కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

కంపెనీల (రెండో స‌వ‌ర‌ణ) బిల్లు, 2019 కి ఆమోదం తెలిపిన మంత్రిమండ‌లి

Posted On: 04 MAR 2020 4:10PM by PIB Hyderabad

కంపెనీల చ‌ట్టం, 2013ను స‌వ‌రించ‌డం కోసం కంపెనీల (రెండో స‌వ‌ర‌ణ‌) బిల్లు, 2019కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగి న కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.

ఈ బిల్లు చట్టం లో నుండి నేర‌ప‌ర‌మైనటువంటి అంశాన్ని- ఎగ‌వేత‌ ల కు సంబంధించినంతవరకు వేటిని అయితే నిష్పాక్షికం గా నిర్ధారించ‌వచ్చో మరియు దేనిలో అయితే వంచ‌న ఛాయ అంటూ ఏదీ లేకపోయిన‌ ప‌క్షం లో గాని, లేదా దేనిలో అయితే విశాల ప్ర‌జాహితం తాలూకు ప్ర‌మేయం లేక‌పోయిన ప‌క్షం లో- ప‌రిహ‌రిస్తుంది.  ఇది దేశం లో నేర సంబంధిత న్యాయ వ్య‌వ‌స్థ పైన ఉన్న భారాన్ని మరింత గా త‌గ్గించ‌డాని కి కూడా తోడ్ప‌డ‌నుంది.  ఈ బిల్లు చ‌ట్టానికి కట్టుబడి ఉండే కార్పొరేట్ ల కు మ‌నుగ‌డ ను మరింత సుల‌భ‌త‌రం గా మార్చనుంది.

ఇంత‌కు ముందు, చ‌ట్టం లోని వివిధ నిబంధన ల అమ‌లు లో ఎదురైన ఇబ్బందుల ను దూరం చేయ‌డం కోసం చ‌ట్టం లోని కొన్ని నిబంధ‌న‌ ల ను కంపెనీల (స‌వ‌ర‌ణ‌) చ‌ట్టం, 2015 ద్వారా స‌వ‌రించ‌డమైంది.

**



(Release ID: 1605260) Visitor Counter : 127


Read this release in: English , Urdu , Hindi , Kannada