ప్రధాన మంత్రి కార్యాలయం

వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారామాల్దీవ్స్ లో అభివృద్ధి ప‌థ‌కాల ను సంయుక్తం గా ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి శ్రీమోదీ మ‌రియు మాల్దీవ్స్ అధ్య‌క్షుడు 

Posted On: 04 DEC 2019 5:34PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మ‌రియు మాల్దీవ్స్ అధ్యక్షుడు శ్రీ ఇబ్రాహిం మొహమద్ సోలిహ్ వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా మాల్దీవ్స్ లో ప‌లు కీల‌క అభివృద్ధి ప‌థ‌కాల ను ఈ రోజు న సంయుక్తం గా ప్రారంభించారు.  

ఈ ప‌థ‌కాల లో ‘మేడ్ ఇన్ ఇండియా’ కార్య‌క్ర‌మం లో భాగం గా కోస్తా తీర ర‌క్ష‌క నౌక ‘కామ్‌యాబ్‌’ను మాల్దీవ్స్ కు బ‌హుమ‌తి గా అందించండం, రూపే కార్డు ను ప్రారంభించ‌డం, మాలే లో ఎల్ఇడి లైట్ లను వెలిగించ‌డం, హై ఇంపాక్ట్ క‌మ్యూనిటీ డివెల‌ప్‌మెంట్ ప్రాజెక్టు లు, అలాగే  ఫిష్ ప్రాసెసింగ్ ప్లాంటుల‌ ను ప్రారంభించ‌డం వంటివి కలసి ఉన్నాయి. 

అధ్య‌క్షుడు శ్రీ సోలిహ్ ప‌ద‌వీకాలం లో ఒక‌టో సంవ‌త్స‌రాన్ని పూర్తి చేసుకొంటున్నందుకు ప్ర‌ధాన మంత్రి ఆయ‌న ను అభినందిస్తూ, భార‌త‌దేశం-మాల్దీవ్స్ సంబంధాల లో ఈ సంవ‌త్స‌రం కాలం ముఖ్య‌మైందిగా ఉన్నట్లు పేర్కొన్నారు.  భార‌త‌దేశం అనుస‌రిస్తున్న ‘నైబ‌ర్‌హుడ్ ఫస్ట్ పాలిసి’ మ‌రియు మాల్దీవ్స్ అవలంబిస్తున్నటువంటి ‘ఇండియా ఫ‌స్ట్ పాలిసి’ అన్ని రంగాల లో ద్వైపాక్షిక స‌హ‌కారాన్ని బలవత్తరం చేశాయ‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. 

ఫాస్ట్ ఇంట‌ర్ సెప్టర్ క్రాఫ్ట్ కోస్ట్ గార్డ్ శిప్ ‘కామ్‌యాబ్‌’ను గురించి ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, ఇది మాల్దీవ్స్ యొక్క స‌ముద్ర సంబంధిత భ‌ద్ర‌త ను పెంపొందింప చేసుకోవ‌డం లో, అలాగే నీలి ఆర్థికవ్య‌వ‌స్థ ను మ‌రియు ప‌ర్య‌ట‌న రంగాన్ని ప్రోత్స‌హించ‌డం లో సహాయకారి గా ఉంటుంద‌ని వివ‌రించారు.  దీవుల లో నివ‌సిస్తున్న స‌ముదాయం యొక్క జీవ‌నోపాధి కి అండ‌గా నిలచే హై ఇంపాక్ట్ క‌మ్యూనిటీ డివెల‌ప్‌మెంట్ ప్రాజెక్టు ల రూపం లో భాగ‌స్వామ్యం పంచుకోవ‌డం ప‌ట్ల కూడా ప్ర‌ధాన మంత్రి సంతోషాన్ని వ్య‌క్తం చేశారు.  ఉభ‌య దేశాల మధ్య స‌న్నిహిత సంబంధాలు నెల‌కొన‌డం లో ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలు ఒక కీల‌క‌మైన అంశంగా ఉంటుంది అని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.  ఈ సంద‌ర్భం గా ఆయ‌న మాల్దీవ్స్ లో భార‌త‌దేశ యాత్రికుల సంఖ్య‌లు రెట్టింపు క‌న్నా మిన్న‌ గా న‌మోదు అయ్యాయ‌ని, ఢిల్లీ, ముంబ‌యి మ‌రియు బెంగ‌ళూరు నుండి మూడు నేరు విమాన స‌ర్వీసులు ఈ వారం లో ఆరంభం అయ్యాయ‌ని చెప్పారు.  రూపే చెల్లింపు ల వ్య‌వ‌స్థ ఆరంభం కావ‌డం తో మాల్దీవ్స్ కు భార‌తీయుల రాక‌ పోక ల‌లో మ‌రింత సౌల‌భ్యం ఏర్పడుతుంద‌ని ఆయ‌న అన్నారు.  హుల్‌హుల్‌మాలే లో ఒక కేన్స‌ర్ ఆసుప‌త్రి ని మ‌రియు క్రికెట్ స్టేడియ‌మ్ ను నిర్మించడాని కి ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని, 34 దీవుల లో పారిశుధ్య ప‌థ‌కం మ‌రియు నీటి స‌ర‌ఫ‌రా ప‌థ‌కం ప‌నులు త్వ‌ర‌లో మొద‌లు కానున్నాయ‌న్నారు. 

మాల్దీవ్స్ లో ప్ర‌జాస్వామ్యం మ‌రియుఅభివృద్ధి ఈ రెండిటి ని బ‌లోపేతం చేసేందుకు భాగ‌స్వామ్యాన్ని కొన‌సాగించాల‌ని వుంద‌ని ప్ర‌ధాన మంత్రి త‌న వ‌చ‌న బ‌ద్ధ‌త ను పున‌రుద్ఘాటించారు.  హిందూ మ‌హాస‌ముద్ర ప్రాంతం లో శాంతి కోసం, భ‌ద్ర‌త కోసం స‌హ‌కారాన్ని ఇరు దేశాలు ఇనుమ‌డింప జేసుకొంటాయ‌ని ప్ర‌ధాన మంత్రి తెలిపారు.


https://youtu.be/afsmIGobjcw


**



(Release ID: 1594996) Visitor Counter : 90