ఆర్థిక మంత్రిత్వ శాఖ
జి20దేశాల రెండో అసాధారణ, కేంద్ర బ్యాంకు గవర్నర్ల ప్రత్యక్ష
దృశ్యమాధ్యమ సమావేశంలో పాల్గొన్న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి
प्रविष्टि तिथि:
31 MAR 2020 8:15PM by PIB Hyderabad
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కోవిడ్-19 మహమ్మారి ప్రభావం గురించి చర్చించేందుకు సౌదీ అరేబియా అధ్యక్షతన ఇవాళ ఏర్పాటైన జి20 ఆర్థిక మంత్రుల, కేంద్ర బ్యాంకు గవర్నర్ల రెండో అసాధారణ ప్రత్యక్ష దృశ్యమాధ్యమ సమావేశంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. కాగా, 2020 మార్చి 23న ఈ తరహా తొలి సమావేశం సందర్భంగా కోవిడ్-19 పరిణామాలపై ఎప్పటికప్పుడు చర్చించడానికి ఇదేరీతిలో తరచూ సమావేశం కావాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా 2020 మార్చి 26నాటి జి20 కూటమి దేశాధినేతల దృశ్యమాధ్యమ సమావేశం చేసిన ప్రకటనపై చర్చించారు. ఈ సందర్భంగా జి20 కూటమి కార్యాచరణ ప్రణాళికకు శ్రీమతి సీతారామన్ మద్దతు పలికారు. ఆర్థిక వ్యవస్థల సత్వర పునరుద్ధరణ దిశగా తగిన మద్దతును ఆర్థిక వ్యవస్థలు కల్పించాల్సిన అవసరాన్ని ఆమె నొక్కిచెప్పారు.
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ-IMF ఆర్థిక సహాయ విధివిధానాల సమీక్షతోపాటు దేశాల మధ్య పరస్పర ద్రవ్యమార్పిడి నెట్‌వర్క్‌ను మరింత విస్తరించడంపై ఆర్థికమంత్రి నిర్దిష్ట సూచనలు చేశారు. కోవిడ్-19 ఫలితంగా ఏర్పడిన అనూహ్య సంక్షోభం నేపథ్యంలో సంబంధిత ఆర్థిక అవసరాలను తీర్చేందుకు వినూత్న, వివేకపూరిత పద్ధతులను ఆవిష్కరించాలని ఐఎంఎఫ్‌ను కోరారు. అలాగే ఐఎంఎఫ్ వద్దగల వనరులతో స్వల్పకాలిక మార్పిడి సదుపాయం ప్రారంభించి ద్రవ్యమార్పిడిని ప్రోత్సహించాలని కోరారు.
కోవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో భారత ప్రభుత్వ కృషికి సంబంధించి, అనుభవాలను జి20 దేశాల ఆర్థిక మంత్రులతో ఆమె పంచుకున్నారు. ఈ దిశగా ఇటీవల పేదలకు రూ.1.7 లక్షల కోట్ల విలువైన ఆర్థిక ఊరట ప్యాకేజీ ప్రకటించడంసహా రూ.150 కోట్లతో అత్యవసర ఆరోగ్య నిధిని ఏర్పాటు చేసినట్లు వివరించారు.
(रिलीज़ आईडी: 1609783)
आगंतुक पटल : 153