( టిఐఎఫ్ఆర్) సవివరమైన సమాచారాన్ని తయారుచేసింది..
పరిశోధకులు పలు ప్రాంతీయ భాషలలో యూ ట్యూబ్ వీడియోలను రూపొందించి సామాజిక దూరం పాటించడం వల్ల కోవిడ్ -19 వంటి వైరస్‌లను ఎలా అదుపు చేయవచ్చో వివరించారు. ఈ సమాచారం వాషింగ్టన్ పోస్ట్ లో ప్రచురితమైన హారీ స్టీవెన్స్ సమాచారం ఆధారంగా అందించారు.
విద్యార్థులు, కుటుంబాలు, ఫ్యాకల్టీల స్వచ్ఛంద సహకారంతో 9 భాషలలో ఈ సమాచారాన్ని ఇంగ్లీషు, హిందీ, బెంగలి, కొంకణి, మారాఠి, మలయాళం, ఒడియా, తమిళం ,తెలుగు లలో తీసుకువచ్చినట్టు టిఐఎఫ్ ఆర్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఆర్నాబ్ భట్టాచార్య తెలిపారు. త్వరలోనే ఈ సమాచారాన్ని గుజరాతి, పంజాబి, హర్యాన్వి, అస్సామీ భాషలలో వెలువరించనున్నట్టు చెప్పారు.
కరోనా వైరస్ కు సంబంధించి ప్రస్తుతం ప్రచారంలో ఉన్న రకరాల అపోహలను కొట్టిపారేస్లూ వాస్తవ సమాచారాన్ని ప్రజలకుఅందించడమే టిఐఎప్ఆర్ ఆలోచన. ఈ వ్యాధి విదేశాలలో పుట్టింది. దీనికి సంబంధించి మనం మన ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ప్రజలలో అవగాహన పెంచడానికి ఈ ప్రయత్నం ఉపకరిస్తుందని డాక్టర్ భట్టాచార్య అన్నారు.
తదుపరి దశలో ఇంట్లో అందుబాటులో ఉండా మెటీరియల్‌తో మాస్క్‌లు తయారు చేయడానికి టిఐఎఫ్ఆర్ బృందం పనిచేస్తుంది. ఇందుకు పోస్టర్లు, వీడియోలు త్వరలోనే విడుదల అవుతాయి. వైరస్ వ్యాప్తి వెనుక ఉన్న శాస్త్రీయ అంశాలను వివరించేందుకు , ప్రజలలో అపోహలు తొలగించేందుకు ప్రజలతో ,శాస్త్రవేత్తలు తమ అభిప్రాయాలు పంచుకునేందు టిఐఎఫ్ ఆర్ చాయ్ అండ్ వై పేరుతో ఒక ప్లాట్ ఫామ్ ను ఏర్పాటు చేసింది.
(Release ID: 1609896)
Visitor Counter : 201