వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

వారంలో 1.75 లక్షలకు పైగా ప్రజలు వ్యాపార రోగనిరోధక శక్తి ప్లాట్‌ఫాం వెబ్‌సైట్‌ను సందర్శిస్తారు

కోవిడ్-19 కు భారతదేశం యొక్క ప్రతిస్పందనపై నిజ-సమయ నవీకరణలను పొందడానికి వ్యాపారాలకు ప్లాట్‌ఫాం సహాయం చేస్తుంది

Posted On: 29 MAR 2020 12:10PM by PIB Hyderabad

కోవిడ్-19 (కరోనా వైరెస్) వ్యాప్తిని లకట్టడి చేసేందుకు గాను భారత ప్రభుత్వం చేపడుతున్న సమర్థమంతమైన చర్యలను గురించి వ్యాపారవేత్తలకుపెట్టుబడిదారులకు ఎప్పటికప్పుడు విలువైన సమాచారం అందించేందుకు సర్కారు ఏర్పాటు చేసిన ఇన్వెష్ట్ ఇండియా బిజినెస్ ఇమ్యూనిటీ ప్లాట్ఫాంకు (బీఐపీ) విశేష స్పందన లభిస్తోంది. కేంద్ర వాణిజ్యపరిశ్రమల శాఖ ఆధ్వర్యంలోని జాతీయ పెట్టుబడుల అభివృద్ధి మరియు సౌకర్యాల ఏర్పాటు ఏజెన్సీకి చెందిన ఇన్వెష్ట్ ఇండియా వెబ్ సైట్లో బీఐపీని ఏర్పాటు చేశారు. దేశ వ్యాప్తంగా కోవిడ్-19కు సంబంధించిన సమాచారంతో ఇరవై నాలుగు గంటల పాటు బీఐపీ సేవలను అందిస్తోంది. ఈ నెల 21న కేంద్ర ప్రభుత్వం బీఐపీ డిజిటల్ వేదికను ప్రారంభించింది. వ్యాపారులకుబిజినెసులకుపెట్టుబడిదారులకు ఉపయుక్తంగా ఉండేలా రూపొందించిన ఈ డిజిటల్ వేదికను ఆదివారం ఉదయం 10 గంటల వరకు 1.75 లక్షల మంది సందర్శించడం విశేషం.దాదాపు 50 దేశాల నుంచి సందర్శకులు బీఐపీని సందర్శించారు. బీఐపీ వేదికపై దాదాపు 423 ప్రభుత్వ అడ్వైజరీలునోటిఫికేషన్లను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. వీటితో పాటు 205 బ్లాగులుఇన్ఫోగ్రాఫిక్స్వీడియోలతో పాటు ఇతర అవసరమైన సమాచారాన్ని సర్కారు అందుబాటులో ఉంచింది. ఈ వేదికపై అత్యధికులు కోవిడ్ కట్టడికి విరాళాలు అనే పదాన్ని శోధించడం విశేషం.

వ్యాపారాల సమస్య పరిష్కారానికి గాను చురుకైన వేదికగా బిజినెస్ ఇమ్యునిటీ ప్లాట్ఫాం వేదికను సర్కారు ఏర్పాటు చేసింది. బీఐపీలో వివిధ రంగాలకు చెందిన నిపుణులు వ్యాపారుల ప్రశ్నలకు స్పందిస్తూ సూచనలుసలహాలను ఇస్తుంటారు. సూక్మచిన్నమధ్య తరహా పరిశ్రమల వారి సమస్యలుప్రశ్నలకు సత్వర సూచనలు సలహాలను అందించేందుకు గాను బీఐపీ ఇటీవలే సిడ్బీతో (చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ ఆఫ్ ఇండియా) కూడా జట్టుకట్టింది.

కేంద్ర ప్రభుత్వంతో పాటు వివిధ రాష్ర్ట ప్రభుత్వాలు చేపడుతున్న కరోనా కట్టడి చర్యలపై తాజా సమాచారం కూడా బీఐపీలో అందిస్తుండడంతో ఎక్కువ మంది ఈ డిజిటల్ వేదికను తమకు అవసరమైన సమాచారం కోసం ఆశ్రయిస్తున్నారు. దీనికి తోడు ప్రస్తుత లాక్డౌన్ కాలంలో అమలులోకి వచ్చిన ప్రత్యేక నిబంధనలకు సంబంధించిన సమాచారాన్ని ఈ వెబ్ వేదికపై అందుబాటులో ఉంచారు. దీనికి తోడు ఆయా అంశాలపై వ్యాపారస్తులకు కలుగుతున్న సందేహాలుప్రశ్నలకు ఈ-మెయిల్ లేదా వాట్సప్ ద్వారా సమాధానాలు అందించే వ్యవస్థను కూడా కేంద్రం అందుబాటులోకి తేవడం విశేషం. దీంతో ఎక్కువ మంది బిజినెస్ వారు ఈ వేదికపై తమతమ వ్యాపారాలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. వీటి సాయంతో నిపుణుల సలహా మేరకు వారు తమతమ బిజినెస్ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ డిజిటల్ వేదికను ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 845 వ్యాపారాల సంబంధిత ప్రశ్నలు రాగా.. వాటిలో దాదాపు 614 ప్రశ్నలకు ఇప్పటికే నిపుణులు పరిష్కరాలను సూచించారు. ఎక్కువగా ప్రశ్నలు లాజిస్టిక్స్నోటిఫికేషన్లుకస్టమ్స్ప్లాంట్ల మూసివేతలకు సంబంధించినవి ఉండడం విశేషం.

కరోనా వైద్య సామ్రగి కోసం జాయినింగ్ ది డాట్స్..

ప్రస్తుత విపత్కర సమయంలో అత్యవసర వైద్య సంరక్షణ సామగ్రిని సేకరించేందుకుగాను బీఐపీలో

జాయినింగ్ ది డాట్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు గాను అవసరమైన పరికరాల డిమాండ్- సరఫరాల మధ్య లోటును పూరించడాన్ని సులభతరం చేసే  ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా భాగస్వాములైన దాదాపు 2000 మంది గ్లోబల్ మరియు దేశీయ కార్పరేట్ల వారు సప్లయి కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిని సంప్రదించారు.

అంకుర సంస్థలకు అండగా..

స్టార్టప్ (అంకుర సంస్థల) ఛాలెంజ్ః సొల్యూషన్ టు కంబాట్ కోవిడ్-19 అనే అంశంపై ఏర్పాటు చేసిన వేదికకు దేశంలోని దాదాపు 17 రాష్ర్టాలకు చెందిన వారి నుంచి దాదాపు 120కి పైగా దరఖాస్తులు లభించాయి. బీఐపీ వేదికపై సర్కారు ఇతర దేశాలలోని ఆర్ధిక రంగ నిపుణలతో కాన్ఫరెన్స్ కాల్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు  చేసింది. ఇందులో భాగంగా దేశంలో లాక్డౌన్ కారణంగా వ్యాపార కొనసాగింపుఎదరయ్యే సమస్యల గుర్తింపు వాటికి పరిష్కారాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ అమెరికాకు చెందిన ఆర్థిక సేవల రంగంలోని వివిధ కంపెనీల వారితో ప్రత్యేక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు.

వెబినార్లు..అమెరికా సంస్థలతో సమావేశాలు..

కోవిడ్-19 నేపథ్యంలో స్టార్టప్ సంస్థల వ్యాపార కొనసాగింపు’ అనే అంశంపై పరిశ్రమల ప్రముఖులుఇతర ముఖ్య వాటాదారులతో వెబినార్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కోవిడ్-19 నేపథ్యంలో స్టార్టప్ సంస్థలు నిలదొక్కుకొనేందుకు అందించాల్సిన ఆర్థిక తో్డ్పాటుఆయా సంస్థలకు ఉన్న అవకాశాలతో పాటు ఇంటి నుంచి పనులు చక్కబెట్టే అవకాశాలను గురించి సమగ్రంగా చర్చించారు. లౌక్డౌన్ సమయంలో ఎదురైన సమస్యలు వాటిని ఎలా ఎదుర్కొన్నారన్న విషయంపై అవగాహన కల్పించేందుకు గాను ఈ డిజిటల్ వేదికపై అమెరికన్ లైఫ్ సైన్సెస్ కంపెనీస్ వారితో ప్రత్యేక కాన్ఫెరెన్స్ కాల్ ఏర్పాటు చేశారు.


(Release ID: 1608994) Visitor Counter : 139