రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
ఎఫ్ఎసిటి ఆధీనం లో గల 481.79 ఎకరాల భూమి ని కేరళ ప్రభుత్వాని కి విక్రయించడానికి మరియు విక్రయ ధనాన్ని ఎఫ్ఎసిటి వినియోగించుకోవడాని కి ఆమోదం తెలిపిన మంత్రివర్గం
Posted On:
24 JUL 2019 4:24PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశం ఈ క్రింది ప్రతిపాదనల ను ఆమోదించింది:
1) ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావన్కూర్ లిమిటెడ్ (ఎఫ్ఎసిటి) ఆధీనం లో గల 481.79 ఎకరాల భూమి ని దిగువన పేర్కొన్న పద్దతి లో కేరళ ప్రభుత్వాని కి విక్రయించడం:
a) ఎకరా 1 కోటి రూపాయల ధర వంతున 150 ఎకరాల భూమి (దీనికి బదులు గా, 143.22 ఎకరాల విముక్త భూమి ని ఎఫ్ఎసిటి కి ఇచ్చేందుకు కేరళ ప్రభుత్వం అంగీకరించింది); మరియు
b) మిగిలిన 331.79 ఎకరాల ను- ఎర్నాకుళం జిల్లా కలెక్టర్ మదింపు చేసిన మేరకు- ఎకరా 2.4758 కోట్ల రూపాయల రేటు వంతు న ఇచ్చేందుకు
2) ఈ అమ్మకం ద్వారా వచ్చే సొమ్ము ను ఎఫ్ఎసిటి నిర్వహణ మూలధనం తాలూకు లోటు సమస్య ను పరిష్కరించుకోవడాని కి, ఆస్తి అప్పుల పట్టీ ని మెరుగు పరచుకోవడాని కి మరియు కంపెనీ యొక్క నిలకడతనంతో కూడినటువంటి వృద్ధి కోసం సామర్ధ్య విస్తరణ పథకాలను అమలు చేయడం ద్వారా ఆ కంపెనీ ఆర్థిక పనితీరును, భౌతిక పని తీరు ను ఇనుమడింప చేసుకొనేందుకు మార్గాన్ని సుగమం చేయడం.
ప్రధాన ప్రభావం:
ఎఫ్ఎసిటి కి బ్యాంకు రుణాల ను తగ్గించుకోవడాని కి మరియు ఎరువుల ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుకొనేందుకు తగిన పథకాల ను అమలు చేయడాని కి, అలాగే లాజిస్టిక్స్/ ముడి పదార్థాల సంబంధిత సదుపాయాల ను ఉన్నతీకరించుకోవడాని కి ఈ ఆమోదం సహాయకారి కాగలదు.
ప్రయోజనాలు:
ఎఫ్ఎసిటి యొక్క పునరుద్ధరణ కంపెనీ యొక్క విస్తరణ కు మరియు వివిధీకరణ కు అవకాశాల ను ప్రసాదిస్తుంది. అంతేకాకుండా ప్రత్యక్షం గా, పరోక్షం గా మరిన్ని ఉద్యోగాల ను సృష్టించేందుకు కూడా దోహదం చేస్తుంది. వీటన్నింటి ఫలితం గా కేరళ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కు ఉత్తేజం లభించడం తో పాటు, దక్షిణ భారతదేశం లో ఎరువుల లభ్యత సైతం మెరుగవుతుంది. రసాయనాలు మరియు ఎరువుల దిగుమతి పై ఆధారపడటం తగ్గనుండటం తదనుగుణం గా దేశాని కి విదేశీ మారక ద్రవ్యం ఆదా అయ్యేందుకు వీలు కల్పిస్తుంది. అలాగే ఎరువుల పరిస్థితి మరియు ఆహార భద్రత లు కూడా మెరుగుపడతాయి. భూ విక్రయం అమలు తీరు ను పర్యవేక్షించడం కోసం నిర్దిష్ట గడువుల ను చేర్చడం ద్వారా భూ విక్రయానంతరం ఉద్దేశించిన పని తీరు ను సాధించడం లో నిర్వహణ పరమైనటువంటి జవాబుదారీతనాన్ని నెలకొల్పడం జరుగుతుంది. ఈ యూనిట్ ఇప్పటికే పరిశుభ్రమైనటువంటి ఎల్ఎన్‌జి ని ఇంధనం గా వాడుకోవటం మొదలు పెట్టినందువల్ల, యూనిట్ యొక్క శక్తి సంబంధిత సామర్ధ్యం మెరుగు పడటం తో పాటు పర్యావరణ పరంగా మైత్రీపూర్వకమైనటువంటి వైఖరి ని కూడా అవలంబించినట్లు కాగలదు.
**
(Release ID: 1580169)