ప్రధాన మంత్రి కార్యాలయం
కోవిడ్-19 పై ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి సంప్రదింపులు
Posted On:
20 MAR 2020 7:54PM by PIB Hyderabad
నిరంతర నిఘా ప్రాధాన్యాన్ని పునరుద్ఘాటించిన ప్రధానమంత్రి
ఈ మహమ్మారిపై పోరాటానికి కేంద్రప్రభుత్వం, రాష్ట్రప్రభుత్వాలు కలసికట్టుగా కృషి చేయాలి : పరా ధానమంత్రి
వైరస్ వ్యాప్తి విస్తరణను నిలువరించే క్లిష్ట దశలో మనమంతా ఉన్నాం; భీతావహులు కావలసిన అవసరం లేదు : పర ధానమంత్రి
కోవిడ్-19పై పోరాటానికి ప్రధానమంత్రి జాతినుద్దేశించి చేసిన ప్రసంగం ప్రభావాన్ని తెలియచేసిన ముఖ్యమంత్రులు
నాడు పోస్టు చేయడమైనది: 20 మార్చి 2020 రాత్రి 7.54కి పిఐబి ఢిల్లీ
ప్రధానమంత్రి శుక్రవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రాష్ర్టాల ముఖ్యమంత్రులదరితో సంప్రదింపులు నిర్వహించి కోవిడ్-19ని అదుపు చేసేందుకు ఉమ్మడిగా చేపట్టవలసిన చర్యలపై చర్చించారు.
ఉమ్మడిగా సవాలును ఎదుర్కొందాం
కరోనా మహమ్మారి వల్ల రాష్ర్టాలన్నీ ఉమ్మడిగా ముప్పు ఎదుర్కొంటున్నాయని, దీన్ని దీటుగా ఎదుర్కొనేందుకు కేంద్రప్రభుత్వం, రాష్ట్రప్రభుత్వాలు కలిసికట్టుగా పోరాటం సాగించాలని ప్రధానమంత్రి పిలుపు ఇచ్చారు. ఈ సవాలును ఎదుర్కొనడంలో పౌరుల భాగస్వామ్యం కూడా కీలకమని చెబుతూ కాని వారిలో ఎలాంటి భీతినైనా పారదోలాల్సిన అవసరం ఉన్నదని నొక్కి చెప్పారు. ప్రపంచంలోని పలు దేశాలకు కరోనా వైరస్ త్వరితగతిన విస్తరిస్తున్న నేపథ్యంలో నిరంతర నిఘా అత్యంత కీలకమని ఆయన అన్నారు. కరోనా వ్యాప్తిని నిలువరించడంలో రానున్న 3, 4 వారాలు అత్యంత కీలకమని, సామాజిక దూరం (సోషల్ డిస్టెన్సింగ్) పాటించేలా చూడడం అత్యంత కీలకమైన చర్య అని ఆయన సూచించారు. దీన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ప్రధానమంత్రి ముఖ్యమంత్రులను కోరారు.
ఇప్పటివరకు తీసుకున్న చర్యలు
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఇప్పటివరకు తీసుకున్న చర్యలను కేంద్రప్రభుత్వ ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీమతి ప్రీతి సుడాన్ వివరించారు. ఈ చర్యలన్నింటినీ ప్రధానమంత్రి స్వయంగా ఏ విధంగా పర్యవేక్షిస్తున్నది కూడా ఆమె తెలియచేశారు. వైరస్ నిరోధానికి రాష్ర్టాల నుంచి ప్రస్తుతం అందుతున్న సహకారాన్ని, అంతర్జాతీయ ప్రయాణికుల నిరంతర పర్యవేక్షణ, వైరస్ వ్యాప్తి నిరోధానికి అనుసరిస్తున్న సామాజిక నిఘా, టెస్టింగ్ సదుపాయాలకు సంబంధించిన లాజిస్టిక్స్, ప్రయాణ ఆంక్షలు, విదేశాల నుంచి భారత పౌరులను తరలించడం వంటి చర్యలను ఆమె వివరించారు. భారతదేశం ప్రస్తుతం కరోనా వైరస్ సంక్రమణలో రెండో దశలో ఉన్నదని, అది మూడో దశకు చేరే రిస్క్ ను తగ్గించేందుకు తగు కార్యాచరణ చర్యలు తీసుకుంటున్నారని ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ చెప్పారు. అందుబాటులో ఉన్న ఆరోగ్య వసతులను న్యాయబద్ధంగా వినియోగించుకోవలసిన అవసరాన్ని నొక్కి చెబుతూ క్వారంటైన్ సదుపాయాలు, ఐసొలేషన్ వార్డుల సంఖ్యను పెంచడంపై మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.
ముఖ్యమంత్రుల ప్రసంగం
కోవిడ్-19పై పోరాటంలో రాష్ర్టాలకు కేంద్రం ఇస్తున్న మద్దతు పట్ల ముఖ్యమంత్రులు ప్రధానమంత్రికి కృతజ్ఞతలు చెప్పారు. కోవిడ్-19 అదుపు చేసే విషయంలో ప్రధానమంత్రి జాతినుద్దేశించి చేసిన ప్రసంగం ప్రభావాన్ని కూడా వారు వివరించారు.
కోవిడ్-19పై పోరాటానికి ఇప్పటివరకు చేసిన ఏర్పాట్ల గురించి ప్రధానమంత్రికి ముఖ్యమంత్రులు వివరించారు. దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెస్టింగ్ సదుపాయాలు పెంచాలని, వ్యాధి విస్తరణ ముప్పు అధికంగా ఉన్న వర్గాలకు మరింత సహకారం అందించాలని, రాష్ర్టాలకు 2020-21 సంవత్సరంలో కేంద్రం అందించే ఆర్థిక వనరులను మరింత ముందుగానే పంపిణీ చేయాలని, కరోనా అదుపు చర్యల్లో ప్రయివేటు లాబ్ లు, ఆస్పత్రులను మరింత అధికంగా భాగస్వాములను చేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రులు విజ్ఞప్తి చేశారు.
కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వానికి తాము పూర్తి సహకారం అందిస్తామని ముఖ్యమంత్రులు హామీ ఇస్తూ తాము కేంద్రప్రభుత్వంతో కలిసికట్టుగా పని చేస్తామని పునరుద్ఘాటించారు.తగినంత మద్దతుకు ప్రధానమంత్రి హామీ
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తగినన్ని చర్యలు తీసుకున్నందుకు, వారి అనుభవాలను తెలియచేసి సలహాలు అందించినందుకు ప్రధానమంత్రి రాష్ర్టాలకు కృతజ్ఞత తెలిపారు. త్వరితగతిన ఆరోగ్య కార్యకర్తల సామర్థ్యాల పెంపు, ఆరోగ్య మౌలిక వసతుల విస్తరణ ఆవశ్యకత గురించి ప్రధానమంత్రి వివరించారు. రాష్ర్టాల్లోని వాణిజ్య మండలులతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడి బ్లాక్ మార్కెటింగ్ ను, అసంబద్ధంగా ధరలు పెంచడాన్ని నిలువరించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రులకు సూచించారు. తప్పనిసరి అయితే చట్టపరంగా తీసుకోవలసిన చర్యలు తీసుకోవడంతో పాటు సాఫ్ట్ పవర్ ను వినియోగించాలని ఆయన అభ్యర్థించారు.
కరోనా వల్ల ఏర్పడే ఆర్థికపరమైన సవాలును దీటుగా ఎదుర్కొనేందుకు కోవిడ్-19 ఎకనామిక్ టాస్క్ ఫోర్స్ తగు వ్యూహం రూపొందిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. పౌరుల భద్రతకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ప్రజలకు భరోసా ఇవ్వడంతో పాటు దేశ పౌరుల భద్రతకు అగ్రప్రాధాన్యం ఇచ్చేందుకు యంత్రాంగం అంతా చిత్తశుద్ధితో కట్టుబడేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి సూచించారు. కోవిడ్-19పై పోరాటానికి అందుబాటులో ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని ఆయన కోరారు.
(Release ID: 1607462)
Visitor Counter : 160