వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 మహమ్మారిపై పోరాటానికి ప్రభుత్వ విభాగాలకు అవసరమైన సరుకులు, సేవల ప్రోక్యూర్‌మెంట్ కు పలు చర్యలు చేపట్టిన గవర్నమెంట్ ఈ - మార్కెట్ ప్లేస్ (జిఇఎం).
Posted On:
28 MAR 2020 12:07PM by PIB Hyderabad
కోవిడ్ -19 మహమ్మారి పై పోరాటానికి కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ కింద గల స్పెషల్ పర్పస్ వెహికల్ గవర్నమెంట్ ఈ- మార్కెట ప్లేస్ పలు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ కార్యాలయాల సరకులు, సేవల ప్రొక్యూర్‌మెంట్‌కు సంబంధించి యూజర్ ఫ్రండ్లీ పోర్టల్ నిర్వహిస్తున్న గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ సమర్థమైన , పారదర్శకమైన, తక్కువ ఖర్చుతో కూడిన సత్వర కొనుగోళ్లకు సంబంధించి పలు చర్యలు తీసుకుంది.
గవర్నమెంట్ ఈ మార్కెటింగ్ ద్వారా వస్తువుల ప్రొక్యూర్ మెంట్ జనరల్ ఫైనాన్షియల్ నిబంధనలకు లోబడి ఉంటుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలలో పలు సవరణలు చేశారు. ప్రస్తుతం 7400 ఉత్పత్తులు,150 ప్రాడక్ట్ కేటగిరీలు,ట్రాన్స్ పోర్టు సేవల అద్దెకు తీసుకోవడం వంటివి జిఇఎం పోర్టల్ లో అందుబాటులో ఉన్నాయి. జిఇఎం పూర్తిగా కాగిత రహిత వ్యవస్థ. కనీస మానవ జోక్యం ద్వారా సాధారణ వినియోగానికి ఉపయోగపడే సరకులు, సేవలు సేకరించడానికి ఇది ఉపకరిస్తుంది.
ఇందుకు సంబంధించి ఇటీవల తీసుకున్న చర్యలు కింది విధంగా ఉన్నాయి.
కోవిడ్ 19 సంబంధిత కేటగిరీలకు సంబంధించి ఒక ప్రత్యేక పేఈని గవర్నమెంట్ ఈ మార్కెటింగ్
https://gem.gov.in/covid19 ని సృష్టించింది.
ప్రస్తుతం ఉన్న 32 కేటగిరీలకు తోడు కింది కేటగిరీల వైద్య సంబంధిత అంశాలను కూడా జిఇఎం లో చేర్చారు.
నావెల్ కరోనా వైరస్ ( కోవిడ్ -19) శాంపిల్ సేకరణ కిట్
తిరిగి వాడకానికి నిర్దేశించిన వినైల్, రబ్బర్ గ్లోవ్స్ ( క్లీనింగ్)
కంటి పరీరక్షణ (విసర్, గాగల్స్)
డిస్పోజబుల్ థర్మోమీటర్‌లు
.ఒకసారి వాడకానికి ఉపయోగించే టవళ్లు
యువి ట్యూబ్ లైట్ ఫర్ స్టెరిలైజేషన్
సర్జికల్ ఐసొలేషన్ ఫేస్ షీల్డ్
మెడికల్ వేస్ట్ ఇన్సినిరేటర్
ప్రస్తుతం ఉన్న 52 కేటగిరీలు, 7 సేవలకు అదనంగా ఆక్సిలరీ సరఫరాకు కింది వాటినికూడా చేర్చారు.
జనరల్ పర్పస్ టూల్ కిట్
అల్యూమినియం వంటపాత్రలు
దీనితో నీతి ఆయోగ్ సిఫార్సు చేసిన అన్ని కేటగిరీలకు చెందిన అనుబంధ సరఫరాలు గవర్నమెంట్ ఈ- మార్కెట్‌లో ఉన్నాయి. పైన కొత్తగా పేర్కొన్న కేటగిరీలకు సంబంధించి ఒఇఎంలు, రీ సెల్లర్లు, సప్లయర్లను జిఇఎం లో చేర్చేందుకు గుర్తిస్తారు.
5. కోవిడ్ -19 సంబంధిత కేటగిరీలు జిఇఎం పై ప్రస్తుత తేదీ వరకు ఇలా ఉన్నాయి.
మొత్తం..... 173
వైద్య సంబంధమైనవి 120
ఆక్సిలరీ ... 53
మెడికల్, ఆక్సిలరీ సరఫరాలకు సంబంధించి అనుబంధం-1, అనుబంధం -2 లో పేర్కొనడం జరిగింది.
6. కోవిడ్ -19 కు సంబంధించి న వస్తువుల ప్రొక్యూర్ మెంట్ కు తీసుకున్న వివిధ చర్యలు కింది విధంగా ఉన్నాయి.
1. ప్రత్యేక కేటగిరీలకు, తక్కువ వ్యవధితో తక్కువ డెలివరీ కాలంతో బిడ్లు. COVID-19 సంబంధిత వర్గాల కోసం బిడ్ సైకిల్ ప్రస్తుత 10 రోజుల నుండి 3 రోజులకు తగ్గించబడింది. వస్తువుల అవసరత ను, స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుని కొనుగోలుదారులు అటువంటి వస్తువుల డెలివరీ వ్యవధిని 2 రోజులకు తగ్గిస్తారు. ఇది ఇప్పటికే లైవ్ పోర్టల్‌లో ఉంది
2. ఎల్ 1 కొనుగోలులో, కొనుగోలుదారు డెలివరీ లీడ్ టైమ్ ఎంపిక కోసం ఫిల్టర్ .దీనిని 1 ఏప్రిల్ 2020 నాటికి లైవ్ పోర్టల్ లో ఉంచుతారు.
3. కోవిడ్ నిర్దిష్ట వర్గాలకు ఉత్పత్తి / బ్రాండ్ ఆమోదం ప్రాధాన్యత . 28 మార్చి 2020 నాటికి దీనిని లైవ్ పోర్టల్ లో ఉంచుతారు.
4. ధరల పెరుగుదలను నియంత్రించడానికి కొత్త వ్యాపార నియమాలు. 1 ఏప్రిల్ 2020 నాటికి లైవ్ పోర్టల్ లో ఉంచుతారు.
.5 వాస్తవ డెలివరీ గడువు తేదీ ని 30 రోజులు మించి డెలివరీ వ్యవధి పొడిగింపును అనుమతించడం.
28 మార్చి 2020 నాటికి దీనిని లైవ్ పోర్టల్ లో ఉంచుతారు.
6. నిర్దిష్ట వర్గాల కోసం నోటిఫికేషన్ వచ్చిన 48 గంటలలోపు స్టాక్‌ను నవీకరించని అమ్మకందారులకు సంబంధించి కొత్త వ్యాపార నియమం. ఇది ఇప్పటికే లైవ్‌లో ఉంది.
7. COVID-19 వర్గాలను ,అమ్మకందారుల సంఖ్యను ట్రాక్ చేయడానికి కొత్త పేజీ. 28 మార్చి 2020 నాటికి లైవ్ లో ఉంటుంది..
COVID 19 రెస్పాన్స్ ప్రాజెక్ట్ కోసం ప్రపంచ బ్యాంక్ , గవర్నమెంట్ ఈ మార్కెట్ వద్ద సేకరణ పరిమితిని 1 లక్ష డాలర్ల నుంచి 10 లక్షల డాలర్లకు పెంచింది
బోర్డింగ్‌లో అమ్మకం దారు:
ఎ) ఒఇఎం, అమ్మకం దారులు 8 కొత్త కోవిడ్ కేటగిరీలను గుర్తించారు.
బి) సంబంధిత వైద్య కేటగిరీలను జిఇఎం లోనూ జిఇఎం వెలుపలా సర్చ్ చేశారు.
లక్షిత మెయిలర్లను ఒఇఎంలతోపాటు సుమారు 10వేల అమ్మకందారులకు పంపడం జరిగింది. మెయిల్ సమాచారంలో కొత్త కోవిడ్ -19 కేటగిరీలు, జిఇఎం ప్రవేశపెట్టిన బ్రాండ్, ప్రాడక్ట్ ఆమోదాల ప్రక్రియ కు సంబంధించిన ప్రాధాన్యతలను ప్రవేశపెట్టడం జరిగింది.
సి) ఒఇఎం, అమ్మకం దారులను టెలిఫోన్ ద్వారా సంప్రదించడం జరిగింది. 200 కు పైగా అమ్మకం దారులను ఇందులో భాగస్వాములను చేయడం జరిగింది. వీరందరికీ కొవిడ్ 19 కు సంబంధించి జిఇఎం రూపొందించిన కొత్త కేటగిరీలను తెలియజేసి వీటిని ఆన్ బోర్డ్ ఉండాలని సూచించారు.
డి) ఒయిఎంలు తమ రీ సెల్లర్లను ఆన్ బోర్డ్ ఉంచడమే కాక తగినంత ఇన్వెంటరీలను ఉంచేలా చూడాల్సిందిగా ఒయిఎంలను కోరడం జరిగింది.
ఇ) ప్రస్తుత పరిస్థితిని తమకు లభించిన అవకాశంగా భావించి తమకుతోచిన రీతిలో జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితికి సహకరించాల్సిందిగా ఒఇఎంలు, అమ్మకందారులను కోరారు.
ఎఫ్) ఒఇఎంలు, జిఇఎం వెలుపల గల అమ్మకం దారులు ప్రాంతీయ బిజినెస్ ఫెసిలిటేటర్లతో అనుసంధానం కావడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో మార్గనిర్దేశం చేయడం జరిగింది.
మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మినహాయించిన వ్యాపారాల గురించి వివిధ ఎస్.ఒ.పి లగురించి ఒఇఎంలకు అవగాహన కల్పిస్తారు. ఇందుకు సంబంధించి ఆన్ లైన్ లింక్ https://www.ndma.gov.in/en/
జి) ఒఇఎం లకు సంబంధించి బ్రాండ్ ఆమోదాలు, ప్రాడక్ట్ ఆమోదాలకు సంబంధించిన విజ్ఞప్తుల విషయంలో అనుమతులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. వీటిని అదే రోజు క్లియర్ చేస్తారు.
అనుబంధం -1
మెడికల్ సప్లయ్‌లకు సంబంధించిన కేటగిరీల జాబితా
నెం ----- ఐటమ్
1. వెంటిలేటర్లు
2. ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ రబ్
3.ఫేస్ షీల్డ్ ( కళ్లు, ముక్కు,నోటి సంరక్షణ)
4. ఎన్-95 మాస్క్‌లు
5. లేటెక్స్ సింగిల్ యూజ్ గ్లోవ్స్ (క్లినికల్)
6. రీ యూజబుల్ వినైల్, రబ్బర్ గ్లోవ్స్ ( క్లీనింగ్)
7. ఐప్రొటక్షన్ ( విసర్, గాగల్స్)
8. ప్రొటక్టివ్ గౌన్స్, అప్రాన్స్
9. డిస్పోజబుల్ థర్మామీటర్స్
10. యువి ట్యూబ్ లైట్ ఫర్ స్టెరిలైజేషన్
11. మెడికల్ మాస్క్,( సర్జికల్ ప్రొసీజర్)
12. డిటర్జంట్, డిస్ ఇన్‌ఫెక్టెంట్
13. డిటర్జంట్, డిస్ ఇన్‌ఫెక్టెంట్
14. డిటర్జంట్, డిస్ ఇన్‌ఫెక్టంట్
15. సింగిల్ యూజ్ టవల్స్
16. బయో హజార్డ్ బ్యాగ్‌లు
17 వీల్ చైర్.
18.గ్లూకో మీటర్ విత్ స్ట్రిప్స్
19 హార్డ్ ఫ్రోజన్ జెల్ పాక్ లు
20. శాంపిల్ కలక్షన్ కిట్
21. థర్మోకూల్ బాక్స్, ఐస్ బాక్స్
22. స్ట్రెచర్
23. స్ట్రెచర్
24. థర్మల్ స్కానర్లు
25. థర్మల్ స్కానర్లకు బ్యాటరీలు
26. బిపి ఆపరేటస్
27. ఐవి సెట్‌లు
28. ఐవి కాన్యుల
29. ఐవి స్టాండ్
30 అంబులెన్స్
31. ప్రథమ చికిత్స
32. మెడికల్ వేస్ట్ ఇన్‌సినిరేటర్
33. ఐసియు బెడ్‌లు
34. కార్డియాక్ మానిటర్స్
35. సిరంజ్ పంప్‌లు
36. సిరంజి పంప్‌లు
37.పోర్టబుల్ ఎక్స్ రే మిషన్లు
38. ఎండోడ్రాచియల్ ట్యూబ్
39. సక్షన్ ట్యూబ్
40. ఆక్సిజన్ సిలిండర్
ఆక్సలరీ సప్లయ్‌లకు సంబంధించి కేటగిరీల జాబితా
1. సోప్
2. రబ్ హాల్ టెంట్లు
3. చెయిర్స్ , బెంచెలు
4. టేబిల్స్, డెస్క్‌లు
5 ప్రింటర్
6. కంప్యూటర్
7. ఎక్స్‌టెన్షన్ బోర్డులు
8. మ్యాచెస్
9. కాండిల్స్
10. పేషెంట్లకు ఐడి
11. ఐడి ఫర్ వాలంటీర్స్
12. ఫ్లయర్- ఇన్ఫర్మేషన్ బుక్‌లెట్
13. వైట్ బోర్డ్, మార్కర్లు
14 గార్బేజ్ బ్యాగ్‌లు, బిన్‌లు
15. తాగునీరు, డిస్‌పెన్సర్ (4)
16. క్లీనింగ్ ఐటమ్స్( బ్రూమ్స్)
17. క్లీనింగ్ ఐటమ్స్ ( మాప్)
18.మంటలు ఆర్పే పరికరాలు
19 ఇ టాయిలెట్
20 జెన్ సెట్, బ్యాకప్
21. విజిల్
22. టూల్ సెట్ - బేసిక్
23. రిజిస్ట్రేషన్ వివరాలు- స్టికర్, ప్రింటర్
24 మాట్రెసెస్
25 ఫోల్డబుల్ కాట్స్, బెడ్లు
26. బెడ్ షీట్లు
27. దిండ్లు
28. దిండు కవర్లు
29,. టవళ్లు
30 .రబ్బర్ షీట్లు
31. బ్లాంకెట్లు
32. ఎమర్జెన్సీ ల్యాంప్
33. లాండ్రీ ( డిటర్జంట్స్)
(Release ID: 1608878)
Visitor Counter : 184