ఆర్థిక మంత్రిత్వ శాఖ
కేంద్ర బడ్జెట్ 2020-21 లో ముఖ్యాంశాలు
Posted On:
01 FEB 2020 2:51PM by PIB Hyderabad
21వ శతాబ్దం లో మూడవ దశాబ్ది యొక్క తొలి కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారమణ్ ఈ రోజు న పార్లమెంటు కు సమర్పించారు. దీనిలో దీర్ఘకాలిక ప్రభావాన్ని కలిగినటువంటి అనేక సంస్కరణలను ప్రకటించడం జరిగింది. స్వల్పకాలిక, మధ్యకాలిక మరియు దీర్ఘకాలిక చర్యల ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థ కు శక్తి ని అందించాలన్నది ఈ సంస్కరణ ల ధ్యేయం గా ఉంది.
కేంద్ర బడ్జెట్ 2020-21 లో కీలకమైన ముఖ్య అంశాలు ఈ క్రింది విధం గా ఉన్నాయి:
బడ్జెట్ లోని మూడు ప్రధాన ఇతివృత్తాలు
· ఆకాంక్షభరిత భారతదేశం- సమాజం లో అన్ని వర్గాల వారికి ఆరోగ్యం, విద్య మరియు ఉత్తమ ఉద్యోగాలతో కూడిన మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు అందాలి.
· అందరి కోసం ఆర్థికాభివృద్ధి – ‘‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్.’’
· బాధ్యత కలిగిన సమాజం- మానవీయమైన మరియు దయాళువైన సమాజం; ధర్మానికి ఆధారం గా అంత్యోదయ.
o అవినీతి కి తావు లేని విధానాలు చోదక శక్తి గా ఉన్నటువంటి సుపరిపాలన
o స్వచ్ఛమైన మరియు సుదృఢమైన ఆర్థిక రంగం..
ఈ రెండింటి ద్వారా స్థూలమైన మూడు ఇతివృత్తాలను జతపరచడం జరుగుతుంది.
· కేంద్ర బడ్జెట్ 2020-21 లో మూడు ఇతివృత్తాల ను ఈజ్ ఆఫ్ లివింగ్ నొక్కి వక్కాణించింది.
ఆకాంక్షభరిత భారతదేశం లో మూడు భాగాలు:
· వ్యవసాయం, సాగునీటిపారుదల మరియు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి,
· ఆరోగ్యం, జలం మరియు పారిశుధ్యం.
· విద్య మరియు నైపుణ్యాలు
వ్యవసాయం, సాగునీటిపారుదల, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ల కోసం 16 కార్య ప్రణాలికలు.
· దిగువన పేర్కొన్న 16 అంశాల కార్య ప్రణాళిక కోసం 2.83 లక్షల కోట్ల రూపాయలను కేటాయించనున్నారు.
o వ్యవసాయం, సాగునీటి పారుదల మరియు సంబంధిత కార్యకలాపాల కోసం 1.60 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించనున్నారు.
o గ్రామీణ అభివృద్ధి కోసం మరియు పంచాయతీ రాజ్ కోసం 1.23 లక్షల కోట్ల రూపాయలను వెచ్చిస్తారు.
· వ్యవసాయ రుణం:
o 2020-21 సంవత్సరానికి గాను 15 లక్షల కోట్ల రూపాయల లక్ష్యాన్ని నిర్దేశించడమైంది.
o పిఎం-కిసాన్ లబ్ధిదారులకు కెసిసి పథకాన్ని వర్తింపచేయాలన్న ప్రతిపాదన.
o నాబార్డ్ రీ-ఫైనాన్స్ స్కీమ్ ను మరింతగా విస్తరించడం జరుగుతుంది.
· నీటి ఎద్దడి ని ఎదుర్కొంటున్న 100 జిల్లాలకు సమగ్రమైన చర్యలను ప్రతిపాదించడమైంది.
· నీలి ఆర్థిక వ్యవస్థ.
· 2024-25 కల్లా 1 లక్ష కోట్ల రూపాయల మత్స్యరంగ ఎగుమతులను సాధించాలనేది లక్ష్యం.
· 2022-23 కల్లా 200 లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తులను లక్ష్యం గా పెట్టుకోవడమైంది.
· మత్స్య పరిశ్రమ విస్తరణలో యువతను భాగస్తుల ను చేయడం కోసం 3477 సాగర్ మిత్రా లు మరియు 500 మత్స్య రైతు నిర్మాత సంస్థల ఏర్పాటు.
· నాచు ను, సముద్ర కలుపు జాతుల ను పెంచడం తో పాటు కేజ్ కల్చర్ లను ప్రోత్సహించనున్నారు.
· సముద్ర సంబంధ మత్స్య వనరుల సంరక్షణ, నిర్వహణ మరియు అభివృద్ధి ల కోసం ఫ్రేమ్ వర్క్ నిర్మాణం.
· భారతీయ రైల్వేలు పిపిపి ద్వారా కిసాన్ రైల్ వ్యవస్థను నెలకొల్పుతుంది:
o పాలు, మాసం, చేపల వంటి త్వరగా పాడైపోయే పదార్థాల కోసం ఒక నిరంతరాయ జాతీయ శీతలీకృత సరఫరా వలయాన్ని ఏర్పాటు చేయనున్నారు.
o ఎక్స్ ప్రెస్ రైళ్ళ లోను, ఫ్రైట్ రైళ్ళ లోను శీతలీకరించిన రైలు పెట్టెలను ఏర్పాటు చేస్తారు.
· పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కృషి ఉడాన్ లను మొదలు పెడుతుంది.
o జాతీయ మార్గాల తో పాటు, అంతర్జాతీయ మార్గాలను కూడా దీనికి జోడిస్తారు.
o ఈశాన్య ప్రాంత జిల్లాలు మరియు ఆదివాసీ సముదాయాలు అధికంగా నివసించే జిల్లాల లో వ్యవసాయ ఉత్పత్తుల విలువను మెరుగు పరచేందుకు చొరవ తీసుకోవడం జరుగుతుంది.
· ఉద్యానవనాల రంగం లో మెరుగైన మార్కెటింగ్ మరియు ఎగుమతి లక్ష్య సాధన కోసం వన్-ప్రాడక్ట్ వన్ - డిస్ట్రిక్ట్ పథకాన్ని ప్రవేశపెడతారు.
· సాంప్రదాయిక సేంద్రియ ఎరువులు మరియు క్రొత్త క్రొత్త ఎరువుల రకాల సంతులిత వాడకం.
· సేంద్రియ వ్యవసాయం, ప్రాకృతిక వ్యవసాయం మరియు సమీకృత వ్యవసాయం ల దిశగా చర్యలు చేపడుతారు. వాటిలో..
o జైవిక్ ఖేతీ పోర్టల్ – సేంద్రియ ఉత్పత్తుల కు సంబంధించిన జాతీయ ఆన్ లైన్ బజారు ను బలోపేతం చేస్తారు.
o జీరో–బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ (జులై 2019 బడ్జెట్ లో దీనిని ప్రస్తావించడమైంది)ని కూడా దీనిలో చేర్చుతారు.
o వర్షాధార ప్రాంతాల లో సమీకృత సాగు వ్యవస్థల ను విస్తరించడం జరుగుతుంది.
o పంటకాలం కానటువంటి వేళల్లో బహుళ అంచెల పంటల పద్ధతి ని, తేనెటీగల పెంపకాన్ని, సోలర్ పంపులను, సౌర శక్తి ఉత్పత్తి ని కూడా జోడించనున్నారు.
· పిఎం-కుసుమ్ ను విస్తరించనున్నారు.
o సోలర్ పంపులను ఏర్పాటు చేయడం కోసం 20 లక్షల మంది రైతులకు అండదండలు కల్పిస్తారు.
o మరొక 15 లక్షల మంది రైతులకు వారి యొక్క గ్రిడ్ సంధానిత పంప్ సెట్లను సౌరశక్తి తో పని చేసే విధంగా తీర్చిదిద్దుకొనేందుకు అవసరమైన సహాయాన్ని అందిస్తారు.
o రైతులు వారి యొక్క బంజరు భూముల లోను మరియు ఫలించని భూముల లోను సౌర విద్యుత్తు ఉత్పాదనకు నడుం కట్టి ఆ తరహా విద్యుత్తు ను గ్రిడ్ కు విక్రయించేందుకు వీలు కల్పించేటటువంటి ఒక పథకాన్ని అమలు చేస్తారు.
· గ్రామంలో నిల్వ పథకం:
o రైతుల కు ఒక చక్కనైన నిల్వ సామర్ధ్యాన్ని అందుబాటు లోకి తెచ్చి వారి లాజిస్టిక్స్ సంబంధిత ఖర్చును తగ్గించడం కోసం స్వయంసహాయసమూహాలు (ఎస్ హెచ్ జి) లు విలేజ్ స్టోరేజి స్కీము ను నిర్వహించనున్నాయి.
o మహిళలు మరియు ఎస్ హెచ్ జి లు ధన్య లక్ష్మి పథకానికి తమ వంతు తోడ్పాటును అందించవలసి ఉంటుంది.
· వ్యవసాయ సంబంధిత గిడ్డంగులు, శీతలీకరించిన నిల్వ కేంద్రాలు, రీఫర్ వ్యాన్ సదుపాయాలు వంటి వాటిని నాబార్డ్ మ్యాపింగ్ చేసి, వాటికి జియో ట్యాగ్ లను సమకూర్చనుంది.
· వేర్ హౌస్ డివెలప్ మెంట్ అండ్ రెగ్యులేటరీ ఆథారిటి (డబ్ల్యుడిఆర్ఎ) ద్వారా గోదాముల స్థాపన కు నియమాలను తీర్చిదిద్దుతారు:
o ఆ కోవకు చెందిన గోదాములను బ్లాక్ స్థాయి లోను/తాలూకా స్థాయి లోను నెలకొల్పేందుకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ చేపడుతారు.
o భారత ఆహార సంస్థ (ఎఫ్ సిఐ) మరియు సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేశన్ (సిడబ్ల్యుసి)లు కూడా వాటి స్థలాలలో ఈ తరహా గోదాములను నిర్మిస్తాయి.
· నెగోషియబుల్ వేర్ హౌసింగ్ రిసీట్స్ (ఇ-ఎన్ డబ్ల్యుఆర్) సంబంధిత ఆర్థిక సహాయాన్ని ను ఇ-ఎన్ఎఎమ్ తో ఏకీకృతం చేయడం జరుగుతుంది.
· కేంద్ర ప్రభుత్వం జారీ చేసే మాడల్ చట్టాల ను అమలు పరచే రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రోత్సాహాన్ని ఇవ్వడం జరుగుతుంది.
· పశు సంపద:
o మిల్క్ ప్రోసెసింగ్ సామర్ధ్యాన్ని 2025 కల్లా 53.5 మిలియన్ మెట్రిక్ టన్నుల నుండి రెండింతలు చేసి 108 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచడం జరుగుతుంది.
o కృత్రిమ గర్భధారణ కవరేజీ ని ప్రస్తుతం ఉన్న 30 శాతం నుండి 70 శాతానికి పెంచడం జరుగుతుంది.
o పశుదాణా క్షేత్రాల ను అభివృద్ధి పరచేందుకు ఎంఎన్ఆర్ఇజిఎస్ నుండి సాయాన్ని ఇవ్వడం జరుగుతుంది.
o పశువుల లో గాలికుంటు వ్యాధి మరియు బ్రూసిలోసిస్ లను మరియు మేకల లోను, గొర్రెల లోను సోకేటటువంటి పిపిఆర్ వ్యాధిని 2025 కల్లా అంతమొందించాలనేది లక్ష్యం.
· దీన్ దయాళ్ అంత్యోదయ యోజన – పేదరిక నిర్మూలన కోసం 58 లక్షల ఎస్ హెచ్ జి ల తో 0.5 కోట్ల కుటుంబాల ను జోడించడమైంది.
వెల్ నెస్, నీరు మరియు పారిశుధ్యం.
· ఆరోగ్య సంరక్షణ రంగం కోసం 69,000 కోట్ల రూపాయల ను కేటాయించడమైనది
· పిఎం జన్ ఆరోగ్య యోజన (పిఎం జెఎవై) కోసం 6400 కోట్ల రూపాయలు (69,000 కోట్ల రూపాయల లో నుండి) కేటాయించడమైంది.
o పిఎం జెఎవై లో భాగంగా 20,000కు పైగా ఆసుపత్రులను ప్యానల్ లో ఇప్పటికే చేర్చడం పూర్తి అయింది.
o వైద్య శాలల ను పిపిపి పద్ధతి లో ఏర్పాటు చేసేందుకు గాను వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ సౌకర్యాన్ని ప్రతిపాదించడమైంది.
o ఆయుష్మాన్ కు జోడించిన ప్యానల్ లో చేరిన వైద్యశాలలంటూ ఏవీ లేనటువంటి ఆకాంక్షభరిత జిల్లాలను తొలి దశ లో కవర్ చేయడం జరుగుతుంది.
o మశీన్ లర్నింగ్ మరియు ఆర్టిఫిశియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ)ల సాయం తో సముచితమైన నివారక పద్ధతుల ను ఉపయోగించి, వ్యాధుల తగ్గింపునకు నడుం బిగిస్తారు.
· జన్ ఔషధి కేంద్ర పథకం లో భాగం గా 2024 కల్లా అన్ని జిల్లాల లో 2000 మందులను మరియు 300 శస్త్ర చికిత్స సంబంధిత పరికరాలను సమకూర్చుతారు.
· క్షయ వ్యాధి ని 2025 కల్లా అంతమొందించాలన్న వాగ్ధానాన్ని నెరవేర్చేందుకు టిబి హారేగా దేశ్ జీతేగా ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించడమైంది.
· జల్ జీవన్ మిశన్ కోసం 3.60 లక్షల కోట్ల రూపాయలకు ఆమోదం తెలపడమైంది.
o 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను 11,500 కోట్ల రూపాయలను వెచ్చిస్తారు.
o స్థానిక జల వనరులను వృద్ధి చేస్తారు. ఇప్పటికే అందుబాటు లో ఉన్న వనరులను రీచార్జ్ చేయడం జరుగుతుంది. అంతేకాదు, ఇంకుడుగుంతలను, నిర్లవణీకరణ ను ప్రోత్సహించడం జరుగుతుంది.
o మిలియన్ కు పైబడిన జనాభా గల నగరాల ను ప్రస్తుత సంవత్సరం లోనే ఈ లక్ష్య సాధన దిశ గా ప్రోత్సహిస్తారు.
· స్వచ్ఛ్ భారత్ మిశన్ కోసం 2020-21 లో 12,300 కోట్ల రూపాయల కేటాయింపు:
o ఒడిఎఫ్ తో మిళితమైన ప్రవర్తన ను ప్రోత్సహించడం కోసం ఒడిఎఫ్ – ప్లస్ వాగ్దానం.
o లిక్విడ్ మరియు గ్రే వాటర్ మేనేజ్ మెంట్ విషయం లో శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది.
o ఘన వ్యర్థాల సేకరణ, మూలం లోనే వేరు చేయడం, అలాగే ప్రోసెసింగ్ పైన సైతం శ్రద్ధ వహిస్తారు.
విద్య మరియు ప్రావీణ్యాలు
· 2020-21 లో విద్యారంగానికి 99,300 కోట్ల రూపాయలు, నైపుణ్యాల అభివృద్ధి కి 3,000 కోట్ల రూపాయలు.
· త్వరలోనే జాతీయ విద్యా విధానాన్ని ప్రకటించడం జరుగుతుంది.
· విజ్ఞాన శాస్త్రం, న్యాయ సంబంధిత విజ్ఞాన శాస్త్రం మరియు సైబర్ ఫోరెన్సిక్స్ రంగాలకు మద్ధతుగా జాతీయ పోలీసు విశ్వవిద్యాలయాన్ని, అలాగే నేశనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడమైంది.
· నేశనల్ ఇన్ స్టిట్యూశనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ లో అగ్రగామి 100 సంస్థలు డిగ్రీ స్థాయి ఆన్ లైన్ విద్యా కార్యక్రమాన్ని నిర్వహిస్తాయి.
· . నూతన ఇంజినీర్లకు ఒక సంవత్సరం వ్యవధి తో కూడిన ఇంటర్న్ శిప్ ను పట్టణ స్థానిక సంస్థలు అందిస్తాయి.
· ఇప్పటికే నడుస్తున్న జిల్లా ఆసుపత్రి కి ఒక వైద్య కళాశాల ను పిపిపి పద్ధతి లో అనుబంధం చేయాలని బడ్జెట్ ప్రతిపాదిస్తున్నది.
· ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ లు ప్రత్యేకం గా బ్రిడ్జి కోర్సుల ను రూపొందిస్తాయి:
o ఉపాధ్యాయులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది మరియు విదేశాల లో సంరక్షణ సేవల ప్రదాతల కు ఉన్నటువంటి డిమాండును తీర్చడం కోసం.
o అలాగే శ్రామిక సిబ్బంది నైపుణ్యాలను యాజమాన్య సంస్థలు కోరేటటువంటి ప్రమాణాలకు అనువుగా మెరుగు దిద్దడం కోసం ఈ కోర్సుల ను తీసుకు వస్తున్నారు.
· 150 ఉన్నత విద్యా సంస్థలు అప్రెంటిస్ శిప్ తో కూడిన డిగ్రీ/ డిప్లొమా కోర్సులను 2021 మార్చి నెల కల్లా ఆరంభించనున్నాయి.
· విద్యా రంగం లో ఎఫ్ డిఐ మరియు ఎక్స్ టర్నల్ కమర్శియల్ బారోయింగ్స్ కు వీలు కల్పిస్తారు.
· స్టడీ ఇన్ ఇండియా కార్యక్రమం లో భాగంగా ఆసియా దేశాల కోసం, అలాగే ఆఫ్రికా దేశాల కోసం ఇండ్-శాట్ ను ప్రతిపాదించడమైంది.
ఆర్థికాభివృద్ధి
పరిశ్రమ, వాణిజ్యం మరియు పెట్టుబడి
· పరిశ్రమ మరియు వాణిజ్యం ల యొక్క అభివృద్ధి, ప్రోత్సాహం ల కోసం 2020-21 సంవత్సరానికి 27,300 కోట్ల రూపాయల నిధులను కేటాయించడమైంది.
· ఇన్వెస్ట్ మెంట్ క్లియరెన్స్ సెల్ ను ఏర్పాటు చేయాలని, దీనిలో పనులను ఒక పోర్టల్ ద్వారా జరపాలని ప్రతిపాదించడమైంది:
· క్రొత్త గా అయిదు స్మార్ట్ సిటీస్ ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించడమైంది.
· మొబైల్ ఫోన్లు, ఇలెక్ట్రానిక్ సామగ్రి మరియు సెమి కండక్టింగ్ ప్యాకేజింగ్ ల తయారీని ప్రోత్సహించేందుకు ఒక పథకాన్ని తీసుకురావాలని ప్రతిపాదించడమైంది.
· నేశనల్ టెక్నికల్ టెక్స్ టైల్స్ మిశన్ ను ఏర్పాటు చేయడం జరుగుతుంది.
o 2020-21 నుండి 2023-24 మధ్య కాలంలో ఈ మిశన్ ను అమలు చేస్తారు.
o దీనికి గాను 1480 కోట్ల అంచనా వ్యయం అవుతుందని లెక్క వేశారు.
o భారతదేశాన్ని టెక్నికల్ టెక్స్ టైల్స్ లో ప్రపంచంలో అగ్రగామి దేశాల లో ఒకటిగా నిలబెట్టాలనేది దీని ధ్యేయం.
· ఎగుమతి సంబంధిత రుణాల ను అధిక స్థాయి లో మంజూరు చేసే లక్ష్యాన్ని సాధించడం కోసం నిర్ విక్ (NIRVIK) పేరు తో ఒక కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టబోతున్నారు:
ఇది
o ఉన్నత బీమా రక్షణ ను
o చిన్న ఎగుమతి సంస్థలకు ప్రీమియం లో తగ్గింపును
మరియు
o క్లెయిమ్ సెటిల్ మెంట్ కు సరళతరమైనటువంటి విధానాన్ని
ప్రసాదిస్తుంది.
· గవర్నమెంట్ ఇ-మార్కెట్ ప్లేస్ (జిఇఎమ్) యొక్క టర్నోవర్ ను 3 లక్షల కోట్ల రూపాయలకు చేర్చాలని లక్ష్యం గా పెట్టుకొన్నారు.
· ఎగుమతి చేసే ఉత్పత్తులపై సుంకాలు మరియు పన్నుల సవరణ కు ఒక పథకాన్ని ప్రవేశపెడతారు.
o ఎగుమతి సంస్థలకు కేంద్ర, రాష్ట్ర మరియు స్థానిక స్థాయిల లో విధించిన సుంకాలు మరియు పన్నుల లో ఇతరత్రా మినహాయింపు గానీ, లేదా రిఫండ్ గానీ లేకపోయినట్లయితే రిఫండ్ ను డిజిటల్ పద్ధతి లో పూర్తి చేస్తారు.
· ‘‘జీరో డిఫెక్ట్ – జీరో ఇఫెక్ట్’’ తయారీ అనే ప్రధాన మంత్రి దార్శనికతకు అనుగుణం గా అన్ని మంత్రిత్వ శాఖలు నాణ్యత పరమైన ప్రమాణాల కు సంబంధించిన ఉత్తర్వుల ను జారీ చేస్తాయి.
బడ్జెట్ స్వరూపం
మౌలిక సదుపాయాల రంగం
· మౌలిక సదుపాయాల రంగంలో తదుపరి 5 సంవత్సరాల కాలం లో 100 లక్షల కోట్ల రూపాయలను పెట్టుబడిగా తీసుకు వస్తారు.
· నేశనల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్:
o 103 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను 2019 డిసెంబర్ 31వ తేదీ నాడు ప్రారంభించడమైంది.
o వేరు రంగాల లో 6,500కు పైగా ప్రాజెక్టుల ను వాటి యొక్క పరిమాణం మరియు వాటి యొక్క అభివృద్ధి దశలను బట్టి వర్గీకరించడం జరుగుతుంది.
· జాతీయ లాజిస్టిక్స్ విధానాన్ని త్వరలోనే వెల్లడించడం జరుగుతుంది:
o కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల తో పాటు, కీలకమైన నియంత్రణ సంస్థల భూమికల ను దీనిలో స్పష్టం చేయనున్నారు.
o సింగిల్ విండో ఇ-లాజిస్టిక్ మార్కెట్ ను నెలకొల్పుతారు.
o ఉద్యోగ కల్పన ప్రావీణ్య సాధన మరియు ఎంఎస్ఎంఇ లను పోటీ పడే విధంగా తయారు చేయడం పై ప్రత్యేకంగా దృష్టిని సారిస్తారు.
· మౌలిక సదుపాయాల రంగానికి అవసరమైన విధం గా నైపుణ్యాల అభివృద్ధి అవకాశాలను కల్పించడం పై నేశనల్ స్కిల్ డివెలప్ మెంట్ ఏజెన్సీ ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది.
· మౌలిక రంగ ప్రాజెక్టుల కోసం ప్రాజెక్టు సన్నాహక సదుపాయాన్ని ఒకటి ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడమైంది.
o దీనిలో యువ ఇంజినీర్లు, మేనేజ్ మెంట్ పట్టభద్రులు మరియు విశ్వవిద్యాలయాల ఆర్థికవేత్తల కు క్రియాశీల భాగస్వామ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది.
· స్టార్ట్-అప్ లలో యువ శక్తి ప్రమేయాన్ని కల్పించే దిశ గా ప్రభుత్వాని కి చెందిన ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఏజెన్సీలు పాటుపడతాయి.
· 2020-21లో రవాణా సంబంధిత మౌలిక సదుపాయాల కల్పన కోసం 1.7 లక్షల కోట్ల నిధులను ప్రతిపాదించడమైంది.
లోటు కు సంబంధించిన ఆర్థిక సహాయానికి సాధనాలు
హైవేస్:
· హైవేస్ ను శీఘ్ర గతి న అభివృద్ధి పరచడం జరుగుతుంది:
దీనిలో
o 2500 కి.మీ మేర యాక్సెస్ కంట్రోల్ హైవేస్
o 9000 కి.మీ మేర ఎకనామిక్ కారిడోర్ లు
o 2000 కి.మీ కోస్తా తీరం మరియు నౌకాశ్రయ రహదారులు.
o 2000 కి.మీ మేర వ్యూహాత్మక హైవేలు
భాగం గా ఉంటాయి.
· ఢిల్లీ-ముంబయి ఎక్స్ ప్రెస్ వే మరియు రెండు ఇతర ప్యాకేజీల ను 2023 కల్లా పూర్తి చేయడం జరుగుతుంది.
· చెన్నై-బెంగళూరు ఎక్స్ ప్రెస్ వే పనులను మొదలు పెట్టడం జరుగుతుంది.
· 2024 కన్నా ముందే 6000 కి.మీ.కి పైగా హైవే బండిల్స్ ను నగదు గా మార్చుకోవాలని ప్రతిపాదించడమైంది.
భారతీయ రైల్వేలు:
· అయిదు ఆలోచన లు:
o రైలు మార్గాల ప్రక్కన రైల్వేల యాజమాన్యం లోని భూమి లో భారీ సౌర విద్యుత్తు ఉత్పాదక కేంద్రాల ను ఏర్పాటు చేయడం జరుగుతుంది.
o నాలుగు స్టేశన్ లను అభివృద్ధి చేసే పథకాల తో పాటు, పిపిపి పద్ధతి న 150 ప్యాసింజర్ రైళ్ళ నిర్వహణ ను చేపట్టడం జరుగుతుంది.
o ప్రముఖ పర్యటక స్థలాలకు తేజస్ తరహా రైళ్ళ ను మరిన్ని వేయడం జరుగుతుంది.
o ముంబయి-అహమదాబాద్ ల మధ్య హై స్పీడ్ రైలు కు సంబంధించిన పనిని చురుకు గా చేపట్టడం జరుగుతుంది.
- 18,600 కోట్ల రూపాయల వ్యయం తో 148 కి.మీ. పొడవున సాగే బెంగళూరు శివారు రవాణా పథకాన్ని చేపట్టడం జరుగుతుంది. దీని చార్జీలు మెట్రో తరహా లో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం 20 శాతం ఎక్విటీ ని సమకూర్చుతుంది. ప్రాజెక్టు వ్యయం లో 60 శాతం వరకు వెలుపలి నుండి సహాయానికి మార్గం సుగమం చేస్తుంది.
భారతీయ రైల్వేల విజయాలు
o 550 స్టేశన్ లలో వై-ఫై సదుపాయాల ను ప్రారంభించడమైంది.
o మానవుల కాపలా లేనటువంటి రైల్వే క్రాసింగులంటూ ఏవీ లేవు.
o 27,000 కి.మీ. మేర రైలు మార్గాన్ని విద్యుతీకరించడమైంది.
నౌకాశ్రయాలు, జల మార్గాలు:
· కనీసం ఒక ప్రధానమైన ఓడ రేవు ను కార్పొరేట్ స్థాయి కి చేర్చడం మరియు ఆ కంపెనీ ని స్టాక్ ఎక్చేంజీల లో నమోదు చేయాలన్న అంశాన్ని పరిశీలించడం జరుగుతుంది.
· నౌకాశ్రయాల సామర్ధ్యాన్ని పెంచేందుకు ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ప్రభుత్వ ఫ్రేమ్ వర్క్ ను రూపొందించడం జరుగుతుంది.
· ప్రధాన మంత్రి చేసిన అర్థ్ గంగా ఆలోచన కు తగ్గట్టుగా నదీతీర ప్రాంతాల వెంబడి ఆర్థిక కార్యకలాపాలకు నూతన శక్తి ని సంతరించడం జరుగుతుంది.
విమానాశ్రయాలు:
· ఉడాన్ పథకాని కి మద్ధతు ఇచ్చేందుకు 2024 కల్లా మరో 100 విమానాశ్రయాల ను అభివృద్ధి పరచడం జరుగుతుంది.
· ఈ కాలం లోపల, విమానాల సంఖ్య ఇప్పుడున్న 600 నుండి 1200కు పెరగవచ్చన్న అంచనా ఉంది.
విద్యుత్తు:
· ‘‘స్మార్ట్’’ మీటర్ల వ్యాప్తి ని ప్రోత్సహించడం జరుగుంది.
· డిస్కమ్ లను సంస్కరించేందుకు మరిన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
శక్తి:
· 2020-21 లో శక్తి మరియు నవీకరణీయ శక్తి రంగం లో 22,000 కోట్ల రూపాయల విలువైన ప్రతిపాదనలు.
· నేశనల్ గ్యాస్ గ్రిడ్ ను ఇప్పుడున్న 16,200 కి.మీ. స్థాయి నుండి 27,000 కి.మీ. కి విస్తరించాలని ప్రాతిపాదించడమైంది.
· పారదర్శకమైన ధర అన్వేషణ మరియు లావాదేవీల లో సౌలభ్యం కోసం మరిన్ని సంస్కరణలు.
నూతన ఆర్థిక వ్యవస్థ
· నూతన సాంకేతిక పరిజ్ఞానాల ను వినియోగించుకొంటూ:
· దేశం అంతటా డేటా సెంటర్ పార్కుల ను ఏర్పాటు చేయడం కోసం ప్రైవేటు రంగం తోడ్పాటు ను కోరే ఒక విధానాన్ని త్వరలో ప్రకటించడం జరుగుతుంది.
o భారత్ నెట్ ద్వారా ఈ సంవత్సరం లో ఒక లక్ష గ్రామ పంచాయతీల ను ఫైబర్ టు హోమ్ (ఎప్ టిటిహెచ్) కనెక్షన్ల తో కలపడం జరుగుతుంది.
o భారత్ నెట్ కార్యక్రమం అమలు కోసం 2020-21 లో 6,000 కోట్ల రూపాయల నిధులను ప్రతిపాదించడం జరిగింది.
· స్టార్ట్-అప్ ల యొక్క లబ్ధి కి ఈ క్రింది చర్యల ను ప్రతిపాదించడమైంది:
o ఐపిఆర్ ల నిరంతర వినియోగానికి తోడ్పడే ఒక డిజిటల్ ప్లాట్ ఫార్మ్ ను ప్రోత్సహించడం జరుగుంది.
o వివిధ సాంకేతిక రంగాల లో నాలెడ్జ్ ట్రాన్స్ లేశన్ క్లస్టర్స్ ను ఏర్పాటు చేయడం జరుగుతుంది.
o టెక్నాలజీ క్లస్టర్ లకు సంబంధించిన కార్యకలాపాలను రూపొందించడం, వాటి స్థాయి ని పెంచడం, చిన్నతరహా ఉత్పత్తి కేంద్రాల ను నెలకొల్పడం జరుగుతుంది.
o భారతదేశం యొక్క జెనెటిక్ లాండ్ స్కేప్ ను మ్యాపింగ్ చేయడానికి రెండు జాతీయ స్థాయి విజ్ఞాన శాస్త్ర పథకాల ను కొత్తగా ఆరంభించడం జరుగుతుంది. ఒక సమగ్రమైన డేటా బేస్ ను సృష్టించాలన్నదే దీనిలోని ముఖ్యోద్దేశ్యం.
o స్టార్ట్-అప్ లకు మద్దతును ఇవ్వడం కోసం ఒక సీడ్ ఫండ్ సహా వాటి తొలి దశ లో ఆర్థిక సహాయాన్ని అందజేయాలన్నప్రతిపాదన కూడా ఉంది.
· నేశనల్ మిశన్ ఆన్ క్వాంటమ్ టెక్నాలజీస్ అండ్ అప్లికేశన్స్ కోసం అయిదు సంవత్సరాల కాలం లో 8,000 కోట్ల రూపాయల నిధులను ఇవ్వాలని ప్రతిపాదించడమైంది.
బాధ్యత కలిగినటువంటి సమాజం
o మహిళలు మరియు బాలలు, సామాజిక సంక్షేమం, సంస్కృతి, ఇంకా పర్యటన రంగాలపై దృష్టి పెట్టడం జరుగుతుంది.
· 2020-21 ఆర్థిక సంవత్సరంలో పోషణ విజ్ఞానం సంబంధిత కార్యక్రమాల కోసం 35,600 కోట్ల రూపాయల ను కేటాయించాలని ప్రతిపాదించడమైంది.
· మహిళా ప్రధాన కార్యక్రమాల కోసం 28,600 కోట్ల రూపాయల నిధుల ను ప్రతిపాదించడమైంది.
· ఒక బాలిక మాతృత్వ దశ లోకి అడుగుపెట్టే వయస్సు కు సంబంధించిన అంశం లో ఒక టాస్క్ ఫోర్స్ ను ఆరు సంవత్సరాల కాలం లోపల సిఫారసు లు నివేదించే విధం గా ఏర్పాటు చేయాలని ప్రాతిపాదించడమైంది.
· మురుగునీటి పారుదల లేదా సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేసేందుకు మానవులు ఎవ్వరూ ముందుకు రాని విధంగా చూసేందుకు గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల శాఖ గుర్తించిన సాంకేతిక విజ్ఞానాన్ని విస్తృత స్థాయి లో స్వీకరించేటట్లు ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది.
· షెడ్యూల్డు కులాలు మరియు ఇతర వెనుకబడిన తరగతుల వారి సంక్షేమం కోసం 2020-21 లో 85,000 కోట్ల రూపాయల నిధులను ప్రతిపాదించడమైంది.
· షెడ్యూల్డు తెగల వారి సంక్షేమానికి 53,700 కోట్ల రూపాయల నిధులను కేటాయించడమైంది.
· వయో వృద్ధులు మరియు దివ్యాంగ జనుల కోసం 2020-21 కి గాను కేటాయింపును పెంచి 9,500 కోట్ల రూపాయలను సమకూర్చడమైంది.
సంస్కృతి మరియు పర్యటన రంగం
· 2020-21 లో పర్యటన రంగ ప్రోత్సాహానికి గాను 2,500 కోట్ల రూపాయల నిధుల కేటాయింపు.
· 2020-21 కి గాను సంస్కృతి మంత్రిత్వ శాఖ కు 3,150 కోట్ల రూపాయల నిధుల ను ప్రతిపాదించడమైంది.
· డీమ్డ్ యూనివర్సిటీ హోదా తో సంస్కృతి మంత్రిత్వ శాఖ పరిధి లో ఒక ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెరిటేజ్ ఎండ్ కన్సర్వేశన్ ను స్థాపించాలని ప్రతిపాదించడమైంది.
· 5 పురావస్తు క్షేత్రాల ను వస్తు ప్రదర్శన శాలల తో సహా ప్రముఖ స్థలాలు గా అభివృద్ధి పరచడం జరుగుతుంది. అవి...
- హరియాణాలోని రాఖీ గఢీ
- ఉత్తర్ ప్రదేశ్ లోని హస్తినాపుర్
- అసమ్ లోని శివ్ సాగర్
- గుజరాత్ లోని ఢోలా వీరా మరియు
- తమిళ నాడు లోని అదిచనల్లూర్
· ప్రధాన మంత్రి 2020వ సంవత్సరం జనవరి లో ప్రకటించిన విధం గా కోల్ కాతా లోని ఇండియన్ మ్యూజయమ్ యొక్క పునరుద్ధరణ ను చేపట్టడమైంది.
· కోల్ కాతా లోని చరిత్రాత్మకమైన ఓల్డ్ మింట్ బిల్డింగ్ లో మ్యూజియమ్ ఆన్ న్యూమిస్ మాటిక్స్ అండ్ ట్రేడ్ ను ఏర్పాటు చేయడం జరుగుతుంది.
· దేశం లో మరో నాలుగు వస్తు ప్రదర్శన శాలల ను పునర్ నవీకరించడం మరియు పునరుద్ధరించడం జరుగుతుంది.
· ఝార్ ఖండ్ లోని రాంచీ లో ఒక ఆదివాసీ వస్తు ప్రదర్శన శాల ను ఏర్పాటు చేసేందుకు మద్దతు.
· శిప్పింగ్ మంత్రిత్వ శాఖ అహమదాబాద్ సమీపం లో హరప్పా కాలం నాటి మేరీటైమ్ క్షేత్రమైన లోథల్ లో సముద్ర సంబంధిత వస్తు ప్రదర్శన శాల ను ఏర్పాటు చేయనుంది.
· రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని గుర్తించినటువంటి స్థలాల అభివృద్ధి కి ఒక మార్గసూచీ ని సిద్ధం చేస్తే, ఆ పని ని పూర్తి చేయడం కోసం 2020-21 లో రాష్ట్రాల కు నిర్దష్ట గ్రాంటు ల ను మంజూరు చేయడం జరుగుతుంది.
పర్యావరణం మరియు జల వాయు పరివర్తన
· దీనికి గాను 2020-21లో 4,400 కోట్ల రూపాయల ను కేటాయించడం జరుగుతుంది.
· పూర్వ నిర్దేశిత నిబంధన కు మించి కర్బన ఉద్గారాల తో ప్రస్తుతం నడుస్తున్న పాతవైన థర్మల్ పవర్ ప్లాంటుల ను మూసివేయవలసింది గా ఆయా సంస్థల కు సూచించాలని ప్రతిపాదించడమైంది.
· పరిశుభ్రమైన గాలి అందేలా చూడాలని ఒక మిలియన్ కు పైబడిన జనాభా కలిగిన నగరాల లో ప్రణాళికల ను రూపొందిస్తున్న మరియు అమలు చేస్తున్న రాష్ట్రాలను ప్రోత్సహించడం జరుగుతుంది.
· కోయలీశన్ ఫర్ డిజాస్టర్ రిసీలియంట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ (సిడిఆర్ ఐ)ని ప్రధాన మంత్రి ప్రారంభించారు. దీని సెక్రటేరియట్ ఢిల్లీ లో ఉంది. ఇంటర్ నేశనల్ సోలర్ అలయన్స్ కు తరువాయిగా చేపట్టినటువంటి రెండవ అంతర్జాతీయ చొరవ ఇది.
పరిపాలన
· స్వచ్ఛమైన, అవినీతి రహితమైన విధానాలు చోదకం గా ఉన్న ఉద్దేశ్యం మంచిదైన మరియు అత్యంత ముఖ్యంగా చూసినప్పుడు ధర్మం పట్ల విశ్వాసం కలిగిన పాలన.
· టాక్స్ పేయర్ చార్టర్ ను చట్టం లో ఉల్లేఖించడం జరుగుతుంది. ఇది పన్నుల సంబంధిత పరిపాలన లో న్యాయానికి మరియు దక్షతకు చోటు ఇస్తుంది.
· స్వభావం లో సివిల్ గా ఉంటూనే నేర ప్రవృత్తి తో కూడినటువంటి కొన్ని చర్యల ను చట్టం లో చేర్చి కంపెనీల చట్టం ను సవరించడం జరుగుతుంది.
o అటువంటి నిబంధనల తో కూడిన ఇతర చట్టాల లో సైతం దిద్దుబాట్లు చేయడం జరుగుతుంది.
· ప్రభుత్వం లోను, మరియు ప్రభుత్వరంగ బ్యాంకుల లోను నాన్ గెజిటెడ్ ఉద్యోగాల నియామకం లో ప్రధాన సంస్కరణలు:
o నియామకం కోసం కంప్యూటర్ ఆధారం గా ఆన్ లైన్ ని, కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ ను నిర్వహించడం కోసం ఒక స్వతంత్రమైన వృత్తి ప్రావీణ్యం కలిగిన, మరియు స్పెషలిస్టు నేశనల్ రిక్రూట్ మెంట్ ఏజెన్సీ (ఎన్ఆర్ ఎ)ను ప్రతిపాదించడమైంది.
o ప్రతి జిల్లా లో మరీ ముఖ్యంగా ఆకాంక్షభరిత జిల్లాల లో ఒక పరీక్షా కేంద్రం.
· వివిధ ట్రైబ్యూనల్స్ మరియు స్పెశలైజ్డ్ బాడీస్ లో ప్రత్యక్ష భర్తీ సహా, నియామకానికి గాను వృత్తి నిపుణులను, అత్యంత ప్రతిభావంతుల ను ఆకర్షించాలనే ఉద్దేశ్యంతో ఒక సుదృఢమైన యంత్రాంగాన్ని రూపొందించాలని ప్రతిపాదించడమైంది.
· కాంట్రాక్టు చట్టాన్ని పటిష్టం చేయడం జరుగుతుంది.
· క్రొత్తగా నేశనల్ పాలిసీ ఆన్ అఫిశియల్ స్టాటీస్టిక్స్ ను ఏర్పాటు చేయడం జరుగుతుంది:
· దీని ధ్యేయం ఏమిటంటే ఆర్టిఫీశియల్ ఇంటెలిజెన్స్ సహా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల వినియోగాన్ని ప్రోత్సహించడం.
o ఆధునికీకరించిన సమాచార సేకరణ, సమీకృత సమాచార పోర్టల్ మరియు సమాచారాన్ని సకాలం లో పంపిణీ చేయడం.. ఈ దిశ గా ఒక మార్గసూచీని నిర్దేశించడం కూడా దీని ధ్యేయాల లో భాగం గా ఉంటుంది.
- 2022వ సంవత్సరం లో భారత్ లో నిర్వహింపబడే జి20 అధ్యక్షత సన్నాహకాల ను మొదలుపెట్టడం కోసం 100 కోట్ల రూపాయల మొత్తాన్ని కేటాయించడమైంది.
· ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి:
o ప్రభుత్వం యొక్క ఆన్ లైన్ పోర్టల్ ను వినియోగించుకొంటూ, నిధుల అందజేతను మెరుగు పరచడం జరిగింది.
o ద్వైపాక్షిక మరియు బహుళ పార్శ్విక ఆర్థిక సహాయ సంస్థల తోడ్పాటును తీసుకొనేందుకు మరిన్ని అవకాశాల కల్పన.
· కేంద్ర పాలిత ప్రాంతాలు అయినటువంటి జమ్ము- కశ్మీర్ మరియు లద్దాఖ్ ల అభివృద్ధి:
o దీని కోసం 2020-21 ఆర్థిక సంవత్సరానికి 30,757 కోట్ల రూపాయల నిధిని అందించడమైంది.
o కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్ కు 5,958 కోట్ల రూపాయల నిధులను ఇవ్వడమైంది.
ఆర్థిక రంగం
· ప్రభుత్వ రంగ బ్యాంకు ల లో సంస్కరణలు
· పది బ్యాంకుల ను నాలుగు బ్యాంకులు గా ఏకీకరించడమైనది.
· 3,50,000 కోట్ల రూపాయల మూలధనాన్ని అందించడమైంది.
· ప్రభుత్వ రంగ బ్యాంకుల లో పారదర్శకత్వాన్ని మరియు ఇతోధిక వృత్తి నైపుణ్యాన్ని తీసుకు రావడం కోసం పాలనపరమైన సంస్కరణలు అమలుచేయవలసి ఉంది.
· అదనపు మూలధనం సమీకరించడం కోసం కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను మూలధన విపణి ని ఆశ్రయించవలసిందిగా ప్రోత్సహించడం జరుగుతుంది.
· ప్రతి ఒక్క డిపాజిటర్ కు డిపాజిట్ బీమా రక్షణ మొత్తాన్ని ఇప్పుడు ఉన్న ఒక లక్ష రూపాయల నుండి 5 లక్షల రూపాయలకు పెంచడానికి డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేశన్ (డిఐసిజిసి)కి అనుమతి ని ఇవ్వడమైంది.
· డిపాజిటర్ల డబ్బు సురక్షతంగా ఉంచడం కోసం ఒక సుదృఢ యంత్రాంగం ద్వారా షెడ్యూల్డు వాణిజ్య బ్యాంకుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం.
· బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ను సవరించడం ద్వారా సహకార బ్యాంకులను బలోపేతం చేయడం జరుగుతుంది:
o వృత్తి నైపుణ్యాన్ని పెంచడం.
o మరింత మూలధన లభ్యత.
o పరిపాలన మెరుగుదల మరియు భారతీయ రిజర్వు బ్యాంకు మాధ్యమం ద్వారా పటిష్ట బ్యాంకింగ్ కై ఆదేశాలు.
· రుణాల వసూళ్ళ కోసం ఎన్ బిఎఫ్ సి ల అర్హత పరిమితి ని..
· 500 కోట్ల రూపాయల అసెట్ సైజు నుండి 100 కోట్ల రూపాయల కు తగ్గించడమైంది.
o అలాగే, ఒక కోటి రూపాయల లోన్ సైజ్ నుండి 50 లక్షల రూపాయల లోన్ సైజు కు.. తగ్గించడమైంది.
· బ్యాంకింగ్ వ్యవస్థ లో ప్రైవేటు మూలధనం:
o ప్రభుత్వం ఐడిబిఐ బ్యాకులో తనకు మిగిలి ఉన్నటువంటి వాటాను స్టాక్ ఎక్చేంజి ద్వారా ప్రైవేట్, రిటైల్ మరియు సంస్థాగత ఇన్వెస్టర్లకు విక్రయించనుంది.
· ఉద్యోగాల లో సులభతరమైన పరివర్తనీయత:
o యూనివర్సల్ పెన్షన్ కవరేజి కోసం స్వతహాగా పేరును నమోదు చేసుకోవచ్చును.
o పోగు పడిన నిధుల రాశి ని కాపాడటం కోసం ఇంటర్ ఆపరబిలిటీ మెకానిజమ్.
· పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్ మెంట్ ఆథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్ ను సవరించడం జరుగుతుంది.
o ఇలా ఎందుకంటే.. పిఎఫ్ ఆర్ డిఎఐ యొక్క నియంత్రణ సంబంధ భూమికను బలోపేతం చేయడం కోసం;
o ప్రభుత్వ ఉద్యోగుల కోసం పిఎఫ్ ఆర్ డిఎఐ నుండి ఎన్ పిఎస్ ట్రస్టు ను విడదీసేందుకు మార్గాన్ని సుగమం చేయడం మరియు
o ప్రభుత్వ ఉద్యోగులు కాని వారి కోసం ఒక పెన్షన్ ట్రస్ట్ ను నెలకొల్పేందుకు బాట వేయడం.
· ఫ్యాక్టర్ రెగ్యులేశన్ యాక్ట్, 2011 లో సవరణ చేయడం జరుగుతుంది:
o టిఆర్ ఇడిఎస్ మాధ్యమం ద్వారా ఎంఎస్ఎంఇ లకు ఆర్థిక సహాయాన్ని పెంచడంలో ఎన్ బిఎఫ్ సి లు అవసరమైన సామర్ధ్యాన్ని పొందేలా చూడటం దీని ధ్యేయం.
· ఎంఎస్ఎంఇ ల నవ పారిశ్రామికులకు బ్యాంకులు సబార్డినేట్ డెట్ ను సమకూర్చేందుకు ఒక నూతన పథకం.
o దీనిని ఈక్విటీ తో సమంగా పరిగణించడం జరుగుతుంది.
o దీనికి క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ ఫర్ మీడియమ్ ఎండ్ స్మాల్ ఆంత్రప్రిన్యోర్స్ (సిజిటిఎంఎస్ ఇ) ద్వారా పూర్తి హామీ లభిస్తుంది.
o సిజిటిఎంఎస్ ఇ యొక్క మూల నిధి ని ప్రభుత్వం తదనుగుణంగా పెంచుతుంది.
· భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్ బిఐ) ద్వారా ఎంఎస్ఎంఇ ల రుణ పునర్ వ్యవస్థీకరణ కు ఉద్దేశించిన విండో ను ఒక సంవత్సర కాలం పాటు, అంటే 2021 మార్చి నెల 31 వ తేదీ వరకు పొడిగించనున్నారు.
-
- అయిదు లక్షల కు పైగా ఎంఎస్ ఎంఇ లు ఇప్పటికే లబ్ధి ని పొదాయి.
· ఎంఎస్ ఎంఇ ల కోసం ఒక యాప్ ఆధారితమైన ఇన్వాయిస్ ఫైనాన్సింగ్ లోన్ ప్రోడక్ట్ ను త్వరలో ప్రారంభించడం జరుగుతుంది.
o చెల్లింపుల లో జాప్యం మరియు తత్పర్యవసానం గా నగదు నిల్వల లో తేడా సమస్య ను నివారించాలనేదే దీనిలోని ఈ చర్య లోని ఉద్దేశ్యం.
· ఎంఎస్ ఎంఇ ల ఎగుమతులను ప్రోత్సహించడం:
o ఫార్మాస్యూటికల్స్, వాహన విడి భాగాలు మరియు ఇతరత్రా వంటి ఎంపిక చేసిన కొన్ని రంగాలకు;
o ఎక్సిమ్ బ్యాంకు (EXIM Bank) మరియు ఎస్ ఐడిబిఐ (SIDBI) ల ద్వారా 1,000 కోట్ల రూపాయల పథకాన్ని రూపొందించడమైంది.
o సాంకేతిక విజ్ఞానం మెరుగుదల, పరిశోధన మరియు అభివృద్ధి, వ్యాపార వ్యూహం తదితరాల కు మద్ధతుగా ఈ చర్యను చేపట్టడం జరుగుతుంది.
విత్త మార్కెట్
· బాండ్ మార్కెట్ వృద్ధి
- కొన్ని రకాలకు చెందిన ప్రభుత్వ సెక్యూరిటీలను ప్రవాసుల కోసం కూడా పూర్తిగా తెరవడం జరుగుతుంది
- విదేశీ పోర్టుఫోలియో పెట్టుబడుల పరిమితిని తమ మొత్తం స్టాకులో ఇప్పుడున్న 9% నుంచి 15%కి పెంచడం జరుగుతుంది.
· అన్ని ఆర్ధిక కాంట్రాక్టులను ఒకేచోట చేర్చే యంత్రాంగం ఏర్పాటునకు ఒక కొత్త చట్టాన్ని రూపొందించడం జరుగుతుంది.
- రుణాల చెల్లింపులో ఉపేక్షను అరికట్టడం
· ప్రాధమికంగా ప్రభుత్వ సెక్యూరిటీలతో కూడిన కొత్త డెట్ – ఇ టి ఎఫ్ ద్వారా ఋణ ఆధార ఎక్చేంజీ ట్రేడెడ్ ఫండ్ ను విస్తరించడమైంది.
- రిటైల్ మదుపరులు, పింఛను ఫండ్స్ మరియు దీర్ఘకాలిక మదుపరులను ఆకట్టుకోవడం కోసం ఈ చర్య ను చేపట్టడం జరిగింది.
· బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల(ఎన్ బి ఎఫ్ సి) ద్రవ్య సమస్యలను పరిష్కరించేందుకు 2019-20 కేంద్ర బడ్జెట్ అనంతర కాలం లో పాక్షిక క్రెడిట్ గ్యారంటీ స్కీము ను రూపొందించడం జరిగింది.
- ఇప్పుడు ఆ స్కీము కొనసాగింపునకు కొత్త యంత్రాంగం ఏర్పాటు చేయడం జరుగుతుంది.
- ఆ విధంగా జారీచేసే సెక్యూరిటీలకు ప్రభుత్వ మద్దతు ఉంటుంది.
మౌలికసదుపాయాలకు ఆర్ధికసహాయం
· రూ. 103 లక్షల కోట్ల విలువైన జాతీయ మౌలికసదుపాయాల ప్రాజెక్టులను ఇదివరకే ప్రకటించడం జరిగింది.
· ఐ ఐ ఎఫ్ సి ఎల్ మరియు ఎన్ ఐ ఐ ఎఫ్ కు చెందిన ఒక అనుబంధ సంస్థ వంటి మౌలిక సదుపాయాల ఫైనాన్స్ కంపెనీలకు ఈక్విటీగా రూ. 22,000 కోట్లు ఇవ్వడం జరుగుతుంది.
· ఐ ఐ ఎఫ్ సి, జి ఐ ఎఫ్ టి సిటీ: ఈ నగరానికి అంతర్జాతీయ ఆర్ధిక కేంద్రంగా మరియు హై ఎండ్ డాటా ప్రాసెసింగ్ కేంద్రంగా ఆవిర్భవించగల సామర్ధ్యం ఉంటుంది.
· నియంత్రణాధికారి ఆమోదం పొందిన తరువాత ప్రపంచ మార్కెట్ ప్రతినిధులకు అదనపు అవకాశం కల్పించేందుకు అంతర్జాతీయ బులియన్ ఎక్స్ఛేంజీని ఏర్పాటు చేయడం జరుగుతుంది.
పెట్టుబడుల ఉపసంహరణ
· ఐ పి ఓ జారీ ద్వారా జీవిత బీమా సంస్థ (ఎల్ ఐ సి)లో ఉన్న తమ వాటాలో కొంత విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఆర్ధిక నిర్వహణ
· 15వ ఫైనాన్స్ కమిషన్ (ఎఫ్ సి)
· 15వ ఫైనాన్స్ కమిషన్ 2020-21 ఆర్ధిక సంవత్సరానికి తన మొదటి నివేదికను సమర్పించింది
· ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులను చాలావరకు ఆమోదించడం జరిగింది
- 2022-22తో ప్రారంభమయ్యే ఐదేళ్ల కాలానికి తన తుది నివేదికను ఫైనాన్స్ కమిషన్ ఈ ఏడాది ద్వితీయార్ధంలో సమర్పిస్తుంది.
జి ఎస్ టి పరిహార నిధి
· 2016-17 మరియు 2017-18 సంవత్సరాల వసూళ్ల బకాయిలను రెండు వాయిదాలలో నిధికి బదిలీ చేస్తారు.
- ఇకముందు నిధికి జరిపే బదిలీలను కేవలం జి ఎస్ టి పరిహారం సెస్ రూపంలో జరిపిన వసూళ్లకు మాత్రమే పరిమితం చేస్తారు.
కేంద్ర ప్రాయోజిత స్కీములు మరియు కేంద్ర రంగంలోని స్కీముల మరమ్మతు అవసరం:
· కొత్తగా బయల్పడే సామాజిక, ఆర్ధిక అవసరాలకు సరితూగే విధంగా కేంద్ర స్కీముల నిర్వహణ జరగాలి
· మితంగా ఉన్న ప్రభుత్వ నిధులను పూర్తిగా గరిష్ఠ ప్రయోజనం పొందేలా ఖర్చు చేయడం నిశ్చయంగా జరగాలి.
· అంచనా వేసిన ఆర్ధిక సంఖ్యల పారదర్శకత మరియు విశ్వసనీయతపై ఇటీవల జరిగిన చర్చ దృష్ట్యా ఇందుకు సంబంధించి అనుసరైంచిన పద్దతి ఎఫ్ ఆర్ బి ఎం చట్టానికి అనుగుణంగా ఉంది.
· ఆర్ధిక సంవత్సరం 2019-20కి సంబంధించి:
- సవరించిన వ్యయం అంచనాలు : రూ. 26.99 లక్షల కోట్లు
- సవరించిన వసూళ్ల అంచనాలు : రూ. 19.32 లక్షల కోట్లు
· 2020-21 సంవత్సరానికి సంబంధించి:
- జి డి పి నామమాత్ర వృద్ధి 10% మేర ఉండవచ్చని అంచనా
- వసూళ్లు : రూ. 22.46 లక్షల కోట్ల మేర ఉండవచ్చని అంచనా
- వ్యయం : రూ. 30.42 లక్షల కోట్ల మేర ఉండవచ్చని అంచనా
· పెట్టుబడులను పెంచేందుకు పన్నుల విధానానికి అవసరమైన సంస్కరణలను ఇటీవలే చేపట్టడమైంది. అయితే పన్నుల వసూళ్లు పుంజుకోవడానికి మరికొంత సమయం పట్టవచ్చు.
· 2019-20 సంవత్సరానికి సవరించిన అంచనాల ప్రకారం కోశ సంబంధిత లోటు (ఫిస్కల్ డెఫిసిట్) 3.8% మరియు 2020-21 బడ్జెట్ అంచనాల లో 3.5% గా పేర్కొనడమైంది. దానిలో రెండు అంశాలు ఉన్నాయి.
- 2019-20 సంవత్సరానికి 3.3 శాతం మరియు 2020-21 బడ్జెట్ అంచనాలలో 3 శాతం.
- 0.5% వ్యత్యాసం ఎఫ్ ఆర్ బి ఎం చట్టంలోని 4(3) సెక్షనుకు అనుగుణంగా ఉంది.
- మధ్యకాలీన ఆర్ధిక విధానం మరియు వ్యూహరచన ప్రకటనలో ప్రభుత్వ నిధులను పెట్టుబడులకు వినియోగించడంలో రాజీపడకుండా ఆర్ధిక స్థిరీకరణకు కట్టుబడి ఉండటం.
- మార్కెట్ రుణాల సేకరణ: మార్కెట్ నుంచి సేకరించిన నికర రుణాలు: 2019-20 సంవత్సరానికి రూ. 4.99 లక్షల కోట్లు మరియు 2020-21 సంవత్సరానికి రూ. 5.36 లక్షల కోట్లు.
· 2020-21 ఆర్ధిక సంవత్సరంలో మార్కెట్ నుంచి సేకరించిన రుణాలలో అధిక భాగం 21 శాతానికి మించిన మూలధన వ్యయానికై ఖర్చు చేయడం జరుగుతుంది.
--
కేంద్ర బడ్జెట్ 2020-21 --- గ్రాఫ్
కేంద్ర ప్రభుత్వ వ్యయం
2020-21 బడ్జెట్ అంచనాలు ( రూ. కోట్లలో)
ఖాతా
పింఛను
రక్షణ
ప్రధాన సబ్సిడీలు
వ్యవసాయం మరియు దాని అనుబంధ పనులు
వాణిజ్యం & పరిశ్రమలు
ఈశాన్య ప్రాంత అభివృద్ది
విద్య
ఇంధనం
విదేశీ వ్యవహారాలు
ఆర్ధిక
ఆరోగ్యం
దేశీయ వ్యవహారాలు
వడ్డీ
ఐ టి మరియు టెలికాం
ప్రణాళిక మరియు గణాంకాలు
గ్రామీణాభివృద్ధి
శాస్త్రవిజ్ఞాన శాఖలు
సాంఘిక సంక్షేమం
పన్నుల పరిపాలన
రాష్ట్రాలకు బదిలీ
రవాణా
కేంద్రపాలిత ప్రాంతాలు
పట్టణాభివృద్ధి
ఇతరాలు
మొత్తం 30,42,230
===
ప్రత్యక్ష పన్నులు
ప్రత్యక్ష పన్నుల ప్రతిపాదనలు: వృద్ధికి దోహదంచేసేలా ప్రోత్సహించడం, పన్నుల వ్యవస్థను సరళం చేయడం, విధానాలు క్రమపద్ధతిలో అమలుజరిగేలా చూడటం మరియు వివాదాలను తగ్గించడం.
· వ్యక్తిగత ఆదాయపు పన్ను :
- మధ్యతరగతి పన్ను చెల్లింపుదార్లకు గణనీయమైన రీతి లో ఉపశమనం :
- సరళీకరించిన కొత్త వ్యక్తిగత ఆదాయపు పన్ను ప్రతిపాదిత రేట్లు:
- విధించదగ్గ ఆదాయం (రూ.) ప్రస్తుత పన్ను రేట్లు కొత్త పన్ను రేట్లు
0-2.5 లక్షలు మినహాయింపు మినహాయింపు
2.5 – 5.0 లక్షలు 5% 5%
5.0 – 7.5 లక్షలు 20% 10%
7.5 – 10 లక్షలు 20% 15%
10 – 12.5 లక్షలు 30% 20%
12.5 – 15 లక్షలు 30% 25%
15 లక్షల కన్నా ఎక్కువ 30% 30%
- ఇప్పుడున్న మినహాయింపులలో దాదాపు 70 మినహాయింపులను మరియు తగ్గింపులను (100కు పైగా) కొత్త సరళీకృత పన్నుల విధానంలో భాగం గా తొలగించడం జరుగుతుంది.
- మిగిలిన మినహాయింపులు మరియు తగ్గింపులను రానున్న సంవత్సరాలలో సమీక్షించడం మరియు హేతుబద్ధం చేయడం జరుగుతుంది.
- కొత్త పన్నుల విధానం ఐచ్ఛిక పద్ధతి న ఉంటుంది. ఒక వ్యక్తి పాత వ్యవస్థ ప్రకారమే పన్ను చెల్లింపు ను కొనసాగించి తగ్గింపులను మరియు మినహాయింపుల ను పొందవచ్చు.
- ముందుగానే నింపిన ఆదాయపు పన్ను రిటర్న్ విధానం అమలు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగింది. ఎవరైనా పన్ను చెల్లింపుదారు కొత్త పద్దతిని ఎంపిక చేసుకుంటే ముందుగా నింపి ఉంచిన ఆదాయపు పన్ను రిటర్న్ స్ ను ఉపయోగించుకోవచ్చు.
- ఆదాయపు పన్ను చెల్లించడానికి పన్ను నిపుణుల సహాయం తీసుకోవలసిన అవసరం ఉండదు.
- కొత్త పన్నుల వ్యవస్థను అమలు చేయడం వల్ల ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం లో రూ. 40,000 కోట్ల వంతు న రాబడి తగ్గిపోగలదని అంచనా.
· కార్పొరేట్ పన్నులు:
- కొత్తగా ఏర్పాటు చేసే విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు 15% పన్నురేటు విధానాన్ని విస్తరించడం జరుగుతుంది
- భారతదేశం లోని ప్రస్తుత కార్పొరేట్ పన్ను రేట్లు ప్రపంచం లోనే అతి తక్కువ పన్ను రేట్లు.
· డివిడెండ్ పంపిణీ పన్ను (డి డి టి) :
- భారతదేశాన్ని పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యంగా మారుస్తూ డి డి టి ని ఎత్తివేయడం జరిగింది
- ఏదైనా హోల్డింగ్ కంపెనీ తన అనుబంధ సంస్థ నుంచి డివిడెండ్ పొందినప్పుడు ఆ మేరకు మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది.
- ఈ రకమైన మినహాయింపుల వల్ల ప్రతి యేటా రూ. 25,000 కోట్ల మేర రాబడి తగ్గుతుంది.
· స్టార్టప్ లు :
- రూ. 100 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న స్టార్టప్ లకు పదేళ్ళలో వరుసగా ఉన్న మూడేళ్ళ పాటు నూటికి 100% పన్ను మినహాయింపు లభిస్తుంది.
- ఈ ఎస్ ఓ పి లపై పన్ను చెల్లింపు వాయిదా వేయడమైంది.
· తక్కువ నగదు ఆర్ధిక వ్యవస్థ ను ప్రోత్సహించనున్న ఎం ఎస్ ఎం ఇ లు:
- 5% కన్నా తక్కువ నగదు వ్యాపార లావాదేవీలు జరిపే ఎం ఎస్ ఎం ఈల పుస్తకాలను ఆడిట్ చేసేందుకు వార్షిక వ్యాపార టర్నోవర్ పరిమితిని రూ. 1 కోటి నుంచి రూ. 5 కోట్లకు పెంచడం జరిగింది.
· సహకార సంస్థలు:
- సహకార సంస్థలకు మరియు కార్పొరేట్ రంగాని కి మధ్య సమానత్వాన్ని తీసుకురావడం జరిగింది.
- సహకార సంస్థల కు ఎలాంటి మినహాయింపులు మరియు తగ్గింపులు లేకుండా 22% పన్ను + 10% సర్ ఛార్జీ + 4% సెస్ విధింపును ఎంచుకొనే ఐచ్ఛికం.
- కంపెనీలకు కనీస ప్రత్యామ్నాయ పన్ను (ఎం ఏ టి) నుంచి మినహాయింపు ఇచ్చినట్లే సహకార సంస్థలకు ప్రత్యామ్నాయ కనీస పన్ను (ఏ ఎం టి) నుంచి మినహాయింపు లభిస్తుంది.
· విదేశీ పెట్టుబడులకు పన్ను రాయితీ :
- విదేశీ ప్రభుత్వాల సార్వభౌమ సంపద నిధి నుంచి కనీసం మూడేళ్ళ పాటు తీయకుండా ఉంచే విధంగా మౌలిక సదుపాయాలు మరియు ప్రాధాన్యతా రంగాలలో పెట్టె పెట్టుబడులపై లభించే వడ్డీ, డివిడెండ్ మరియు మూలధన లాభాల సంబంధిత ఆదాయంపై 100% పన్ను మినహాయింపు ఉంటుంది.
· అందుబాటులో గృహాలు :
- గృహనిర్మాణం కోసం తీసుకునే రుణాలకు చెల్లించే వడ్డీపై రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ సౌకర్యాన్ని 2021 మార్చి 31 వరకు పొడిగించడం జరిగింది.
- గృహనిర్మాణ ప్రాజెక్టుకు అనుమతి పొందిన రియల్ ఎస్టేట్ డెవెలపర్లకు లభించిన లాభాలపై టాక్స్ హాలిడే లభించే తేదీని 2021 మార్చి 31 వరకు పొడిగించడం జరిగింది.
-
పన్ను చెల్లింపు సులభతరం చేసే చర్యలు
· ఆన్ లైను లో ఆధార్ ద్వారా అప్పటికప్పుడు తక్షణ పాన్ కేటాయింపు
· ‘’వివాద్ సే విశ్వాస్” స్కీము , ప్రత్యక్ష పన్నుల్లో వివాదాలను తగ్గించేందుకు చివరి తేదీ 2020 జూన్ 30.
- 2020 మార్చి 31 వరకు వివాదంలో పడిన పన్నులను మాత్రమే చెల్లించాలి
- ఈ సదుపాయాన్ని 2020 మార్చి 31 తరువాత వినియోగించుకున్నట్లయితే అదనపు సొమ్ము ను చెల్లించాలి.
- పన్నుచెల్లింపుదార్ల కేసుల్లో అప్పీలు ఏ స్థాయి లో ఉన్నా వారికి ప్రయోజనం కలుగుతుంది,
· ఆదాయపు పన్ను చట్టాన్ని సవరించడం ద్వారా పేరు చెప్పని అప్పీళ్లను కు అవకాశమివ్వడం జరుగుతుంది.
· దాతృత్వ సంస్థలకు:
- దాన స్వీకర్త తమకు అందిన విరాళాల సమాచారం ఆధారం గా ఆ సమాచారాన్ని రిటర్న్ లో ముందుగా నే నింపే సౌలభ్యం.
- నమోదు ప్రక్రియ పూర్తిగా ఎలెక్ట్రానిక్ పద్ధతి లో జరపాలి.
- కొత్త మరియు పాత దాతృత్వ సంస్థలకు యు ఆర్ ఎన్ సంఖ్య ను జారీ చేయాలి.
- కొత్త దాతృత్వ సంస్థలకు మూడేళ్ళ పాటు తాత్కాలిక నమోదుకు అనుమతిస్తారు
- కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సి బి డి టి) పన్ను చెల్లింపుదార్ల నియమావళిని ఆమోదిస్తుంది.
· విలీనమైన బ్యాంకుల నష్టాలు:
- విలీనమవుతున్న సంస్థలు నష్టాల గ్రహింపు, తరుగుదల వల్ల విలీనం చేసుకునే సంస్థ ప్రయోజనం పొందేలా ఆదాయపు పన్ను చట్టానికి సవరణల ప్రతిపాదన.
పరోక్ష పన్నులు:
· జిఎస్టీ : వినియోగదారులు సరుకుల కొనుగోలు పట్టీ తీసుకోవడాన్ని ప్రోత్సహించడానికి నగదు బహుమతి పద్ధతి ని ప్రవేశపెట్టే యోచన.
· 2020 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా నిల్ రిటర్న్ దాఖలుకు ఎస్ ఎం ఎస్ పద్ధతి.
- వినియోగదారుల ఇన్వాయిస్ లలో డైనమిక్ క్యూ ఆర్ కోడ్ పద్ధతికి ప్రతిపాదన.
· దశలవారీగా ఎలెక్ట్రానిక్ ఇన్వాయిస్ పద్దతి కేంద్ర వ్యవస్థతో అనుసంధానం
· ఆధార్ ఆధారంగా పన్ను చెల్లింపుదార్ల తనిఖీ
· జిఎస్టీ రేట్లలో మార్పులకు యోచన
కస్టమ్స్ సుంకాలు:
· పాదరక్షలపై సుంకం 25% నుంచి 35%కి పెంపు . ఫర్నీచర్ వస్తువులపై 20% నుంచి 25%కి పెంపు.
· న్యూస్ ప్రింట్ , తక్కువ బరువుగల కోటెడ్ పేపర్ పై మౌలిక కస్టమ్స్ సుంకం 10% నుంచి 5%కి తగ్గింపు.
· ఎలెక్ట్రానిక్ వాహనాలు మరియు మొబైల్ ఫోన్ల విడిభాగాలపై కస్టమ్స్ సుంకం రేట్ల సవరింపు
· బి సి డి మినహాయింపు పొందినవి కాకుండా ఇతర వైద్య సాధనాల దిగుమతిపై 5% ఆరోగ్య సెస్ విధింపు
· ఫ్యూజ్ , రసాయనాలు మరియు ప్లాస్టిక్స్ వంటి వాటి సాధకాలు, ముడిపదార్ధాలపై తక్కువ కస్టమ్స్ సుంకం
· ఆటో విడిభాగాలు, రసాయనాలు మొదలైన దేశీయంగా తయారయ్యే కొన్ని వస్తువులపై ఎక్కువ సుంకం
వాణిజ్య విధానం చర్యలు
- ఎఫ్ టి ఎల ప్రకారం దిగుమతుల సక్రమ తనిఖీకి వీలుగా కస్టమ్స్ చట్టానికి సవరణ
- కొన్ని సున్నితమైన వస్తువుల విషయంలో వాటి ప్రాప్తి స్థానానికి సంబంధించిన అంశాలను సమీక్షించడం జరుగుతుంది
- దిగుమతుల నియంత్రణకు సంబంధించిన నియమాలను పటిష్టం చేయడం
- సబ్సిడీ వస్తువుల దిగుమతి మరియు తక్కువ ధరకు కుమ్మరించిన వస్తువుల తనిఖీకి నియమాలు
- కస్టమ్స్ సుంకాల మినహాయింపునకు సంబంధించిన సమీక్షకు ముందు జనం నుంచి సూచనలకు ఆహ్వానం
· సిగరెట్లు మరియు ఇతర పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం పెంపునకు ప్రతిపాదన, బీడీల సుంకం రేట్లలో మార్పులేదు.
· జౌళి రంగానికి ప్రయోజనం చేకూర్చేలా పి టి ఏ పై యాంటీ డంపింగ్ డ్యూటీ రద్దు
భారత ఆర్ధిక వ్యవస్థ దాటిన మైలురాళ్ళు మరియు సాధించిన లక్ష్యాలు
· భాతదేశం ఇప్పుడు ప్రపంచంలో అయిదవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థ.
· 2014-19 మధ్య కాలంలో ద్రవ్యోల్బణం 4.5% నమోదు కాగా సగటున 7.4% వృద్ధి నమోదు అయింది
· 2006-16 మధ్య కాలంలో 271 మిలియన్ల మందిని పేదరికం నుంచి బయటికి తేవడం జరిగింది
· 2009-14 మధ్య కాలంలో భారతదేశంలోకి 190 బిలియన్ అమెరికా డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రాగా 2014-19 మాధ్య కాలంలో 284 బిలియన్ అమెరికా డాలర్లకు పెరిగాయి.
· కేంద్ర ప్రభుత్వ రుణాల మొత్తం జి డి పి లో 52.2% (మార్చి 2014) నుంచి జి డి పి లో 48.7 శాతానికి(మార్చి 2019) తగ్గింది.
· ఈ కింద పేర్కొన్న రెండు పరిణామాలు జరిగాయి:
- సాంకేతిక వ్యాప్తి జరిగింది. (అనలిటిక్స్, మెషిన్ లర్నింగ్, రోబోటిక్స్, బయో ఇన్ఫర్మాటిక్స్ మరియు ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్)
- మున్నేన్నడూ లేని విధంగా భారతదేశంలో ఉత్పాదక వయస్సులో (15-65 మధ్య) ఉన్న వారి సంఖ్య పెరిగింది.
· జి ఎస్ టి అమలు వ్యవస్థలో ఉన్న అనేక అవరోధాలను తొలిగించగలిగింది.
డిజిటల్ విప్లవం అండతో ప్రపంచ నాయకత్వం సాధించడం భారత లక్ష్యం
· డిజిటల్ పాలన వల్ల సాఫీగా సేవలు
· జాతీయ మౌలికసదుపాయాల ప్రాజెక్టుల వల్ల దైనందిన జీవనంలో నాణ్యత
· ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని నిలవడం ద్వారా కడగండ్ల నుంచి ఉపశమనం
· పింఛను , బీమా వ్యాప్తి ల ద్వారా సామాజిక భద్రత .
**
(Release ID: 1601610)
Visitor Counter : 2110