మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
కరోనా స్టడీస్ సిరీస్ పేరిట పుస్తకాల సిరీస్ ను ప్రారంభించిన నేషనల్ బుక్ ట్రస్ట్, ఎం.హెచ్.ఆర్.డి
కరోనా అనంతరం భారతదేశంలోని అన్ని వయసుల పాఠకుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పుస్తకాల రూపకల్పన
Posted On:
29 MAR 2020 4:45PM by PIB Hyderabad
రాబోయే కాలంలో మానవ సమాజంలో ప్రాధాన్యత సంతరించుకోనున్న కరోనా మహమ్మారి స్థితిగతులకు నేషనల్ బుక్ ట్రస్ట్ పుస్తకాలుగా తీసుకువస్తోంది. ఈ వైరస్ కారణంగా మానసిక, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాల్లో ఏర్పడిన మార్పుల ప్రాధాన్యతను గుర్తించి భారత ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత ప్రభుత్వ పుస్తక ప్రచురణ మరియు పుస్తక ప్రచార జాతీయ సంస్థ కరోనా స్టడీ సిరీస్ ను ఆవిష్కరించింది. కరోనా మహమ్మారి అనంతరం అన్ని వయసుల పాఠకుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సంబంధిత పఠన సామగ్రిని అందించనుంది.
జాతీయ సంక్షోభానికి ప్రతి స్పందనగా, నూతన పఠన సామగ్రి రూపంలో సహకారం అందించేందుకు ఓ జాతీయ సంస్థగా తమ పరిధిలో చొరవ తీసుకోవడం తమ కర్తవ్యంగా భావిస్తున్నట్లు నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా ఛైర్మన్ ప్రొ. గోవింద్ ప్రసాద్ తెలిపారు. గుర్తింపు పొందిన వివిధ భారతీయ భాషల్లో కరోనా కాలంలో ఎదురైన వివిధ సమస్యలు, సందర్భాలను సరసమైన ధరల్లో పుస్తక రూపంలో ప్రజల్లోకి తీసుకువచ్చేందుకు కరోనా స్టడీ సిరీస్ ను ప్రారంభించామని, ప్రస్తుతం సహకరించేందుకు సిద్ధంగా ఉన్న రచయితలు మరియు పరిశోధకులకు ఇది తగిన వేదిక అని, అనేక అంశాలు ఈ పుస్తకాల్లో పొందుపరచనున్నట్లు ఆయన తెలిపారు.
తాము కరోనా సంబంధిత పరిణామాలను నిశితంగా అనుసరిస్తున్నామని, అదే విధంగా కరోనా మహమ్మారి సవాళ్ళను ఎదుర్కోవడానికి కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని అనేక కార్యక్రమాల నుంచి సూచనలు తీసుకుంటున్నట్లు నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా డైరక్టర్ శ్రీ యువరాజ్ మాలిక్ తెలిపారు. దీని ప్రకారం ఎంపిక చేసిన కొన్ని పుస్తకాల పి.డి.ఎఫ్.లను ఉచితంగా అందించేందుకు #StayHomeIndiaWithBooks శీర్షికతో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని, సమగ్ర దృక్పథంతో ఈ ప్రచురణ సిరీస్ ను కూడా ప్రారంభిస్తున్నట్లు వివరించారు. ఈ సిరీస్ లో మొదటి దశగా కరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన మానసిక – సామాజిక ప్రభావం, అధిగమించవలసిన మార్గాలు అనే అంశం మీద పుస్తకాలను సిద్ధం చేసేందుకు అనుభవజ్ఞులైన కొందరు మనస్తత్వ వేత్తలు మరియు సలహాదారులతో కూడిన ఓ అధ్యయన సమూహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ పుస్తకాలను ఈ-పుస్తకాలు మరియు అచ్చు పుస్తకాలుగా పాఠక సామగ్రిని త్వరలో అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
కరోనా స్టడీస్ సిరీస్ కింద తగిన పఠన సామగ్రి తయారు చేసేందుకు వివిధ విభాగాలను గుర్తించినట్లు, అంతే కాకుండా కరోనా సంక్షోభం వివిధ వర్గాల ప్రజలపై చూపిన సామాజిక, మానసిక ప్రభావంపై ఉపపుస్తకాలను, కరోనాను ఎదుర్కొన్న వారి గురించి పిల్లలకు తెలయజేసేందుకు కరోనా వివిధ అంశాలకు సంబంధించిన కథలు, చిత్ర పుస్తకాలను తయారు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈ ప్రాజెక్టుకు నాయకత్వం వహిస్తున్న నేషనల్ బుక్ ట్రస్ట్ సీనియర్ ఎడిటర్ శ్రీ కుమార్ విక్రమ్ తెలిపారు. కరోనా మీద అవగాహన, కళలు, సాహిత్యం, జానపద కథలు, ఆర్థిక మరియు సామాజిక అంశాలపై దృష్టి సారించిన పుస్తకాలతో పాటు కరోనా మహమ్మారి గురించి వెలువడే శాస్త్రీయ, ఆరోగ్య అవగాహన, లాక్ డౌన్ సందర్భానికి సంబంధించిన పుస్తకాలను కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు.
నేషనల్ బుక్ ట్రస్ట్ స్డడీ గ్రూప్ లో డా. జితేందర్ నాగ్ పాల్, డాక్టర్ హర్షీతా, మీనా ఆరోరా, లెఫ్టినెంట్ కల్నర్ తరుణుప్పల్, శ్రీమతి రేఖ చౌహాన్, శ్రీమతి సోనీ సిద్ధూ మరియు కుమారి అపరాజిత దీక్షిత్ లాంటి వారు ఉన్నారు.
క్రింది విభాగాలకు సంబంధించిన పుస్తకాలను స్డడీ గ్రూప్ తయారు చేస్తోంది.
1. Corona Virus (Covid 19) Affected Families : Lead Researchers-- Sq. Leader (Rtd.) Meena Arora and Dr.Harsheeta,
కరోనా వైరస్ (కోవిడ్ -19) బాధిత కుటుంబాలు – ప్రధాన పరిశోధకులు - మీనా అరోరా మరియు డా. హర్షీతా
2. Elderly People : Lead Researcher--Dr.JitenderNagpal and Ms. Aparajita Dixit,
వృద్ధులు – ప్రధాన పరిశోధకులు – డా. జితేందర్ నాగ్ పాల్ మరియు కుమారి అపరాజిత దీక్షిత్
3. Parents with Special Focus on Mothers/Women :Lead Researchers -- Lt. Col. TarunUppal and Mrs. Sonie Sidhu,
తల్లిదండ్రులు ప్రత్యేకించిన స్త్రీలు, తల్లుల మీద ప్రత్యేక శ్రధ్ద – ప్రధాన పరిశోధకులు – లెప్టినెంట్ కల్నల్ తరుణ్ ఉప్పల్ మరియు శ్రీమతి సోనీ సింధు
4. Children and Adolescents : Lead Researchers --Ms. Aparajita Dixit and Mrs. Rekha Chauhan,
పిల్లలు మరియు కౌమార దశలు – ప్రధాన పరిశోధకులు – కుమారి అపరాజితా దీక్షిత్ మరియు శ్రీమతి రేఖ చౌహాన్
5. Professionals and Workers : Lead Researchers --Dr.JitenderNagpal and Lt. Col. TarunUppal,
వృత్తి నిపుణులు మరియు వర్కర్స్ – ప్రధాన పరిశోధకులు – డా. మీనా ఆరోరా మరియు శ్రీమతి సోని సిద్ధు
6. Corona Warriors: Medical and Essential Services Providers- Lead Researchers --Sq.Leader (Rtd.) Meena Arora and Mrs. Soni Sidhu,
కరోనా యోధులు – వైద్య మరియు అత్యవసర సేవకులు – ప్రధాన పరిశోధకులు – మీనా ఆరోరా మరియు శ్రీ మతి సోని సిద్ధు
7. Differently-abled, Special Needs and Mentally Challenged Population : Lead Researchers --Dr.Harsheeta and Mrs. Rekha Chauhan
దివ్యాంగులు , ప్రత్యేక అవసరాలు మరియు మానసిక సవాళ్ళు ఎదుర్కొంటున్న ప్రజలు – ప్రధాన పరిశోధకులు – డా. హర్షీతా మరియు శ్రీమతి రేఖ చౌహాన్
*****
(Release ID: 1609071)
Visitor Counter : 300