నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ

ఇ-ఆఫీస్ విధానంలో ఇంటి నుంచే పని చేస్తున్న ఎంఎన్ఆర్ఇ అధికారులు, సిబ్బంది

వీడియో కాన్ఫరెన్సింగ్ విధానంలో పనిని సమీక్షిస్తున్న మంత్రి శ్రీ ఆర్ కె సింగ్
రెండు పునరుత్పాదక ఇంధన పార్కుల ఏర్పాటుకు రాజస్తాన్ ప్రభుత్వంతో ఎన్ టిపిసి, ఎస్ఇసిఐ ఒప్పందం
మొధేరా సౌర విద్యుదీకరణ పథకం ప్రారంభించిన ప్రభుత్వం

నాడు పోస్టు చేయడమైనది: 27 MAR 2020 4:38PM by PIB Hyderabad

నవ్య, పునరుత్పాదక ఇఃదన వనరుల మంత్రిత్వ శాఖ (ఎంఎన్ఆర్ఇ) సిబ్బంది మొత్తం ఇళ్ల నుంచే ఇ-ఆఫీస్ విధానంలో పని చేస్తున్నారు. ఫైళ్ల కదలికలు, నోట్ల జారీ వంటివి కూడా ఆన్ లైన్ లోనే జరుగుతున్నాయి. సమీక్షా సమావేశాలు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నిర్వహిస్తున్నారు. ఎంఎన్ఆర్ఇ శాఖ మంత్రి శ్రీ ఆర్ కె సింగ్ తమ శాఖ అధికారులతో వరుసగా రెండు రోజులు (27,28 తేదీలు)సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ రంగంలోకి కొత్త పెట్టుబడులు తీసుకురావడం లక్ష్యంగా పునరుత్పాదక ఇంధనం (సౌర, పవన, హైబ్రిడ్) సమీకరణ, స్టోరేజికి సంబంధించిన అన్ని విభాగాలకు ఒకేలా వర్తించే సార్వత్రిక మార్గదర్శకాలు త్వరలో జారీ చేయాలని ఆ సమీక్షా సమావేశంలో నిర్ణయించారు. అలాగే ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులు ప్లాన్ చేసుకోవడానికి వీలుగా కొత్త బిడ్ లు ప్రకటించడం కొనసాగించాలని కూడా నిర్ణయించారు.

ఒక్కోటి 5000 మెగావాట్ల సామర్థ్యం గల రెండు ఆర్ఇ పార్కుల ఏర్పాటు కోసం ఎస్ఇసిఐ, ఎన్ టిపిసి తక్షణం రాజస్తాన్ ప్రభుత్వంతో ఎంఓయు కుదుర్చుకోవాలని నిర్ణయించారు. దీనితో రాజస్తాన్ లోని జైసల్మీర్ లో 25,000 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించతలపెట్టిన అల్ర్టా మెగా ఆర్ఇ పార్క్ ఏర్పాటులో మొదటి దశ పూర్తి కావడానికి మార్గం సుగమం అవుతుంది.గుజరాత్ లోని ఖవాడాలో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం, రక్షణ మంత్రిత్వ శాఖ సంప్రదింపులతో 25,000 మెగావాట్ల సామర్థ్యం గల ఆర్ఇ పార్కుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేయాలని నిర్ణయించారు. ఇరెడాకు అవసరమైన నిధుల కల్పనకు భిన్న మార్గాలు అన్వేషించాలని నిర్ణయం తీసుకున్నారు.
గుజరాత్ లోని మధేరా పట్టణం పూర్తిగా సౌర విద్యుత్తుతోనే పని చేసే విధంగా సంపూర్ణ సౌర విద్యుదీకరణ పూర్తి చేసి సన్ టౌన్ గా మార్చేందుకు మార్గదర్శకాలు జారీ చేశారు. మొధేరా జిల్లాలలోని మెహ్సనా పట్టణంలో ఉన్న సూర్య దేవాలయాన్ని పూర్తిగా సౌర విద్యుత్తుతో పని చేసే విధంగా మార్చాలన్న ప్రధానమంత్రి ఆలోచనను ముందుకు నడిపే లక్ష్యంతో ఒక స్కీమ్ ను కూడా కేంద్రప్రభుత్వం ప్రారంభించింది. మొధేరాలో ఆరు మెగావాట్ల సోలార్ పివి ప్లాంట్ ఏర్పాటు చేయడంతో పాటు 15 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజి, రూఫ్ టాప్ పివి వ్యవస్థలు, స్మార్ట్ మీటర్లు, సోలార్ ఇవి చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తారు.
మొధేరాలో రూ.65 కోట్ల పెట్టుబడితో కూడిన ఈ ప్రాజెక్టుకు 50 శాతం కేంద్ర ఆర్థిక సహాయం (గరిష్ఠంగా రూ.32.50 కోట్లు) అందుతుంది. మిగతా 50 శాతం నిధులు గుజరాత్ ప్రభుత్వం సమకూర్చుకోవాలి. ఈ స్కీమ్ గృహావసరాలు, వ్యవసాయ విద్యుత్ అవసరాలు తీర్చి ఒక నగరం లేదా పట్టణం పూర్తిగా సౌర విద్యుత్తుతో పని చేయడానికి ఒక ప్రయోగాత్మక నమూనాగా నిలుస్తుంది.
ఈ ప్రాజెక్టుకు అవసరం అయిన టెండర్ ప్రక్రియను ఇప్పటికే గుజరాత్ విద్యుత్ కార్పొరేషన్ (జిపిసిఎల్) ద్వారా ప్రారంభించింది. ఈ ఏడాదిలోనే డిసెంబరు నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలన్నది లక్ష్యం. జిపిసిఎల్ ఈ ప్రాజెక్టును అమలుపరుస్తుంది.

***


(రిలీజ్ ఐడి: 1609493) సందర్శకుల సూచీ సంఖ్య : : 173
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , हिन्दी , Marathi , Bengali , Gujarati , Kannada