ఆర్థిక మంత్రిత్వ శాఖ
2019-20 ఆర్థిక సర్వే విస్తృతాంశం సంపద సృష్టి, అందుకు వీలు కల్పించే విధానాల ఎంపిక.
వ్యాపారానికి సంబంధించి 2020 నివేదిక , బాగా మెరుగుపడిన పది ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఇండియాను గుర్తించింది.
సరళీకృతం కాని రంగాల కంటే సరళీకృత రంగాలు చెప్పుకోదగిన స్థాయిలో వృద్ధిసాధించినట్టు సర్వే స్పష్టం చేస్తోంది.
Posted On:
31 JAN 2020 1:25PM by PIB Hyderabad
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెట్టారు.భారతీయ ఆర్థిక వ్యవస్థ సరళీకరణ తరువాత ,సమకాలీన పరిస్థితులు మన సాంప్రదాయ ఆలోచనలలో ని ఆర్థిక నమూనాకే మద్దతు ఇస్తున్నాయని ఆర్థికసర్వే సూచిస్తున్నది. వాస్తవానికి, సరళీకృతం కాని రంగాల కంటే సరళీకృతమైన రంగాలు చాలా వేగంగా వృద్ధి చెందాయని ఆర్థిక సర్వే స్పష్టంగా తెలియజేస్తున్నది.
మార్కెట్లకు మద్దతు నివ్వడంతోపాటు మార్కెట్ల అదృశ్య హస్తాన్ని బలోపేతం చేయడం మార్కెట్లకు మద్దతు నిచ్చే విశ్వాసాన్ని కలిగించినప్పుడే 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలనే భారతదేశం ఆకాంక్ష ప్రధానంగా ఆధారపడి ఉంటుందని ఆర్థిక సర్వే పేర్కొంది.
గడచిన ఐదు సంవత్సరాలలో సంస్కరణల కారణంగా సులభతర వాణిజ్యం గణనీయంగా వృద్ధి చెందింది. ఇది ఆర్థిక స్వాతంత్ర్యానికి వీలు కల్పించింది. ప్రపంచ బ్యాంక్ వారి డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్‌లలో భారత దేశం ర్యాంకింగ్ గణనీయంగా మెరుగుపడింది. 2014 సంవత్సరంలొ 142 వ స్థానంలొ ఉన్న భారతదేశం, 2019 నాటికి తన ర్యాంకును మెరుగు పరుచుకుని 63వ స్థానానికి చేరింది. 2020 డూయింగ్ బిజినెస్ నివేదిక బాగా మెరుగుపడిన పది ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఒకటని గుర్తించింది. అయినప్పటికీ సులభతర వాణిజ్యానికి సంబంధించి మరిన్ని సంస్కరణలను ముందుకు తీసుకుపోవలసి ఉంది. దీనివల్ల భారతదేశం ఈ ర్యాంకుల జాబితాలో 50 ర్యాంకుల స్థాయికి చేరుకోవడానికి వీలుంటుంది.
ప్రైవేటీకరించిన సిపిఎస్ఇలకు సంబంధించి కీలక ఆర్థిక సూచికలైన నికర విలువ, నికర లాభం, ఆస్తులపై రాబడి వంటివి ఈ సంస్థల ప్రైవేటీకరణ తర్వాత గణనీయంగా పెరిగినట్టు ఆర్థిక సర్వే విశ్లేషణ తెలియజేస్తున్నది.
ఆర్థిక వ్యవస్థలో సంపద సృష్టి అంతిమంగా సామాన్య ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతుంది. ఇది వారు వస్తువులు కొనుగోలు చేయడానికి, సేవలు పొందడానికి వారి కొనుగోలు శక్తిని పెంచుతుంది. ఎవరికైనా పుష్టికరమైన ఆహారం అనేది ప్రధాన అంశం.ఇప్పుడు సామాన్యుడికి పుష్టికరమైన ఆహారం మరింత అందుబాటులోకి వచ్చినట్టు ఆర్థిక సర్వే తెలియజేసింది.
*****
(Release ID: 1601400)
Visitor Counter : 214