మంత్రిమండలి

ఆయుష్మాన్ భారత్ పరిధిలోని ఆయుష్ ఆరోగ్య మరియు స్వస్థత కేంద్రాలను

జాతీయ ఆయుష్ మిషన్లో చేర్చేందుకు మంత్రివర్గ ఆమోదం

Posted On: 21 MAR 2020 4:14PM by PIB Hyderabad

ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా ఉన్న ఆయుష్ ఆరోగ్య మరియు స్వస్థత కేంద్రాలను జాతీయ ఆయుష్ మిషన్ పరిధిలో  చేర్చేందుకు ఆమోదం తెలిపింది.

ఈ ప్రతిపాదన వల్ల ఆయుష్ ఆరోగ్య మరియు స్వస్థత కేంద్రాలను అయిదేళ్ళపాటు అంటే ఆర్ధిక సంవత్సరం 2019-20 నుంచి 2023-24 వరకు నిర్వహించేందుకు మొత్తం రూ. 3399.35 కోట్లు ఖర్చవుతుంది (ఇందులో కేంద్రం వాటా రూ. 2209.58 కోట్లు మరియు రూ. 1189.77 కోట్లు రాష్ట్ర వాటా)

జాతీయ ఆయుష్ మిషన్ లో భాగంగా ఈ కేంద్రాలను నిర్వహించడం ద్వారా ఈ కింది లక్ష్యాలను సాధించాలి. 

            ఎ. ఆయుష్ సూత్రాలు మరియు వాడుకల ప్రకారం నివ్ర్వహిస్తున్న నివారణ, రోగానాశక, పునరావాస, ఉపశమనకర చికిత్సా విధానాన్ని ప్రస్తుత ప్రజారోగ్య సంరక్షణ వ్యవస్థతో ఏకీకరించి ఒక సమగ్ర స్వస్థత నమూనాను ఏర్పాటుచేయడం.

    బి. ఆయుష్ సేవలను అందుబాటులోకి తేవడం ద్వారా వాటి గురించి తెలుసుకొని అవసరమైన వారు ఉపయోగించేలా చేయడం. 

    సి. ఆయుష్ సేవలలో జీవన విధానం, యోగ, ఔషద మొక్కలను గురింఛి సామాజిక జాగృతి మరియు ఆయుష్ వ్యవస్థల శక్తి మేరకు ఎంపిక చేసిన పరిస్థితులకు మందులు సమకూర్చడం.

 

దేశవ్యాప్తంగా 12,500 ఆయుష్ ఆరోగ్య మరియు స్వస్థత కేంద్రాల నిర్వహణకు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మరియు ఇతర  సంబంధిత మంత్రిత్వ శాఖలతో సంప్రదించి ఈ దిగువ రెండు నమూనాలను కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది: 

  1. ప్రస్తుతం సేవలందిస్తున్న ఆయుష్ డిస్పెన్సరీల స్థాయి పెంపు (సుమారుగా 10,000)
  2. ప్రస్తుతం ఉన్న ఉప ఆరోగ్య కేంద్రాల స్థాయి పెంపు (సుమారుగా 2,500)

ప్రయోజనాలు:

    • అందుబాటు ధరల్లో చికిత్స అందించడానికి వీలుగా సార్వత్రిక ఆరోగ్య సేవలను మరింత ఎక్కువగా లభ్యమవుతుంది
    • ద్వితీయ, తృతీయ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలపై భారం తగ్గుతుంది
    • “స్వయం సంరక్షణ” నమూనా వల్ల జేబు ఖర్చు తగ్గుతుంది
    • నీతి అయోగ్ చెప్పినట్లు ఆయుష్ ఏకీకరణ
    • లక్ష్యిత ప్రాంతాలలో ప్రామాణితం చేసిన స్వస్థత నమూనా అమలు

నేపధ్యం : 

          జాతీయ ఆరోగ్య విధానాన్ని 2017లో ఆమోదించారు. బహువిధ ఆరోగ్య వ్యవస్థలను ఉపయోగించి ఏకీకృత ఆరోగ్య సంరక్షణ ద్వారా ఆయుష్ ఆరోగ్య వ్యవస్థల (ఆయుర్వేద, యోగ మరియు ప్రకృతి వైద్యం, యునాని, సిద్ధ, సౌస్ రిగ్ప మరియు హోమియోపతి) సామర్ధ్యాన్ని జాతీయ జీవన స్రవంతిలోకి తేవాలన్నది  జాతీయ ఆరోగ్య విధానం అభిమతం.

         సమగ్ర ప్రాధమిక ఆరోగ్య సేవలను అందించడానికి వీలుగా ప్రస్తుతం పనిచేస్తున్న ఉప ఆరోగ్య కేంద్రాలను , ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను కూడా పరివర్తన చేసి దేశవ్యాప్తంగా లక్షన్నర ఆరోగ్య మరియు స్వస్థత కేంద్రాలను ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వం 2018లో నిర్ణయించింది.

అంతేకాక దేశవ్యాప్తంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ కింద దేశంలోని 10% ఆరోగ్య కేంద్రాలను అంటే 12,500 ఆయుష్ ఆరోగ్య మరియు స్వస్థత కేంద్రాలుగా మార్చాలని కూడా నిర్ణయించారు.

ఆయుష్ సూత్రాలు మరియు వాడుకలపై ఆధారపడి ముందుచూపుతో చేసిన ఈ ప్రతిపాదన వల్ల ఆయుష్ సేవలను ఎక్కువ మందికి అందుబాటులోకి తేవడం ద్వారా వాటి గురించి తెలుసుకొని అవసరమైన వారు ఉపయోగించేలా చేయడం జరుగుతుంది. అంతేకాక ‘స్వయం సంరక్షణ’ వంటి సాదికారత వల్ల వారికి రోగ భారం, జేబు ఖర్చు తగ్గుతాయి.  

***



(Release ID: 1607804) Visitor Counter : 157