కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 లాక్‌డౌన్ సమ‌యంలో మౌలిక త‌పాల‌, ఫైనాన్షియ‌ల్ సేవ‌లు అందిస్తున్న‌ త‌పాలా కార్యాల‌యాలు

Posted On: 27 MAR 2020 5:45PM by PIB Hyderabad

కోవిడ్ -19 లాక్‌డౌన్ కాలంలో పోస్టాఫీసులు మౌలిక త‌పాలా సేవ‌లు, ఫైనాన్షియ‌ల్ సేవ‌ల‌ను క‌ల్పిస్తున్నాయి. పోస్ట‌ల్ నెట్ వ‌ర్క్ ద్వారా అత్యావ‌శ్య‌క వ‌స్తువుల డెలివ‌రీ చేప‌డుతున్నారు. పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతా కింద న‌గ‌దు ఉప‌సంహ‌ర‌ణ‌, డిపాజిట్‌, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ స‌దుపాయం అందుబాటులో ఉంది. ఎటిఎం స‌దుపాయం, ఎఇపిఎస్ ( ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్ట‌మ్‌) కింద ఏ బ్యాంకుఖాతా నుంచ అయినా న‌గ‌దు ఉప‌సంహ‌రించుకునే వ్య‌వ‌స్థ‌ను పోస్టాఫీసుల‌లో  అందుబాటులో ఉంచారు.
 పోస్ట‌ల్ సిబ్బంది, పౌరుల‌  ర‌క్ష‌ణ చ‌ర్య‌లు పాటిస్తూ అత్యావ‌శ్య‌క సేవ‌ల‌ను వీరు కొన‌సాగిస్తున్నారు.


(Release ID: 1608680) Visitor Counter : 116