రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
ఏప్రిల్ 1నుంచి మందులుగా గుర్తింపు పొందిన వైద్య ఆరోగ్య పరికరాలు
Posted On:
31 MAR 2020 8:04PM by PIB Hyderabad
ఔషధాలు మరియు సౌందర్య సాధనాల చట్టం, 1940 మరియు ఔషధాలు మరియు సౌందర్యసాధనాల నిబంధనలు, 1945 కింద గుర్తించిన / నియంత్రితమైన వైద్య ఆరోగ్య పరికరాలను ప్రభుత్వం నియంత్రిస్తోంది.
పైన తెలియజేసినవాటిలో నాలుగు వైద్య ఆరోగ్య పరికరాలను అంటే 1. హృద్రోగ సంట్లు 2. డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్లు 3. కండోములు 4. ఇంట్రా యుటెరిన్ పరికరం ( సియు-టి) జాబితాలోని వైద్య ఆరోగ్య పరికరాలుగా గుర్తించారు. వీటికి అత్యధిక పరిమితి ధరలను నిర్ణయించారు. ఈ నాలుగు వైద్య ఆరోగ్య పరికరాలు ధరల నియంత్రణ పరిధిలోకి వస్తాయి. ఇక జాబితాలో లేని మిగతా వైద్య ఆరోగ్య పరికరాలకు సంబంధించి చూస్తే వాటిలో గుర్తింపుపొందిన లేదా నియంత్రితమవువున్న మందుల అత్యధిక రీటెయిల్ ధరలను ( ఎంఆర్ పిలు) ప్రస్తుతం ఎన్ పిపిఏ పర్యవేక్షిస్తోంది. నియమ నిబంధనల ప్రకారం గత పన్నెండు నెలల ధరలమీద పదిశాతం అధికం కాకుండా ధరలుండే ఆయా తయారీదారులు, ఎగుమతిదారులు జాగ్రత్తలు తీసుకోవాలి.
మార్చి 31న విడుదల చేసిన ఎన్ పిపి ఏ ప్రకటన ప్రకారం ఏప్రిల్ 1, 2020నుంచి అన్ని వైద్య ఆరోగ్య పరికరాలను ఔషధాలు ( ధరల నియంత్రణ) ఆర్డర్ 2013 నిబంధనల ప్రకారం పరిగణించాల్సి వుంటుంది.
కాబట్టి ఏప్రిల్ 1, 2020 నుంచి అన్ని వైద్య ఆరోగ్య పరికరాలను ఔషధాలుగా పరిగణించి నాణ్యత నియంత్రణ, ధరల పర్యవేక్షణ చేస్తారు.
(Release ID: 1609757)
Visitor Counter : 261