రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
జాబితాలోని ఔషధాల ( ఫార్ములేషన్లు) అత్యధిక పరిమితి ధరల్లో సవరింపులు
Posted On:
31 MAR 2020 8:26PM by PIB Hyderabad
ఔషధాల ( ధరల నియంత్రణ) ఆర్డర్ 2013లోని నియమ నిబంధనలకు అనుగుణంగా జాబితాలోని 883 ఔషధాల అత్యధిక పరిమితి ధరలో సవరింపు చేస్తూ జాతీయ ఔషధ ధరల నిర్ణాయక సంస్థ ( ఎన్ పిపి ఏ) నిర్ణయం తీసుకుంది.
ఎన్ పిపి ఏ సమావేశం మార్చి 31 న జరిగింది. కోవిడ్ 19 మహమ్మారి కారణంగా ఏపిఐల పంపిణీకి ఏర్పడిన విఘాతం సమసిపోయి పరిస్థితి తిరిగి మామూలు స్థాయికి చేరుకుందని, మందుల తయారీకి సంబంధించిన వస్తువుల ధరల్లో అసాధారణ హెచ్చు తగ్గులు లేవని ఎన్ పిపి ఏ గుర్తించింది. దాంతో సాధారణంగా వుండే ధరల సవరింపులకు అనుమతిని ఇవ్వడం జరిగింది.
టోకు ధరల సూచీలో పెరుగుదల అనేది వాణిజ్య మరియు దేశీయ వ్యాపార ప్రోత్సాహక విభాగం, కేంద్ర వాణిజ్య, పారిశ్రామిక శాఖ, భారతదేశ ప్రభుత్వం ప్రచురించే డాటాను ఆధారం చేసుకొని వుంటుంది. అత్యధిక ధరలో పెరుగుదల అనేది టోకు ధరల సూచీ మీద ఆధారపడి వుంటుంది. అది 1. 88468. ఔషధాల అత్యధిక ధర సవరణలో హృద్రోగులకు వేసే స్టెంట్ ధరకూడా కలిసి వుంది. సవరించిన దరలు ఏప్రిల్ 1నుంచి అమల్లోకి వస్తాయి. సవరించిన ధరల వివరాలను ఎన్ పి పిఏ వెబ్ సైట్‌లో చూడవచ్చు.
(Release ID: 1609756)
Visitor Counter : 116