రైల్వే మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 కు వ్యతిరేకంగా పోరుకు జాతీయ స్థాయిలో జరుగుతున్న కృషికి తోడుగా భారీ స్థాయిలో వైద్య సహాయం అందించడానికి భారతీయ రైల్వేలు సిద్దమౌతున్నాయి.
అత్యవసర సేవల కోసం రైల్వే బోగీలను ఐసోలేషన్ బోగీలుగా మార్చనున్నారు; తొలి దశలో 5000 బోగీలను మార్చాలని నిర్ణయించారు.
రైల్వే ఆసుపత్రుల్లోని 6,500 కు పైగా పడకలను నిర్ణీత వైద్య ప్రమాణాలకు అనుగుణంగా సిద్ధం చేస్తున్నారు.
కోవిడ్-19 సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వ కృషికి రైల్వేల తోడ్పాటు.
Posted On:
30 MAR 2020 6:25PM by PIB Hyderabad
కోవిడ్-19 వ్యాప్తిని నివారించే చర్యల్లో భాగంగా, భారత ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య పరిరక్షణకు సహకరించడానికి భారతీయ రైల్వేలు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా, ప్రయాణీకుల బోగీలను ఐసోలేషన్ బోగీలుగా మార్చనున్నారు. ప్రస్తుతం ఉన్న రైల్వే ఆసుపత్రులను కోవిడ్ అవసరాలకు అనుగుణంగా మార్చనున్నారు. అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా ఆసుపత్రి పడకలను కేటాయించడం, అదనపు వైద్యులను, పారామెడికల్ సిబ్బందినీ నియమించడం వంటి చర్యలను చేపట్టనున్నారు.
అవసరమైన వారికి, ఈ సదుపాయాలన్నీ, భారత ప్రభుత్వం నిర్దేశించిన విధంగా, అందుబాటులో ఉంచడం జరుగుతుంది. భారతీయ రైల్వేలకు చెందిన జనరల్ మేనేజర్లు, వైద్య నిపుణుల పర్యవేక్షణలో అన్ని జోన్లలోనూ ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి.
ప్రభుత్వం ఎప్పుడు కోరితే అప్పుడు, ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా కొంతమంది కరోనా రోగులను ఐసోలేషన్ లో ఉంచేందుకు వీలుగా తొలి దశలో 5,000 ప్రయాణీకుల బోగీలను సిద్ధంచేయాలని భారతీయ రైల్వేలు యోచిస్తున్నాయి. వైద్య పరమైన మార్గదర్శకాలకు అనుగుణంగా, ఐసోలేషన్ కు అవసరమైన ప్రాధమిక సౌకర్యలను ఈ బోగీల్లో సమకూరుస్తారు. అవసరమైన పక్షంలో, మరిన్ని బోగీలను కూడా అందుబాటులోకి తెస్తారు. ఈ బోగీలలో దోమతెరలు, మొబైల్ ఫోనులు, ల్యాప్ టాప్ లు ఛార్జ్ చేసుకునే పాయింట్లు, పారామెడిక్స్ కోసం స్థలం మొదలైనవి కూడా సమకూరుస్తారు. రైల్వే జోన్ల వారీగా ఈ బోగీలను సిద్ధం చేస్తారు.
భారదేశంలో, రైల్వేలకు 125 ఆసుపత్రులు ఉన్నాయి. వాటిలో 70 కి పైగా ఆసుపత్రులను ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా అందుబాటులో ఉండే విధంగా సిద్ధం చేస్తున్నారు. ఈ ఆసుపత్రుల్లో కోవిడ్ కోసం ప్రత్యేకంగా వార్డులను లేదా అంతస్తులను కేటాయించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రోగుల అవసరాలను తీర్చడానికి ఈ ఆసుపత్రుల్లో సుమారు 6,500 పధకాలను సిద్ధం చేస్తున్నారు.
ఆయా ప్రాంతాలలో కోవిడ్-19 నియంత్రణలో నిమగ్నమైన అధికారులకు పెరిగిన అవసరాలను తీర్చడానికి వీలుగా వైద్యులను, పారామెడికల్ సిబ్బందినీ తాత్కాలికంగా నియమించుకోడానికి గల అవకాశాలను అన్వేషించవలసిందిగా సంబంధిత జోనల్ అధికారులకు భారతీయ రైల్వలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాయి. రిటైర్ అయిన రైల్వే వైద్యులను కూడా తిరిగి నియమంచుకోవచ్చునని తెలిపారు.
భారత ప్రభుత్వం చేస్తున్న కృషికి చేయూత నందించడంతో పాటు, కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి జాతీయ స్థాయిలో కొనసాగుతున్న చర్యల్లో భాగం పంచుకోవాలనే ఉద్దేశ్యంతో భారతీయ రైల్వేలు తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తోందన్న విషయాన్ని గమనించవచ్చు.
****
(Release ID: 1609406)
Visitor Counter : 166