వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
పెట్రోలియం, పేలుడు పదార్ధాలు, ఆక్సిజన్, పారిశ్రామిక వాయువుల పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు పలు చర్యలు చేపట్టిన పెట్రోలియం, పేలుడు పదార్ధాల రక్షణ సంస్థ -పి.ఇ.ఎస్.ఒ
Posted On:
27 MAR 2020 11:27AM by PIB Hyderabad
కోవిడ్ -19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు దేశ వ్యాప్తంగా ప్రకటించిన లాక్ డౌన్ కారణంగా పెట్రోలియం, పేలుడు పదార్ధాలు, ఫైర్ వర్క్స్,పారిశ్రామిక వాయువుల పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు , అలాగే ఆస్పత్రులు, ఇతర ఆరోగ్య సంరక్షణ సంస్థలకు ఆక్సిజన్ ను నిరంతరాయంగా సరఫరా చేసేందుకు వాణిజ్య మంత్రిత్వశాఖకు చెందిన అంతర్గత వాణిజ్యం (డిపిఐఐటి) పారిశ్రామిక ప్రోత్సాహక విభాగం కింద గల పెట్రోలియం, పేలుడు పదార్ధాల రక్షణ సంస్థ (పిఇఎస్ఒ) పలు చర్యలు తీసుకుంది.
వీటిలో..
1. మెడికల్ ఆక్సిజన్ రవాణా, నిల్వకు సంబంధించి సత్వరం లైసెన్సులు జారీచేసేందుకు చర్యలు తీసుకోవలసిందిగా పి.ఇ.ఎస్.ఒ కేంద్ర కార్యాలయం తన అన్ని కార్యాలయాలను ఆదేశించింది.
2.దేశంలో కోవిడ్ -19ను అరికట్టే చర్యలలో భాగంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 24-03-2020 న జారీ చేసిన ఉత్తర్వు నెంబర్ 40-3/2020 ప్రకారం మెడికల్ ఆక్సిజన్, నైట్రస్ ఆక్సైడ్ తయారీ, రవాణాను నిరంతరాయంగా కొనసాగేలా చూడాల్సిందిగా కోరుతూ అన్ని రాష్ట్రాల ప్రిన్సిపల్ సెక్రటరీ (హోం)లకు పి.ఇ.ఎస్.ఒ సంస్థ 25.03.2020 అడ్వయిజరీ జారీచేసింది.
3. ఆక్సిజన్ , ఇతర గ్యాస్‌ల రవాణాకు సంబంధించి 2020 మార్చి 31తో ముగిసే లైసెన్సుల గడువును 2020 జూన్ 30 వరకు పొడిగించింది.
4. పేలుడు పదార్థాలు , బాణసంచా నిల్వ, రవాణా, అమ్మకం, ఉపయోగం తయారీకి 31/03/2020 తో ముగుస్తున్న లైసెన్సుల గడువును 30/09/2020 వరకు పొడిగిస్తారు. ఈ లైసెన్సులను ఆలస్యంగా రెన్యువల్ చేసుకోవడానికి ఫీజు వసూలు చేయరు.
5. కంప్రెస్‌డ్ ఆక్సిజన్, సిఎన్జి, ఎల్.పి.జి ఇతర వాయువుల నిల్వ కోసం ఉపయోగించే సిలిండర్ల హైడ్రో టెస్టింగ్ గడువు 31-03-2020 గా ఉన్నవాటిని 30/06/2020 తేదీ కి పొడిగించారు.
6. ఆక్సిజన్, ఎల్‌పిజి, ఇతర వాయువుల నిల్వకు ఉపయోగించే ప్రజర్ వెసల్స్‌కు సంబంధించి సేఫ్టీ రిలీఫ్ వాల్వుల, హైడ్రో టెస్టింగ్ గడువు 15-03-2020 నుంచి 30-06-2020 మధ్య ఉన్న వాటి టెస్టింగ్ గడువును 30-06-2020 వరకు పొడిగించారు.
(Release ID: 1608509)