రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

కీలకమైన వంతెన నిర్మాణం , మంచు తొలగింపు చర్యలలో సరిహద్దు రహదారి సంస్థ(బిఆర్ఓ)

Posted On: 28 MAR 2020 12:33PM by PIB Hyderabad

మారుమూల ప్రాంతాల్లో నివసిస్తూ మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయిన గ్రామాల కోసం సరిహద్దు రహదారుల సంస్థ (బిఆర్ఓ) సాహసోపేతమైన చర్యలు చేపట్టింది. అరుణాచల్ ప్రదేశ్ ఎగువ సబంసిరి జిల్లాలో  సమాచార వ్యవస్థ చిన్నాభిన్నమైన  451 గ్రామాలుఆ పరిసరాల్లో ఉన్న సరిహద్దు సైనికుల ప్రాంతాలకు  సమాచార వ్యవస్థను పునరుద్ధరించే కార్యక్రమాన్ని చురుకుగా కొనసాగిస్తుంది. ఈ ప్రాంతాలకు జీవ నాడి అయిన దపోరిజో వంతెన ( 430 అడుగుల మేర స్తంభాలపై ఉన్న వంతెన)ను పూర్తిగా మార్చివేసే పనులను నిర్విరామంగా  చేపట్టారు బిఆర్ఓ సిబ్బంది.  ఈ ప్రాంతం చైనాకు సరిహద్దున ఉంటుంది. స్థానిక యంత్రాంగం ప్రత్యేక విజ్ఞప్తి మేరకు  23 బి.ఆర్.టి.ఎఫ్/ప్రాజెక్ట్ అరుణాంక్ సిబ్బంది, ప్రస్తుతం వంతెన పూర్తిగా శిధిలావస్థలో ఉన్నపటికీ చురుకుగా పనులు చేపట్టారు. అనుకున్న సమయానికల్లా కీలకమైన ఈ మార్గాన్ని అవసరమైన ముందస్తు జాగ్రత్తలతో తెరవడానికి పూర్తిగా నిమగ్నమై ఉన్నామని బిఆర్ఓ ఒక ప్రకటనలో వెల్లడించింది. సమాచార వ్యవస్థను పూర్తిగా అందుబాటులోకి తేవడానికి చర్యలు  చేపట్టినట్టు తెలిపింది.

ఇదిలా ఉండగాఉత్తరాదిలో మనాలి-లేహ్ మార్గంలో పేరుకుపోయి ఉన్న మంచు ను తొలగించే పనిని బిఆర్ఓ చేపట్టిందనివాతావరణం సహకరించకపోయినాకోవిడ్-19 ముప్పు ఉన్నప్పటికి పగలనకరాత్రనక కృషి జరుగుతోందని ప్రకటనలో తెలియజేసారు. ఈ మార్గాన్ని పునరుద్ధరిస్తే లాహౌల్ లోయలడఖ్ ప్రాంతాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం రోహ్తాంగ్ పాస్బరాలచలా మార్గంలో మంచు తొలగించే పనిని నాలుగు బృందాలు చేస్తున్నాయి. చాల పెద్ద మార్గాలైన బరాలచలా పాస్సర్చు ప్రాంతాల్లో బిఆర్ఓ సంస్థ సిబ్బంది విమానాల్లో వెళ్లి పనులు చేపట్టడం ఇది మొదటిసారి. 

సాయుధ సైనిక దళాలు వారి వ్యూహాత్మక అవసరాలను తీర్చడానికి తగు సహకారం అందించడానికి కేంద్ర రక్షణ శాఖ లో ముఖ్య భాగమైన సరిహద్దు రహదారుల సంస్థ పూర్తి సన్నద్ధం అయింది. నిరాశ్రయులైన మరియు సుదూర సరిహద్దు ప్రాంతాలలో ఉన్న వారి అవసరార్థం  రహదారి మౌలిక సదుపాయాలను నిర్మాణంనిర్వహణలో బిఆర్ఓ కీలక పాత్ర పోషిస్తుంది.

                                         ****(Release ID: 1608805) Visitor Counter : 159