హోం మంత్రిత్వ శాఖ
కోవిడ్ వ్యాప్తి కట్టడి విధుల్లో అలక్ష్యం వహించిన నలుగురు జీఎన్‌సీటీడీ అధికారులపై క్రమశిక్షణ చర్యలు
Posted On:
29 MAR 2020 10:25PM by PIB Hyderabad
కోవిడ్-19 (కరోనా వైరస్) కట్టడికి సంబంధించిన విధి నిర్వహణలో అలక్ష్యం కనబరిచిన గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (జీఎన్‌సీటీడీ) చెందిన నలుగురు అధికారులపై సర్కారు క్రమశిక్షణ చర్యలకు దిగింది. కోవిడ్-19 కట్టడికి గాను విపత్తుల నిర్వహణ చట్టం-2005 కింద ఏర్పాటు చేసిన జాతీయ కార్యనిర్వహక కమిటీ చైర్‌పర్సన్ జారీ చేసిన సూచనలకు కట్టుబడి విధులు నిర్వహించాల్సిన ఈ అధికారులు విధి నిర్వహణలో అలక్ష్యం వహించారు. కోవిడ్-19పై పోరులో భాగంగా అమలు చేస్తున్న లాక్డౌన్ సమయంలో ప్రజారోగ్యం, భద్రత సంబంధించి జారీ చేసిన నిబంధనలను అమలు చేయడంలో ఈ అధికారులు తీవ్ర లోపాల్ని కనబరిచారన్న కారణంగా ఈ అధికారులకు సంబంధిత నియంత్రణ విభాగం వీరిపై క్రమశిక్షణ చర్యలకు దిగింది. క్రమశిక్షణ చర్యలకు జారీ అయిన అధికారుల్లో అడిషనల్ చీఫ్ సెక్రెటరీ, ప్రిన్సిపల్ సెక్రెటరీ స్థాయి అధికారులు ఉండడం విశేషం. జీఎన్‌సీటీడీ రవాణా శాఖకు చెందిన అదనపు చీఫ్ సెక్రెటరీ, జీఎన్‌సీటీడీ ఆర్థిక విభాగం ప్రిన్సిపల్ సెక్రెటరీ మరియు డివిజనల్ కమిషనర్ల పై తక్షణ అమలు నిబంధనతో సస్పెండ్ వేటు పడింది. మరోవైపు జీఎన్‌సీటీడీ భూ మరియు భవనాల శాఖకు చెందిన అదనపు చీఫ్ సెక్రెటరి, సలీమ్‌పురాకు చెందిన ఎస్‌డీఎంలకు కూడా షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.
(Release ID: 1609188)
Visitor Counter : 125