ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఆర్థిక సర్వేక్షణ 2018- 19: సాధారణ ప్రభుత్వం (కేంద్రం, రాష్ట్రాలు) ఆర్థిక ఏకీకరణ బాట లో పయనిస్తున్నాయి
ఆర్థిక వ్యవస్థ 2018-19 లో 6.8 శాతం స్థాయి లో వృద్ధి చెందుతుందన్న ఆశ
2020-21 ఆర్థిక సంవత్సరానికల్లా ద్రవ్య లోటు జిడిపి లో 3 శాతాని కి; 2024-25 కల్లా కేంద్ర ప్రభుత్వ రుణాన్ని జిడిపి లో 40 శాతాని కి పరిమితం చేయాలన్న లక్ష్యాలు
వ్యయ నాణ్యత ను మెరుగు పరచడం కీలక ప్రాథమ్యం; ప్రత్యక్ష పన్నుల ఆధారాన్ని విస్తృతం చేయడం మరియు వస్తువులు, ఇంకా సేవల పన్ను ను స్థిరీకరించడం ఇతర ప్రాథమ్యాలు
రాష్ట్రాలకు మొత్తం బదలాయింపులు 2014-15 నుండి 2018-19 సవరించిన అంచనాల మధ్య జిడిపి లో 1.2 పర్సెంటేజి పాయింట్ల కు పెరిగాయి
Posted On:
04 JUL 2019 12:23PM by PIB Hyderabad
సాధారణ ప్రభుత్వం (కేంద్రం మరియు రాష్ట్రాలు) ఆర్థిక క్రమశిక్షణ, ఇంకా ఆర్థిక ఏకీకరణ పథం లో సాగుతున్నదని 2018-19 సంవత్సర ఆర్థిక సర్వేక్షణ స్పష్టం చేసింది. రాబడి ని పెంపొందించుకోవడం, వ్యయాల కు ప్రాథమ్యాలను పునర్ నిర్దేశించుకోవడం, అలాగే క్రమబద్ధీకరణ లు ఆర్థిక సంస్కరణల లో ముఖ్యం గా ఉంటాయని కూడా ఈ నివేదిక పేర్కొన్నది. ‘‘ప్రత్యక్ష పన్ను బేస్ ను మరింత లోతు కు తీసుకుపోతూ ఈ బేస్ ను విస్తరించడం, అలాగే వస్తువులు మరియు సేవల పన్ను ను స్థిరీకరించడం అనేవి ఇతర ప్రాధాన్యాలు. వ్యయ నాణ్యత ను మెరుగు పరచడం కీలక ప్రాథమ్యం గా ఉంటుంది. కొత్త గా సవరించిన ఆర్థిక ప్రయాణపు పథం నుండి దారి మళ్ళకుండా కేటాయింపుల తాలూకు ఆవశ్యకతల ను పూర్తి చేయడం అనేది అతి ముఖ్యమైనటువంటి సవాలు గా మిగిలింది. అనేక ప్రతికూలత లు ఎదురైనప్పటికీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ 2018-19 లో స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని నిలబెట్టుకొంటూ 6.8 శాతం (కేంద్రీయ గణాంకాల కార్యాలయం విడుదల చేసిన తాత్కాలిక అంచనాలను బట్టి) మేరకు వృద్ధి చెందగలదని ఆశించడమైనది. స్థూల స్థిరీకరణ తో కూడిన వృద్ధి ప్రధానం గా ప్రస్తుతం కొనసాగుతున్న వ్యవస్థాగత సంస్కరణలు, ఆర్థిక క్రమశిక్షణ, సేవల అందజేత, ఇంకా ఆర్థిక సమ్మిళతం కార్యక్రమాల నుండి సాధ్యపడనుంది’’ అని సర్వేక్షణ పత్రం వివరించింది. ఆర్థిక సర్వేక్షణ 2018-19 పత్రాన్ని కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మల సీతారమణ్ పార్లమెంటు కు నేడు సమర్పించారు.
2020-21 ఆర్థిక సంవత్సరానికల్లా జిడిపి లో 3 శాతం స్థాయి ద్రవ్య లోటు ను మరియు 2024-25 కల్లా కేంద్ర ప్రభుత్వ రుణాన్ని జిడిపి లో 40 శాతాని కి పరిమితం చేయడం అనే లక్ష్యాల ను సాధించాలని సవరించిన ఆర్థిక ప్రయాణ పథం ఆశిస్తున్నది. 2018-19 బడ్జెటు అంచనాల లో జిడిపి లో 3.3 శాతం స్థాయి లో ఉండే విధంగా ఆర్థిక లోటు ను చేరుకోవడమే 2018-19 కేంద్ర బడ్జెటు తో పాటుగా ప్రవేశపెట్టిన మధ్యకాలిక ఆర్థిక విధాన ప్రకటన ధ్యేయం అని సర్వేక్షణ వెల్లడించింది. ‘‘2018-19 ఆర్థిక సంవత్సరం జిడిపి లో 3.4 శాతం ఆర్థిక లోటు తో, మరి అలాగే 44.5 శాతం డెట్ టు జిడిపి రేశియో (తాత్కాలికం) తో సమాప్తమయింది. కేంద్ర ప్రభుత్వ వ్యయం 2017-18 తో పోల్చినప్పుడు 2018-19 పిఎ లో 0.3 పర్సెంటేజి పాయింట్ల మేర పడిపోయింది. రాబడి సంబంధిత వ్యయం లో 0.4 పర్సెంటేజీ పాయింట్ల మేరకు తగ్గుదల, మరి అలాగే మూలధన వ్యయం లో 0.1 పర్సెంటేజీ పాయింట్ల వృద్ధి ఉన్నాయి. రాష్ట్రాల ఫైనాన్సుల విషయానికి వస్తే వాటి సొంత పన్ను మరియు పన్నేతర రాబడి 2017-18 ఆర్ఇ లో పటిష్టమైన వృద్ధి ని కనబరచింది 2018-19 బిఇ లోను దీనిని నిలబెట్టుకోవడం జరుగుతుందని ఊహించడమైనది’’ అని ఈ పత్రం లో తెలిపారు.
గ్రాఫిక్ కు పదాలు..........
కేంద్రం మరియు రాష్ట్రాల సంయుక్త అప్పులు 2016 మార్చి అంతాని కి జిడిపి లో 68.5 శాతం స్థాయి ఉండి 2018 మార్చి అంతాని కి జిడిపి లో 67 శాతాని కి తగ్గాయి. కేంద్ర ప్రభుత్వ ద్రవ్య లోటు 2017-18 ఆర్ఇ లో జిడిపి లో 6.4 శాతం స్థాయి నుండి 2018-19 బిఇ లో జిడిపి లో 5.8 శాతాని కి మరింత గా తగ్గిపోగలదని ఆశించడమైంది.
పెట్టుబడి, ఇంకా వ్యాపార చక్రం తాలూకు ఆశావాద భరిత ముఖచిత్రాన్ని పూర్వరంగం గా తీసుకొని 2018-19 బడ్జెటు ను ప్రవేశపెట్టినట్లు సర్వేక్షణ గమనించింది. ఆర్థిక స్థిరీకరణ యొక్క లక్ష్యాన్ని బడ్జెటు పునరుద్ఘాటించింది. అంతేకాకుండా, రుణాన్ని మరియు ద్రవ్యలోటు ను తగ్గించుకోవడం పై దృష్టి పెడుతూ ఒక నూతనమైన ఫిస్కల్ టార్గెటింగ్ ఫ్రేమ్ వర్క్ ను పరిచయం చేయడం సైతం ఈ బడ్జెటు లోని మరొక విశిష్టత గా ఉంది. 2017-18 సవరించిన అంచనాలు (ఆర్ఇ) కన్నా స్థూల పన్ను రాబడి (జిటిఆర్) లో 16.7 శాతం వృద్ధి ని 2018-19 బడ్జెటు అంచనా వేసింది. ఇది 22.7 లక్షల కోట్ల రూపాయల స్థాయి లో జిడిపి లో 12.1 శాతం గా ఉంటుందని భావించడమైంది. అయితే, 2018-19 ప్రొవిజనల్ యాక్చువల్స్ (పిఎ) కాలాని కి జిటిఆర్ లో వృద్ధి బడ్జెటు అంచనా కన్నా తక్కువ గా ఉన్నప్పటికీ 2017-18 కాలం తో పోల్చి చూసినప్పుడు 8.4 శాతం పెరుగుదల ను చూపిస్తోంది. కార్పొరేట్ ట్యాక్స్ మెరుగైన కారణం గా ప్రత్యక్ష పన్నులు 2017-18 కన్నా 2018-19 పిఎ లో 13.4 శాతం మేరకు వృద్ధి చెందినట్లు సర్వేక్షణ వెల్లడించింది.
టాక్స్ టు జిడిపి రేశియో, రాబడి సంబంధిత వ్యయం యొక్క ఏకీకరణం, మూలధన వ్యయం దిశ గా క్రమం గా మొగ్గు చూపే ధోరణి, ఇంకా కేంద్ర ప్రభుత్వం యొక్క మొత్తం అప్పుల లో నిరంతర క్షీణత.. ఈ అంశాల లో కేంద్ర ప్రభుత్వ ఫైనాన్సులు గడచిన అనేక సంవత్సరాల కాలం లో మెరుగుదల ను నమోదు చేశాయి. ఈ పరిణామాలన్నీ కొన్ని ఏళ్ళు గా ప్రాథమిక లోటులోను, ద్రవ్య లోటు లోను క్రమేణా తగ్గింపునకు దారి తీశాయని పత్రం లో వివరించారు.
2018-19 సంవత్సరాని కి ప్రొవిజనల్ యాక్చువల్స్ ను బడ్జెట్ అంచనాల తో పోల్చి చూసినప్పుడు ప్రభుత్వం ద్రవ్య లోటు ను జిడిపి లో 3.4 శాతం వద్ద నియంత్రించగలిగినట్లు వెల్లడి అవుతోంది. ప్రభుత్వ వ్యయాన్ని కుదించడం ద్వారా ఇది సాధ్యమైంది. యావత్తు తగ్గింపు కూడాను ఆదాయ సంబంధ వ్యయం లోనే నమోదయింది. 2017-18 కన్నా 2018-19 పిఎ లో మొత్తం వ్యయం లో మూలధన సంబంధ వ్యయం వాటాను చూస్తే వ్యయ నాణ్యత ప్రతిఫలించిందని సర్వేక్షణ తెలియజేసింది.
రాష్ట్రాల కు మొత్తం బదలాయింపులు 2014-15 మరియు 2018-19 ఆర్ఇ ల మధ్య కాలం లో జిడిపి లో 1.2 పర్సెంటేజీ పాయింట్ల స్థాయి లో వృద్ధి చెందినట్లు కూడా సర్వేక్షణ విశదీకరించింది. కేంద్ర ప్రభుత్వం యొక్క మొత్తం అప్పులు (జిడిపి లో ఒక నిష్పత్తి గా చూసినప్పుడు) నిలకడైన రీతి లో తగ్గుతూ వచ్చాయి. మరీ ముఖ్యం గా 2003 సంవత్సరం లో ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ ఎండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్ యాక్ట్ ను అమలు లోకి తెచ్చిన తరువాత ఇది చోటు చేసుకొంది. ‘‘ఇది ఆర్థిక ఏకీకరణ ప్రయత్నాలు మరియు సాపేక్షం గా జిడిపి లోని అధిక వృద్ధి.. ఈ రెండింటి పర్యవసానం గా ఆవిష్కారమైంది’’ అని సర్వేక్షణ వివరించింది.
కేంద్ర ప్రభుత్వం యొక్క మొత్తం అప్పులు 2019 మార్చి అంతానికి 84.7 లక్షల కోట్ల రూపాయలు గా ఉన్నాయి. దీనిలో 90 శాతం పబ్లిక్ డెట్ లో చాలా వరకు స్థిర వడ్డీ రేటు వద్ద కుదింపునకు లోనయింది. తత్ఫలితం గా భారతదేశ డెట్ స్టాక్ వడ్డీ రేటు లోని చంచలత్వం బారిన పడకుండా మిగిలింది. వడ్డీ చెల్లింపుల విషయకంగా చూసినప్పుడు ఇది బడ్జెటు కు ఒక స్థిరత్వాన్ని సంతరిస్తుంది. మరొక ముఖ్యమైన అంశం ఏమిటి అంటే, కేంద్ర ప్రభుత్వ రుణం తాలూకు పరిపక్వత ముఖ చిత్రం క్రమం గా సుదీర్ఘత ను ప్రోది చేసుకొని రోలోవర్ రిస్కుల ను తగ్గించడమన్నది.
రాష్ట్రాల బడ్జెటు లు 2016-17 తో పోల్చి చూసినప్పుడు 2017-18 ఆర్ఇ లో గణనీయం గా విస్తరించాయి. రాబడి సంబంధిత వ్యయం లో పెరుగుదల దీనికి తోడ్పడింది. ఆదాయ కోణం లో చూసినప్పుడు రాష్ట్రాల యొక్క సొంత పన్ను సంబంధిత రాబడి, పన్నులకు సంబంధించని రాబడి 2017-18 ఆర్ఇ లో పటిష్టమైన వృద్ధిని ప్రదర్శించింది. 2018-19 బిఇ లో ఇదే స్థాయి ని నిలబెట్టుకోవచ్చని అంచనా వేయడమైంది. 2016-17 తో పోల్చినప్పుడు 2017-18 ఆర్ఇ లో ఫిస్కల్ డెఫిసిట్ టు జిడిపి రేశియో లో మెరుగుదల ఉన్నట్లు సర్వేక్షణ పత్రం తెలిపింది.
రానున్న సంవత్సరం ఆర్థిక రంగాని కి అనేక సవాళ్ళ ను రువ్వనుందని ఆర్థిక సర్వేక్షణ పత్రం హెచ్చరిస్తోంది. వీటిలో వృద్ధి యొక్క మందగమనం తాలూకు భయాలు ఒకటో సవాలు గా ఉంది. ఈ భయాలు రాబడి వసూళ్ళ పైన ప్రభావాన్ని ప్రసరించగలవు. ఇక రెండో సవాలు ఏమిటి అంటే 2018-19 ఆర్థిక సంవత్సరం జిఎస్‌టి వసూళ్ళ లో తగ్గుదల తో ముగిసింది. అందువల్ల కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల వనరుల స్థితిని మెరుగు పరచాలంటే జిఎస్‌టి తాలూకు రాబడి ని పెంపొందించుకోవడం కీలకం గా ఉంటుంది. మూడో సవాలు ఏమిటి అంటే ద్రవ్య లోటు లక్ష్య సాదన లో రాజీ పడకుండా ఆయుష్మాన్ భారత్, ప్రస్తుతం పరిధిని విస్తరించినటువంటి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం-కిసాన్) లతో పాటు కేంద్ర ప్రభుత్వ ఇతర కార్యక్రమాలకు కావలసిన వనరుల ను అన్వేషించవలసివుంటుంది అనేదే. ఇక నాలుగో సవాలు విషయాని కి వస్తే, ఇరాన్ నుండి చమురు దిగుమతి పై అమెరికా విధించిన ఆంక్షలు చమురు ధరల పైన ప్రభావాన్ని చూపుతాయి అనేది. తద్వారా పెట్రోలియమ్ సబ్సిడీ పైన కూడా ప్రభావం పడుతుంది. అంతేకాదు, కరెంటు అకౌంట్ బ్యాలెన్సుల పైన కూడా దీని ప్రభావం ఉంటుంది. చివరగా, 2020వ సంవత్సరం ఏప్రిల్ లో ఆరంభం అయ్యే తదుపరి అయిదు సంవత్సరాల కాలానికి పదిహేనో ఆర్థిక సంఘం తన నివేదిక ను సమర్పించవలసివుంది. పన్నుల ప్రాప్తి పై ఈ సంఘం చేసే సిఫారసు కేంద్ర ప్రభుత్వ ఫైనాన్సుల ను ప్రభావితం చేయనుంది.
**
(Release ID: 1577257)