ప్రధాన మంత్రి కార్యాలయం
2020వ సంవత్సరం ఫిబ్రవరి 5వ తేదీ న లఖ్‌నవూ లో జరిగే‘డిఫ్ఎక్స్‌పో 2020’ ప్రారంభ కార్యక్రమాని కి అధ్యక్షత వహించనున్న ప్రధాన మంత్రి
Posted On:
03 FEB 2020 1:34PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2020వ సంవత్సరం ఫిబ్రవరి 5వ తేదీ న లఖ్‌నవూ లో జరిగే ‘డిఫ్ ఎక్స్‌పో 2020’ ప్రారంభ కార్యక్రమాని కి అధ్యక్షత వహించనున్నారు.
ఇది ప్రతి రెండు సంవత్సరాల కు ఒకసారి జరిగే భారీ రక్షణ రంగ సంబంధిత ప్రదర్శన పరంపర లో 11వ ప్రదర్శన. భారతదేశం లో ఇంతవరకు నిర్వహించినటువంటి ప్రదర్శనల లో అతి పెద్దదైన ఈ ప్రదర్శన లో వాటి వాటి ఉత్పత్తుల ను ప్రదర్శించాలని 1000కి పైగా జాతీయ కంపెనీలు మరియు అంతర్జాతీయ కంపెనీ లు పోటాపోటీ పడుతున్నాయి.
‘రక్షణ రంగ తయారీ కేంద్రం గా ఎదుగుతున్న భారతదేశం’ అనేది ఈ ఎక్స్ పో ఇతివృత్తం గా ఉంది. రక్షణ రంగం లోని అగ్రగామి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒక ఛత్రఛాయ కిందకు తెచ్చి, ప్రభుత్వాని కి, ప్రైవేటు ఉత్పత్తి సంస్థల కు మరియు స్టార్ట్-అప్ లకు అనేక అవకాశాల ను అందించాలనేది ఈ ప్రదర్శన యొక్క ధ్యేయం గా ఉంది. ఈ కార్యక్రమం లో భారతదేశ రక్షణ, భద్రత మరియు ఏరోస్పేస్ ప్రయోజనాల తాలూకు సంపూర్ణమైన ముఖచిత్రం కళ్ల కు కట్టనుంది.
సరిక్రొత్త సాంకేతికత లను మేళవించే భావి రణరంగం అనే భావన తో మమేకమయ్యే ‘రక్షణ రంగం యొక్క డిజిటల్ పరివర్తన’ అనేది ఈ ప్రదర్శన తాలూకు ఉప ఇతివృత్తం గా ఉంది.
ప్రారంభ కార్యక్రమం లో పాలుపంచుకొన్న అనంతరం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇండియా పెవిలియన్ ను మరియు ఉత్తర్ ప్రదేశ్ పెవిలియన్ ను సందర్శిస్తారు.
‘ఇండియా పెవిలియన్’ చిన్న మరియు మధ్యతరహా సంస్థలు (ఎస్ఎంఇ స్)/సూక్ష్మ, లఘు మరియు మధ్యతరహా సంస్థ లు (ఎంఎస్ఎంఇ స్), ఇనవేశన్ ఇకో-సిస్టమ్ లు సహా ప్రభుత్వ రంగాని కి మరియు ప్రైవేటు రంగాని కి మధ్య బలమైన భాగస్వామ్యాన్ని కళ్ళకు కట్టనుంది.
ఉత్తర్ ప్రదేశ్ పెవిలియన్ ఆ రాష్ట్రం పారిశ్రామిక శక్తి ని ప్రదర్శించడం తో పాటు రాష్ట్రం లో ఇప్పటికే గుర్తించి న డిఫెన్స్ కారిడోర్ లో ఇన్వెస్టర్ లకు గల భారీ అవకాశాల ను కూడా చాటి చెప్పనుంది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఘనమైన సాంస్కృతిక వారసత్వాన్ని చాటే పలు సాంస్కృతిక కార్యక్రమాల ను కూడా ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఈ సందర్భం గా ఏర్పాటు చేయనుంది. ఈ ప్రదర్శన సందర్శకుల కు విశిష్ట అనుభూతి ని పంచడం కోసం కార్యక్రమ స్థలం లో టెంట్ సిటీ ని ఏర్పాటు చేస్తున్నారు.
ప్రధాన మంత్రి ఈ రెండు పెవిలియన్ లను సందర్శించిన అనంతరం, త్రివిధ దళాల సమగ్రమైన ప్రత్యక్ష విన్యాసాల కు కూడా అధ్యక్షత వహించనున్నారు.
ఈ ‘డిఫ్ ఎక్స్ పో 2020’ లో 70 దేశాల కు పైగా పాలుపంచుకొంటాయని భావిస్తున్నారు. ఇది అంతర్జాతీయ రక్షణ రంగ ప్రదర్శనల లో అతి పెద్ద ప్రదర్శన ల సరసన స్థానాన్ని దక్కించుకోనుంది.
ఈ ఎక్స్ పో లో గణనీయ సంఖ్య లో అవగాహన పూర్వక ఒప్పందం పత్రాలు (ఎంఒయు స్)పై సంతకాలు అవుతాయని ఆశిస్తున్నారు.
**
(Release ID: 1601728)
Visitor Counter : 152
Read this release in:
Gujarati
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Punjabi
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam