కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 వ్యాప్తి కారణంగా కార్పోరేట్ రుణగ్రస్తత తీర్మాన ప్రక్రియలో ఉపశనం కోసం క్రిప్(సిఐఆర్పి) నిబంధనలను సవరించిన భారతీయ రుణగ్రస్తత మరియు దివాలా బోర్డు(ఐబిబిఐ)
Posted On:
30 MAR 2020 5:23PM by PIB Hyderabad
కార్పోరేట్ దివాలా మరియు రుణగ్రస్తత ప్రక్రియలో కొవిడ్-19 వ్యాప్తి కారణంగా ప్రస్తుత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ కాలాన్ని లెక్కలోనికి పరిగణించకుండా క్రిప్(సిఐఆర్పి) నిబంధనలను సవరించింది భారతీయ రుణగ్రస్త మరియు దివాలా బోర్డు(ఐబిబిఐ). ఇది కోడ్లో ఇచ్చిన కాలం మొత్తానికి వర్తిస్తుంది.
29 మార్చి 2020న భారతీయ రుణగ్రస్తత మరియు దివాలా బోర్డు( కార్పోరేట్ వ్యక్తుల కోసం రుణగ్రస్తత తీర్మాన ప్రక్రియ) నిబంధనలు,2016ను ఐబిబిఐ సవరించింది.
కొవిడ్-19 వ్యాప్తిని ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా భారత ప్రభుత్వం 25 మార్చి 2020 నుండి అమలులోనికి వచ్చే విధంగా 21 రోజులు లాక్డౌన్ను విధించింది. కాగా ఈ లాక్డౌన్ సమయంలో దివాలా తీసిన రుణగ్రస్తులైన వృత్తి-వ్యాపార సంబంధిత వ్యక్తులు తమ తమ ప్రణాళికల వివరాల పత్రాలను రుణదాతల సంఘానికి సమర్పించడానికి మరియు వారు నిర్వహించే సమావేశాలకు హాజరు కావడానికి కష్టమయ్యే అవకాశం ఉంది. కావున క్రిప్(సిఐఆర్పి) నిబంధనల ప్రకారం కార్పోరేట్ రుణగ్రస్తత మరియు దివాలా తీర్మాన నిబంధనల వివిధ కార్యక్రమాలను నిర్ణీత కాలంలో పూర్తిచేయుటకు కష్టతరం.
ఈ సవరించిన నిబంధనలు 29 మార్చి 2020 నుండి అమలులోని వస్తాయి. ఇవి www.mca.gov.in and www.ibbi.gov.in. వెబ్సైట్లలో అందుబాటులో ఉంటాయి.
(Release ID: 1609405)
Visitor Counter : 219