ఆర్థిక మంత్రిత్వ శాఖ
పన్ను విధించదగిన ఆదాయం రూ. 2 కోట్లు - 5 కోట్లు ఉన్న వ్యక్తుల కు మరియు రూ. 5 కోట్లు, అంతకు మించి కలిగి ఉండే వ్యక్తుల కు వరుసగా సుమారు 3 శాతం మరియు 7 శాతం చొప్పున పెరగనున్న పన్ను రేట్లు
ప్రత్యక్ష పన్ను సంబంధిత ప్రభుత్వ ఆదాయం 2013-14 ఆర్థిక సంవత్సరం నుండి 2018-19 ఆర్థిక సంవత్సరం లో 78 శాతానికి పైగా పెరిగింది; ఇది రూ. 6.38 లక్షల కోట్ల నుండి రూ. 11.37 లక్షల కోట్లకు ఎగబాకింది.
సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (ఎస్‌టిటి) విధింపు లో ఉపశమనాన్ని ఇవ్వాలని ప్రతిపాదించడమైంది
తక్కువ ఖర్చు తో నిర్మితమైన గృహం కొనుగోలు కు తీసుకొన్న రుణం పై చెల్లించిన వడ్డీ లో అదనం గా రూ. 1.5 లక్షల వరకు తగ్గింపు
విద్యుత్తు తో నడిచే కొనుగోలు కు తీసుకొన్న రుణంపై చెల్లించిన వడ్డీ లో అదనం గా 1.5 లక్షల పన్ను తగ్గింపు
Posted On:
05 JUL 2019 1:47PM by PIB Hyderabad
రూ. 2 కోట్ల నుండి రూ. 5 కోట్లు పన్ను విధించదగ్గ ఆదాయం కలిగిన అధిక ఆదాయ వర్గానికి చెందిన వ్యక్తుల కు మరియు రూ. 5 కోట్లు అంతకు మించిన ఆదాయ వర్గాల వారి కి వర్తించే పన్ను రేటుల ను క్రమానుగతం గా దాదాపు 3 శాతం మరియు 7 శాతం వంతు న పెంచాలని ప్రతిపాదించడమైంది. కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మల సీతారమణ్ 2019-20 సాధారణ బడ్జెటు ను ఈ రోజున పార్లమెంటు కు సమర్పిస్తూ, ‘‘ఆదాయం స్థాయి లు పెరుగుతున్న పరిణామాన్ని దృష్టి లో పెట్టుకుని అధికాదాయ వర్గాల వారు దేశాభివృద్ధి కి మరింత గా తోడ్పాటు ను అందించవలసిన అవసరం ఉంది’’ అని స్పష్టం చేశారు. పన్ను చెల్లింపుదారుల కు ఆమె ధన్యవాదాలు చెప్తూ, వారు దేశ నిర్మాణం లో ఒక ప్రధానమైన పాత్ర ను పోషిస్తున్నారన్నారు.
చిన్న మరియు మధ్యతరహా ఆదాయార్జనపరులపై పడుతున్న పన్ను భారాన్ని నివారించడం కోసం గతం లో తీసుకొన్న అనేక చర్యల ను గురించి మంత్రి ప్రస్తావిస్తూ, ‘‘రూ. 5 లక్షల వరకు వార్షికాదాయాన్ని కలిగి ఉండే వారు ఏ విధమైన ఆదాయపు పన్ను ను చెల్లించనక్కరలేదు’’ అని పేర్కొన్నారు. ఈ వర్గం పరిధి లోకి స్వతంత్రోపాధి కలిగిన వ్యక్తుల తో పాటు చిన్న వ్యాపారులు, జీతాన్ని సంపాదించుకొనే వర్గాలు మరియు వరిష్ఠ నాగరికులు వస్తారని ఆమె పేర్కొన్నారు.
పెరిగిన పన్నుల సంబంధిత రాబడి
ప్రత్యక్ష పన్నుల సంబంధిత రాబడి 2013-14 ఆర్థిక సంవత్సరం లో రూ. 6.38 లక్షల కోట్ల స్థాయి లో ఉండగా ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యల ఫలితంగా 2018-19 ఆర్థిక సంవత్సరం లో 78 శాతానికి పైగా గణనీయం గా పెరిగి, సుమారు రూ. 11.37 లక్షల కోట్లకు చేరుకొంది. ఈ పెంపుదల గడచిన 2 సంవత్సరాల కాలం లో చెప్పుకోదగిన రీతి లో ఉందని మంత్రి వెల్లడించారు. 2017-18 లో ప్రత్యక్ష పన్నుల సంబంధిత రాబడి 19.13 శాతం మేర వృద్ధి చెంది, రూ. 10, 02, 741 కోట్ల కు చేరింది. ప్రత్యక్ష పన్నుల సంబంధిత రాబడి 2016-17 లో రూ. 8, 41, 713 కోట్లు గా ఉంది. కాగా, 2018-19 లో ఇది 13.46 శాతం మేర పెరిగింది. పన్ను చెల్లింపుదారుల సంఖ్య కూడా 2013-14 నుండి 2017-18 మధ్య కాలం లో ఇంచుమించు 48 శాతం మేర హెచ్చింది. ఈ పన్ను చెల్లింపుదారులు 5.71 కోట్ల నుండి 8.4 కోట్ల కు పెరిగారు. ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు మరియు టాక్స్ పేయర్ అవుట్‌రీచ్ ప్రోగ్రాము ల కారణం గా ఇది సాధ్యపడింది.
సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (ఎస్ టిటి) విధింపు లో ఉపశమనం
ఆప్షన్స్ ను ఎంచుకొన్న సందర్భం లో సెటిల్‌మెంట్ మరియు స్ట్రైక్ ప్రైస్ ల మధ్య ఉండే వ్యత్యాసాని కి మాత్రమే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ ను పరిమితం చేయడం ద్వారా ఉపశమనాన్ని ఇవ్వాలని ఆర్థిక మంత్రి తన ఉపన్యాసం లో ప్రతిపాదించారు.
చౌక గృహాల నిర్మాణం లో వడ్డీ లో అదనపు తగ్గింపు
తక్కువ ఖర్చు తో కూడిన గృహాల నిర్మాణాని కి మరింత ఉత్తేజాన్ని ఇచ్చే ఉద్దేశ్యం తో రూ. 45 లక్షల వరకు విలువైన చౌక గృహాన్ని కొనుగోలు చేసేందుకు 2020 మార్చి నెల 31వ తేదీ వరకు పొందే రుణాల కు చెల్లించిన వడ్డీ లో రూ. 1,50,000 వరకు అదనపు తగ్గింపు ను అనుమతించాలని మంత్రి ప్రతిపాదించారు. చౌక గృహాన్ని కొనుగోలు చేసే ఒక వ్యక్తి ఈ కారణం గా ఇక మీదట దాదాపు రూ. 3.5 లక్షల వరకు అదనపు వడ్డీ తగ్గింపు లబ్ధి ని పొందే వీలు ఉంది. ఇది 15 సంవత్సరాల రుణ అవధి లో మధ్యతరగతి గృహ కొనుగోలుదారుకు రమారమి రూ.7 లక్షల లబ్ధి ని చేకూర్చగలుగుతుంది.
తక్కువ ఖర్చు తో గృహ నిర్మాణం మరియు ‘‘అందరికీ గృహ వసతి’’ లక్ష్యాన్ని సాధించడం కోసం ఈ తరహా గృహాల ను అభివృద్ధి పరచే సంస్థల కు అవి ఆర్జించిన లాభాల లో ఒక పన్ను విరామాన్ని ఇప్పటికే కల్పించడమైంది. అంతేకాదు, స్వయం గా నివాసం ఉండే ఇంటి విషయం లో రూ. 2 లక్షల వరకు గృహ రుణం పై చెలించిన వడ్డీ లో తగ్గింపు ను అనుమతిస్తున్నారు.
విద్యుత్తు తో నడిచే వాహనాల ను ప్రోత్సహించడం
వినియోగదారుల కు ఇలెక్ట్రిక్ వెహికిల్స్ ను అందుబాటులోకి తెచ్చేందుకు గాను ఈ తరహా వాహనాలను కొనుగోలు చేయడం కోసం తీసుకొన్న రుణాల పై చెల్లించిన వడ్డీ లో రూ. 1.5 లక్షల ఆదాయపు పన్ను తగ్గింపు ను అదనంగా ప్రభుత్వం కల్పిస్తుందని మంత్రి తెలిపారు. ఇది రుణం తిరిగి చెల్లింపు కాలం లో దాదాపు గా రూ. 2.5 లక్షల లబ్ధి ని చేకూర్చుతుంది. భారతదేశం లోని భారీ వినియోగదారుల ను లెక్క లోకి తీసుకొని ‘’విద్యుత్తు తో నడిచే వాహనాల తయారీ కి ప్రపంచం లో ఒక కేంద్ర బిందువు గా భారతదేశాన్ని తీర్చిదిద్దాలని మేము లక్ష్యం గా పెట్టుకొన్నాం. ఈ పథకం లో సోలర్ స్టోరేజీ బ్యాటరీ లు మరియు ఛార్జింగ్ సంబంధిత మౌలిక సదుపాయాల ను చేర్చడం వల్ల మా యొక్క ప్రయత్నాల కు ఊతం లభిస్తుంది’’ అని ఆమె అన్నారు. ఇలెక్ట్రిక్ వెహికల్స్ పై జిఎస్‌టి రేటు ను 12 శాతం నుండి 5 శాతాని కి తగ్గించవలసింది గా ప్రభుత్వం ఇప్పటికే జిఎస్‌టి కౌన్సిల్ కు సూచన చేసిందని కూడా ఆమె వివరించారు.
బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీ (ఎన్‌బిఎఫ్‌సి)లకు సమానావకాశాల కల్పన
భారతదేశ ఆర్థిక వ్యవస్థ లో ఎన్‌బిఎఫ్‌సి ల పాత్ర అంతకంతకు ప్రముఖమైంది గా మారుతూ ఉండటాన్ని గమనించి సమానావకాశాలను కల్పించడం కోసం వసూలు కానటువంటి రుణాలు లేదా సందేహాస్పద రుణాల పై వడ్డీ కి పన్ను వేయాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. ప్రస్తుతం దీని ని షెడ్యూల్డు బ్యాంకులు, ప్రభుత్వ ఆర్థిక సంస్థలు, రాష్ట్ర ఆర్థిక సంస్థలు, రాష్ట్ర పారిశ్రామిక పెట్టుబడి సంస్థలు, సహకార బ్యాంకులు మరియు గృహ నిర్మాణ ఆర్థిక కంపెనీల వంటి కొన్ని పబ్లిక్ కంపెనీల విషయం లో మాత్రమే అనుమతించడం జరుగుతోంది.
ఇంటర్ నేశనల్ ఫినాన్శియల్ సర్వీస్ సెంటర్ (ఐఎఫ్ ఎస్ సి) ని ప్రోత్సహించడం కోసం చర్య లు
జిఐఎఫ్‌టి సిటీ లో ఐఎఫ్ఎస్‌సి ని ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యం తో ఒక ఐఎఫ్ఎస్‌సి కి అనేక ప్రత్యక్ష పన్ను ప్రోత్సాహకాల ను అందించాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. వీటి లో- 15 సంవత్సరాల కాలం లోపల ఏ 10 సంవత్సరాల బ్లాకు కైనా సెక్షన్ 80-ఎన్ఎ పరిధి లో 100 శాతం లాభం తో ముడిపడిన తగ్గింపు ను ఇవ్వడం, మ్యూచువల్ ఫండ్ లకు మరియు కంపెనీల కు ప్రస్తుత, ఇంకా సంచిత ఆదాయం లో నుండి డివిడెండు పంపిణీ పన్ను ను చెల్లించనక్కరలేకుండా మినహాయింపును ఇవ్వడం. కేటగిరీ-3 ఎఐఎఫ్ కు మూలధన లబ్ధి పై మినహాయింపులు అలాగే, ప్రవాసుల వద్ద నుండి తీసుకొన్న రుణం తాలూకు వడ్డీ చెల్లింపు లో మినహాయింపులు- చేరి ఉంటాయి.
రిటర్న్ ను తప్పనిసరి గా దాఖలు చేయడం
ఒక సంవత్సరం లో ఒక కరెంటు ఖాతా లో రూ. ఒక కోటి కి పైగా జమ చేసిన వారు, లేదా విదేశీ యాత్ర కోసం రూ. 2 లక్షల పైగా ఖర్చు పెట్టిన వారు, లేదా ఒక సంవత్సరం లో విద్యుత్తు వినియోగం పై రూ. ఒక లక్ష కు పైగా వెచ్చించిన వారు, లేదా నిర్దేశిత నిబంధనల ను నెరవేర్చిన వారు తప్పనిసరి గా రిటర్న్ ను దాఖలు చేయాలని 2019-20 సాధారణ బడ్జెటు ప్రతిపాదిస్తోంది. అధిక విలువ కలిగిన లావాదేవీల ను జరిపే వారు కూడా ఆదాయపు రిటర్న్ ను సమర్పించేలా చూడటం కోసం ఈ ప్రతిపాదన ను ఉద్దేశించడమైంది. మూలధన లాభాల తాలూకు రోలోవర్ బెనిఫిట్ ను క్లెయిమ్ చేసినందువల్ల పన్ను విధించదగ్గ గరిష్ఠ మొత్తం కన్నా తక్కువ ఆదాయం లెక్క తేలినటువంటి వ్యక్తి కూడాను రిటర్న్ ను సమర్పించవలసి ఉంటుందని కూడా ఈ ప్రతిపాదన లో పొందుపరచడమైంది.
**
(Release ID: 1577598)
Visitor Counter : 200