విద్యుత్తు మంత్రిత్వ శాఖ
కోవిడ్-19పై పోరాటంలో భాగంగా కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద
‘పీఎం కేర్స్’ నిధికి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రూ.200 కోట్ల విరాళం
प्रविष्टि तिथि:
31 MAR 2020 8:17PM by PIB Hyderabad
కోవిడ్-19పై పోరాటానికి మద్దతుగా కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ పరిధిలోని ప్రభుత్వరంగ బ్యాంకింగేతర ఆర్థిక సహాయ సంస్థ ‘పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (PFC) ‘పీఎం కేర్స్’ నిధికి రూ.200 కోట్ల విరాళం ప్రకటించింది. ఈ శాఖతోపాటు నవ్య-పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ పరిధిలోని అన్ని ప్రభుత్వరంగ సంస్థలు ప్రకటించిన రూ.925 కోట్ల విరాళంలో ఇదొక భాగం. దీంతోపాటు పీఎఫ్‌సీ ఉద్యోగులు తమ ఒకరోజు జీతాన్ని విరాళం కింద ఇస్తామని స్వచ్ఛందంగా ప్రకటించారు. అంతకుముందు రాజస్థాన్‌లో సేవలందిస్తున్న భారత రెడ్‌క్రాస్ సొసైటీకి రూ.50 లక్షల ఆర్థిక సహాయాన్ని కూడా పీఎఫ్‌సీ ప్రకటించింది.
(रिलीज़ आईडी: 1609764)
आगंतुक पटल : 138