శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

ఆర్ అండ్ డి, సీడ్ & స్కేల్ అదనపు సహకారంతో కోవిడ్ -19 అదనపు పరిష్కారాలను కనుగొనడానికి, వేగవంతం చేయడానికి దేశ వ్యాప్తంగా ప్రయత్నాలు ప్రారంభించిన డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ

కోవిడ్ -19 ఆరోగ్య సవాళ్ళను పరిష్కరించేందుకు ఇప్పటికే 8 వేరు వేరు నమూనాల నిర్మాణం ప్రారంభించిన (SCTIMST), త్రివేండ్రం, డి.ఎస్.టి. యొక్క స్వయంప్రతిపత్తి సంస్థ

Posted On: 27 MAR 2020 5:09PM by PIB Hyderabad

కోవిడ్ -19 మహమ్మారి నుంచి ఉత్పన్నమయ్యే ప్రజారోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు జాతీయ శాస్త్ర సాంకేతిక విభాగం (డి.ఎస్.టి) జాతీయ స్థాయిలో పిలుపు నిచ్చింది. శాస్త్ర మరియు సాంకేతిక మంత్రిత్వ శాఖ మరియు మరియు దాని స్వయం ప్రతిపత్తి సంస్థలు మరియు శాస్త్రీయ విభాగాల ద్వారా దేశవ్యాప్తంగా నిర్వహించబడుతున్న వివిధ కార్యకలాపాలను సమన్వయం చేయడంతో పాటు ఏకీకృతం చేస్తోంది.

కోవిడ్ -19 వైరస్ వల్ల ఎదురౌతున్న సవాళ్ళను పరిష్కరించేందుకు పరిష్కారాలు మరియు అనువర్తనాలు మూడంచల వ్యవస్థ ద్వారా స్వీకరించబడుతున్నాయి. వీటిలో (ఎ) ఆర్ అండ్ డి మద్దతు అవసరమయ్యే పరిష్కారాల విస్తృతమైన మ్యాపింగ్, సులభతరం మరియు తయారీ మద్దతు అవసరమయ్యే ఆచరణీయ ఉత్పత్తులతో అంకుర సంస్థలు (బి) ప్రారంభ మద్దతు అవసరమయ్యే మార్కెట్ డిప్లోయబుల్ ఉత్పత్తుల గుర్తింపు మరియు (సి) ఇప్పటికే మార్కెట్లో ఉన్న పరిష్కారాలకు అదనపు మద్దతు. కానీ వాటి తయారీ మౌలిక సదుపాయాలు మరియు సామర్థ్యాలను పెంచడానికి ఇవి గణనీయమైన స్థాయిలో అవసరం అవుతాయి.

డి.ఎస్.టి యొక్క స్వయంప్రతిపత్తి సంస్థ అయిన సైన్స్ మరియు ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ (SERB) ఇప్పటికే కోవిడ్ -19 కోసం ఏర్పాటు చేసిన IRHPA (ఇంటెన్సిఫికేషన్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ హై ప్రియారిటీ ఏరియా) పథకం కింద ప్రత్యేక పిలుపులో భాగంగా ప్రతిపాదనలనలను ఆహ్వానించింది. శ్వాసకోశ వైరల్ ఇన్ఫెక్షన్ల కోసం నూతన యాంటీ-వైరల్స్, టీకాలు మరియు సరసమైన డయాగ్నొస్టిక్ కోసం జాతీయ స్థాయిలో R&D ప్రయత్నాలను పెంచడానికి ప్రణాళికలు రచియింది. 2020 మార్చి 31 నాటికి భారతీయ శాస్త్రవేత్తల నుంచి పరిష్కారాలను ఆహ్వానించింది. దీనికి ఇప్పటికే మంచి స్పందన కూడా లభిస్తోంది.

కోవిడ్ – 19 బాధితుల రక్షణ మరియు గృహ ఆధారిత శ్వాసకోశ ఇబ్బందులను పరిష్కరించే సాంకేతిక ప్రతిపాదనల కోసం భారత ప్రభుత్వ స్టాటిట్యూటరీ ఆఫ్ బాడీ టెక్నాలజీ డెవలప్ మెంట్ బోర్డ్ (టిడిబి) పని చేస్తోంది. 2020 మార్చి 30 నాటికి ఆహ్వానించబడిన ప్రతిపాదన ఆసక్తిని రేకెత్తించింది. కోవిడ్ -19 డయాగ్నొస్టిక్ కిట్స్, థర్మల్ స్కానర్లు, AI & IOT ఆధారిత నిర్ణయం అందించే సహకారం, విడభాగాలు మరియు వెంటలేటర్ల తయారీ, మాస్కుల తయారీ సహా వివిధ అంశాలకు చెందిన 190 కంపెనీలు ఇప్పటికే నమోదు చేసుకున్నాయి.

కోవిడ్ -19 ఆరోగ్య సవాళ్ళను పరిష్కరించేందుకు డి.ఎస్.టి. యొక్క స్వయంప్రతిపత్తి సంస్థ అయిన శ్రీ చిత్ర తిరునాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (SCTIMST), త్రివేండ్రం ఇప్పటికే 8 వేరు వేరు నమూనాల నిర్మాణం ప్రారంభించింది.  SCTIMST-TIMed వద్ద ఇంక్యుబేషన్ కింద ఒక స్టార్టప్, కోవిడ్ 19 రోగులను పరీక్షించడానికి తక్కువ ఖర్చుతో AI ప్రారంభించబడిన డిజిటల్ ఎక్స్‌రే డిటెక్టర్‌ను అభివృద్ధి చేయడానికి డి.ఎస్.టి. సహకారంతో ఇనిస్టిట్యూట్ లో మరో ఇంక్యుబేటర్ పని చేస్తున్నాయి.

కోవిడ్ -19 లాంటి అనేక వ్యాధులను ఎదుర్కొనేందుకు ఇప్పటికే ఇప్పటికే ఇంక్యుబేషన్ లో ఉన్న ఆవిష్కరణలను మ్యాపింగ్ చేసేందుకు జాతీయ శాస్త్ర సాంకేతిక వ్యవస్థాపక అభివృద్ధి విభాగం, డి.ఎస్. దేశ వ్యాప్తంగా 150కి పైగా ఇంక్యుబేషన్ సెంటర్ల బలమైన నెట్ వర్క్ స్థాయిని చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా డి.ఎస్.టి. ఇంక్యుబేటెడ్ స్టార్టప్ ల నుంచి  వినూత్న పరిష్కారాలతో 165 అంకుర సంస్థల నుంచి ప్రోత్సాహకరమైన ప్రతిస్పందన పొందింది. ఈ పరిష్కారాలు వ్యాధిని ఎదుర్కొనేందుకు నివారణ, విశ్లేషణలు, సహాయక మరియు నివారించే అంశాలను కలిగి ఉన్నాయి.  ఇవి ప్రారంభ స్థాయిలో వివిధ దశల్లో ఉన్నాయి. స్వీయ నిర్భంద ప్రాంతాల్లో వైరస్ భారాన్ని గణనీయంగా తగ్గించడం కోసం మహరాష్ట్రలో వివిధ ఆసుపత్రులలో ఐరాన్ అయోనైజర్ యంత్రాల విస్తరణను పెంచడానికి యూనివ్ లోని సైటెక్ పార్క్ లో ఇంక్యుబేషన్ కింద పూణే ఆధారిత అంకుర సంస్థకు డి.ఎస్.టి. సహకార అందిస్తోంది.

ఆర్ అండ్ డి ల్యాబ్ లు, విద్యాసంస్థలు, అంకుర సంస్థలు, ఎం.ఎస్.ఎం.ఈల నుంచి టెక్నాలజీ మ్యాపింగ్ కోసం డి.ఎస్.టి. కోవిడ్ – 19 టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. డి.ఎస్.టి, డి.బి.టి, ఐ.సి.ఎం.ఆర్, మీట్ వై, సి.ఎస్.ఆర్., ఎ.ఐ.ఎం, ఎం.ఎస్.ఎం.ఈ, స్టార్టప్ ఇండియా మరియు ఎ.ఐ.సి.టి.ఈ నుంచి ఈ సామర్థ్య మ్యాపింగ్ సమూహంలో ప్రతి నిధులు ఉన్నారు. అత్యంత ఆశాజనకమైన అంకురాలను గుర్తించడమే దీని లక్ష్యం. వారికి ఆర్థిక లేదా ఇతర సహాయాలు అవసరం కావచ్చు. ఈ నేపథ్యంలో దాని అంచనా డిమాండ్ ఆధారంగా సహకారం అందించడం జరుగుతుంది.

శాస్త్రీయ మరియు పరిశోధనా సంస్థలు, పరిశోధకులు, శాస్త్రవేత్తలు, ఇంక్యుబేటర్లు, అంకుర సంస్థలు మరియు టెక్ కంపెనీలు పాల్గొన్న సినర్జెటిక్ విధానం ద్వారా కోవిడ్ - 19 మహమ్మారి నుండి తలెత్తే సవాళ్లను పరిష్కరించడానికి డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రయత్నిస్తోంది.

 


(Release ID: 1608678) Visitor Counter : 130