ప్రధాన మంత్రి కార్యాలయం

ఏక‌ల్ విద్యాల‌య సంఘ‌టన్ ను ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి

బాల‌ల వికాసం కోసం మ‌రియు విద్య వ్యాప్తి ని ప్రోత్స‌హించ‌డం కోసం నిరంత‌రాయం గా కృషి చేస్తున్నందుకుగాను సంస్థ ను ప్ర‌శంసించిన ప్ర‌ధాన మంత్రి

‘ఏక్ భార‌త్ - శ్రేష్ఠ భార‌త్‌’కు ఊతాన్ని ఇవ్వ‌డం కోసం ప్ర‌భుత్వ పాఠశాలల ను మ‌రియు ప్రైవేటు పాఠ‌శాల‌ లను జ‌తప‌ర‌చాల‌ని సూచించిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 06 DEC 2019 2:41PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ  గుజ‌రాత్ లోని ఏక‌ల్ విద్యాల‌య సంఘ‌టన్ ను ఉద్దేశించి ఈ రోజు న ఒక వీడియో సందేశం ద్వారా ప్ర‌సంగించారు. గ్రామీణ ప్రాంతాల కు చెందిన‌ బాలల తో పాటు  ఆదివాసీ బాలల్లో విద్యార్జ‌న ను ప్రోత్స‌హించ‌డమే ధ్యేయం గా కృషి చేస్తున్న ఏక‌ల్ స్కూల్ అభియాన్కు నాయకత్వం వహిస్తున్న ఏక‌ల్ విద్యాల‌య సంఘ‌టన్ ను ప్ర‌ధాన మంత్రి అభినందించారు. భార‌త‌దేశ వ్యాప్తం గా మారుమూల ప్రాంతాల లో, నేపాల్ లో నివ‌సిస్తున్న 2.8 మిలియ‌న్ కు పైగా పిల్లలు, ఆదివాసీ బాలల కు చదువు ను నేర్పడం ద్వారాను మరియు వారి లో చైత‌న్యాన్ని రగిలించ‌డం ద్వారాను దేశ నిర్మాణం లో సంఘ‌ట‌న్ స్వ‌చ్ఛంద సేవ‌కులు వారి వంతు పాత్ర ను పోషిస్తున్న తీరు ను ఆయ‌న మెచ్చుకొన్నారు.

 

భార‌త‌దేశం అంతటా సంఘ‌ట‌న్ ఒక ల‌క్ష పాఠ‌శాల‌ ల సంఖ్య ను చేరుకొన్న సంద‌ర్భం లో ఆ సంస్థ కు ప్ర‌ధాన మంత్రి అభినందన లు తెలిపారు. ఉద్వేగం తో, స‌మ‌ర్ప‌ణ భావం తో మ‌రియు నిబద్ధ‌త తో కృషి చేస్తున్నపుడు అసాధ్యమైనటువంటి ల‌క్ష్యం సైతం సాధించదగ్గ లక్ష్యం గా మారిపోతుంది అని ప్ర‌ధాన మంత్రి అన్నారు. యావ‌త్తు దేశాని కి ఆద‌ర్శ‌ప్రాయమైనటువంటి న‌మూనా గా మారి ప్రేర‌ణ ను ఇస్తున్నందుకు మ‌రియు సామాజిక సేవ కు క‌ట్టుబ‌డి ఉన్నందుకుగాను ఈ సంఘటన్ ను గాంధీ శాంతి బ‌హుమ‌తి తో స‌మ్మానించారన్న వాస్త‌వాన్ని ఆయ‌న తన ప్రసంగం లో ప్ర‌ముఖం గా ప్ర‌స్తావించారు.

 

కేంద్ర ప్ర‌భుత్వం సైతం భార‌త‌దేశం లో మెరుగైన‌టువంటి విద్య ను బోధించడం మ‌రియు నైపుణ్యాల ను అభివృద్ధిపరచడం కోసం ఉత్సాహం గా కృషి చేస్తోంద‌ంటూ ప్ర‌ధాన మంత్రి గుర్తు కు తెచ్చారు. షెడ్యూల్డు తెగ‌ల బాల‌ల కు ఉప‌కార వేత‌నం, ఏక‌ల‌వ్య న‌మూనా ఆశ్ర‌మ పాఠ‌శాల‌ లు, పోష‌ణ్ అభియాన్‌, మిశన్ ఇంద్రధ‌నుష్ వంటి ప‌థ‌కాల తో పాటు ఆదివాసీ పండుగ‌ ల వేళ‌ల్లో బ‌డుల కు సెల‌వు లు ప్రకటించడం వంటి చర్య లు పిల్లలు బ‌డి కి వెళ్లడం మానివేసే ధోర‌ణుల ను అరిక‌ట్ట‌డం లో సహాయకారిగా నిలవడం ఒక్క‌టే కాకుండా బాల‌ల సంపూర్ణ వికాసాని కి కూడాను తోడ్ప‌డుతున్నాయి అని ఆయ‌న వివ‌రించారు.

 

2022వ సంవ‌త్స‌రం లో స్వాతంత్య్రాని కి  75 సంవ‌త్సరాలు కావ‌డాన్ని వేడుక‌ గా జ‌రుపుకోవ‌డం కోసం ప్ర‌త్యేక హాస్య ప్రదర్శనలు, సంగీత పోటీ లు, అలాగే భార‌త స్వాతంత్య్ర ఉద్య‌మం లో ఆదివాసీ లు పోషించిన పాత్ర ను ప్ర‌ముఖం గా ప్ర‌స్తావించేట‌టువంటి చ‌ర్చ‌ల ను మరియు వాదనల ను నిర్వహించవలసింది గా సంఘటన త‌న పాఠశాల విద్యార్థుల ను ప్రోత్సహించాల‌ని ప్ర‌ధాన మంత్రి సూచించారు. ఈ పోటీల ను ఈ సంవ‌త్స‌రం లోనే మొదలుపెట్టవచ్చని, 2022లో జాతీయ స్థాయి పోటీ తో వీటిని ముగించవచ్చని పేర్కొన్నారు. సాంప్ర‌దాయికమైన‌టువంటి భార‌తీయ క్రీడ‌ల తో ఒక ఖేల్-మ‌హా కుంభ్ ను సైతం ఏక‌ల్ ప‌రివారం నిర్వ‌హించ‌వ‌చ్చ‌న్న అభిప్రాయాన్ని ఆయ‌న వ్యక్తం చేశారు.

 

ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ లను మ‌రియు ప్రైవేటు పాఠ‌శాల‌ ల‌ను జ‌త పరచాలని, గ్రామీణ ప్రాంత నేప‌థ్యం క‌లిగిన విద్యార్థులు వారి యొక్క ప‌ట్ట‌ణ ప్రాంత స‌హ‌చ‌రుల నుండి నేర్చుకోవడాన్ని, అలాగే పట్టణ ప్రాంత విద్యార్థులు కూడా గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల నుండి నేర్చుకోవడాన్ని ప్రోత్స‌హించేది గా ఈ సమన్వయం ఉండాల‌ని ప్ర‌ధాన మంత్రి ప్ర‌తిపాదించారు. త‌ద్వారా, ‘ఏక్ భార‌త్- శ్రేష్ఠ భార‌త్ఆలోచ‌న కు జోరు అందగ‌ల‌ద‌ని చెప్పారు. ఏక‌ల్ సంస్థాన్ ఇ- ఎడ్యుకేశన్ ను మ‌రియు డిజిటైజేశన్ వినియోగానికి నడుం కట్టడాన్ని కూడా ప్ర‌ధాన మంత్రి శ్లాఘించారు. ఈ సంస్థ తాలూకు అన్ని ఏక‌ల్ విద్యాల‌యాల లోనూ పురోగతి ని ఒక స‌మ‌గ్ర‌మైనటువంటి ప‌ద్ధ‌తి లో ప‌ర్య‌వేక్షించ‌డం కోసం ఒక వాస్త‌వ కాల సూచ‌క డాష్ బోర్డు తో కూడాను ముందంజ వేయవచ్చని ఆయ‌న పేర్కొన్నారు.

 

ఈ రోజు న డాక్ట‌ర్ బాబాసాహెబ్ ఆంబేడ్ కర్ యొక్క పుణ్య తిథి కూడా అనే సంగతి ని ప్ర‌ధాన మంత్రి శ్రోత‌ల‌ కు గుర్తు చేశారు. బాబాసాహెబ్ కలగన్న బాల బాలిక‌ల‌ కు స‌మాన‌ం గా విద్య బోధ‌న అనే క‌ల ను నెర‌వేర్చ‌డం లో ఏక‌ల్ సంఘ‌ట‌న్ స‌ఫ‌లం అయింద‌ని ప్ర‌ధాన మంత్రి ప్ర‌ముఖం గా చాటి చెప్పారు. సంఘ‌ట‌న్ ఇంత‌వ‌ర‌కు నాలుగు ద‌శాబ్దాల తన సుదీర్ఘమైనటువంటి ప్ర‌స్థానం లో పంచ‌తంత్ర త‌ర‌హా విద్య బోధ‌న ను అవ‌లంబించి తద్వారా వినూత్నమైన ఆలోచ‌న సరళి ని ప్రోత్స‌హించింది అని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఈ సందర్భం లో పోష‌ణ్ వాటిక ల ద్వారా పోష‌క విలువ‌ ల ప్ర‌చారం, సేద్యం లో బ‌యో-ఫ‌ర్టిలైజ‌ర్ ల వినియోగం కోసం శిక్ష‌ణ ను ఇవ్వ‌డం, ఓషధి మొక్కల లోని వైద్య లక్షణాల ను ఉపయోగించుకొనే మెల‌కువ‌ల ను బోధించ‌డం, ఉద్యోగాన్ని సంపాదించుకొనేటట్టు శిక్ష‌ణ ను ఇవ్వ‌డం మ‌రియు సామాజిక జాగృతి ని రేకెత్తించడం ను గురించి ఆయ‌న ప్రస్తావించారు. విద్య‌, పోలీసింగ్, ప‌రిశ్ర‌మ‌, ఇంకా సైన్యం ల వంటి విభిన్న రంగాల లో ఏకల్ విద్యాల‌య ఉత్తీర్ణులు దేశాని కి సేవ చేస్తూ ఉండ‌టం అనేది నిజాని కి ఎంతో సంతృప్తి కరం గా ఉంది అని కూడా ఆయ‌న అన్నారు.

 

భార‌త‌దేశం స్వాతంత్య్రం సిద్ధింపచేసుకొని 75 స‌ంవ‌త్స‌రాల ను పూర్తి చేసుకొంటోందని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు.  ఏక‌ల్ సంఘ‌ట‌న్ యొక్క స‌ఫ‌ల‌త గాంధీ గారి యొక్క ఆద‌ర్శం అయిన‌టువంటి గ్రామ స్వ‌రాజ్యం, బాబా సాహెబ్ ప్ర‌వ‌చించినటువంటి సామాజిక న్యాయం, దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ్ ఉద్భోదించిన‌టువంటి అంత్యోద‌య మ‌రియు స్వామి వివేకానందుల వారు క‌ల‌గ‌న్న ఒక భవ్య భార‌త‌దేశం ల వంటి వాటిని సాధించ‌డం లో స‌హాయ‌కారి కాగ‌ల‌ద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

 

ఏక‌ల్ విద్యాల‌య ను గురించి..

 

ఏక‌ల్ విద్యాల‌య భార‌త‌దేశం లో గ్రామీణ ప్రాంతాలు మ‌రియు ఆదివాసీ ప్రాంతాల తో పాటు నేపాల్ లో కూడా స‌మగ్రమైనటువంటి మ‌రియు సంపూర్ణమైనటువంటి అభివృద్ధి లో తలమునకలు అయిన ఒక ఉద్య‌మం గా సాగుతున్నది. ఈ ఉద్య‌మం లో భాగం గా చేప‌ట్టే ప్ర‌ధాన‌మైన కార్య‌క‌లాపం ఏదీ అంటే అది భార‌త‌దేశం లోని మారుమూల ప్రాంతాల లోను, ఆదివాసీ కుటుంబాలు నివసించే పల్లెల లోని ప్రతి ఒక్క బాలుని చెంతకు మరియు ప్రతి ఒక్క బాలిక చెంతకు విద్య ను తీసుకుపోవడం కోసం ఏక ఉపాధ్యాయ పాఠ‌శాల‌ల‌ ను నిర్వ‌హించ‌డ‌మే.

 

 

**



(Release ID: 1595368) Visitor Counter : 105