మంత్రిమండలి

అనియంత్రిత డిపాజిట్ ప‌థ‌కాలను నిషేధించే బిల్లు, 2019 కి ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

పార్ల‌మెంటు రాబోయే స‌మావేశాల లో బిల్లు ను ప్ర‌వేశ‌పెడ‌తారు.

Posted On: 10 JUL 2019 6:04PM by PIB Hyderabad

అనియంత్రిత డిపాజిట్ ప‌థ‌కాల నిషేధించే బిల్లు, 2019 కి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది.  ఈ బిల్లు అనియంత్రిత డిపాజిట్ ప‌థ‌కాల ను నిషేధించేందుకు సంబంధించిన ఆర్డినెన్సు, 2019 కి బ‌దులు గా అమ‌లులోకి వ‌స్తుంది.

2019వ సంవ‌త్స‌రం ఫిబ్ర‌వ‌రి 21వ తేదీన ఆర్డినెన్సు ను జారీ చేయ‌డ‌మైంది.  ఈ ఆర్డినెన్సు కు బదులు గా అనియంత్రిత డిపాజిట్ ప‌థ‌కాలను నిషేధించే బిల్లు, 2019 రాకపోయిన పక్షం లో పార్ల‌మెంటు స‌మావేశాలు తిరిగి ఆరంభ‌మైన 6 వారాల అనంత‌రం ఆర్డినెన్సు అమ‌లు స్తంభించిపోతుంది.

ప్ర‌భావం

ఈ బిల్లు దేశం లో న్యాయ విరుద్ధం గా డిపాజిట్లు స్వీక‌రించే కార్య‌క‌లాపాల ను అరిక‌ట్ట‌డం లో స‌హాయ‌కారి అవుతుంది.  ప్ర‌స్తుతం నియంత్ర‌ణప‌ర‌మైన లోటుపాటుల‌ ను మ‌రియు క‌టువైన పాల‌న‌ప‌ర‌మైన చ‌ర్య‌ల కొదువ ను ఆస‌రా గా చేసుకొని పేద‌లు మ‌రియు అమాయ‌కులైన ప్ర‌జ‌ల క‌ష్టార్జితాన్ని లాగివేసుకొనేందుకు  సొమ్ము చేసుకోవ‌డం జ‌రుగుతోంది.

పూర్వ‌రంగం

అనియంత్రిత డిపాజిట్ ప‌థ‌కం నిషేధ బిల్లు, 2018 ని 2019వ సంవ‌త్స‌రం ఫిబ్ర‌వ‌రి 13వ తేదీన జ‌రిగిన లోక్ స‌భ స‌మావేశాల లో ప‌రిశీల‌న‌ కు తీసుకోవ‌డ‌మైంది.  ఈ బిల్లు పై చ‌ర్చ జ‌రిపిన అనంత‌రం దీని ని ఆమోదించారు.  ప్ర‌తిపాదిత ఆధికారిక స‌వ‌ర‌ణ‌ల ను కూడా అందులో పొందుప‌ర‌చారు.  దాని ని 2019వ సంవ‌త్స‌రం అనియంత్రిత డిపాజిట్ ప‌థ‌కం నిషేధ బిల్లు గా పేర్కొన్నారు.  అయితే అదే రోజు న రాజ్య స‌భ నిర‌వ‌ధికం గా వాయిదా ప‌డటం తో, ఈ బిల్లు ను రాజ్య స‌భ ప‌రిశీలించి ఆమోదం తెలప‌డం సాధ్య‌ప‌డ‌ లేదు.


**



(Release ID: 1578406) Visitor Counter : 175