ప్రధాన మంత్రి కార్యాలయం

అభినందన పూర్వక ఫోన్ కాల్స్ ను అందుకొన్న ప్రధాన మంత్రి

Posted On: 26 MAY 2019 5:05PM by PIB Hyderabad

భార‌త‌దేశం లో ఇటీవ‌లి సాధార‌ణ ఎన్నిక‌ల లో ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సాధించిన విజ‌యానికి ఆయ‌న ను అభినందిస్తూ పాకిస్తాన్ ప్ర‌ధాని, శ్రేష్ఠుడు శ్రీ ఇమ్రాన్ ఖాన్, మాల్‌దీవ్స్ పూర్వ అధ్య‌క్షుడు, శ్రేష్ఠుడు మొహ‌మ్మ‌ద్ న‌శీద్ ల‌తో పాటు నేపాల్ పూర్వ ప్ర‌ధాని, శ్రేష్ఠుడు శ్రీ మాధ‌వ్ నేపాల్ లు టెలిఫోన్ ద్వారా అందించిన అభినంద‌న‌ లను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న స్వీక‌రించారు.  
 
పాకిస్తాన్ ప్ర‌ధాని త‌న కు టెలిఫోన్ ద్వారా శుభాకాంక్ష‌లు తెలిపినందుకు ఆయన కు ప్ర‌ధాన మంత్రి ధ‌న్య‌వాదాలు ప‌లికారు.  త‌న ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్నటువంటి నేబ‌ర్‌హుడ్ ఫ‌స్ట్ పాలిసీ కి అనుగుణం గా తాను తీసుకొన్న చొర‌వ‌ల ను ప్ర‌ధాన మంత్రి గుర్తుకు తెస్తూ, పేద‌రికం పై క‌ల‌సి పోరాడుదామ‌ంటూ పాక్ ప్ర‌ధాని కి తాను ఇదివ‌ర‌కు ఇచ్చిన‌ సలహా ను గురించి ప్ర‌స్తావించారు.  మ‌న ప్రాంతం లో శాంతి, ప్ర‌గ‌తి మ‌రియు స‌మృద్ధి ల సాధ‌న కోసం మరియు సహకారాన్ని వర్ధిల్లజేసుకోవడం కోసం విశ్వాసాన్ని సృష్టించుకోవ‌డం, దానితో పాటే ఉగ్ర‌వాదాని కి, ఇంకా హింస కు తావు ఉండ‌న‌టువంటి వాతావ‌ర‌ణాన్ని సృష్టించుకోవ‌డం అత్యవసరం అంటూ ప్రధాన మంత్రి ఈ సందర్భం లో స్ప‌ష్టం చేశారు.  

ప్ర‌ధాన మంత్రి ని ఆయన పొందిన చారిత్రక ప్రజాతీర్పు కు గాను పూర్వ అధ్య‌క్షుడు శ్రీ న‌శీద్ అభినందించారు.  భార‌త‌దేశాని కి, మాల్‌దీవ్స్ కు మ‌ధ్య సంబంధం ఇటీవ‌ల కాలం లో మ‌రింత గా పెంపొందిన విష‌యాన్ని శ్రీ నశీద్ గుర్తు కు తెచ్చారు.  ఈ ప్రాంతం లో ఉగ్ర‌వాద శ‌క్తుల తో, సమూల సంస్కరణ వాద శక్తుల తో పోరాడ‌టాని కి స‌న్నిహితంగా స‌హ‌కరించుకోవడం ఎంతైనా అవ‌స‌ర‌ం అని ఆయ‌న నొక్కిపలికారు.  ఆయ‌న అభినంద‌న‌ల కు ప్ర‌ధాన మంత్రి ధ‌న్య‌వాదాలు తెలుపుతూ, ఈ ప్రాంతం లో శాంతి- భ‌ద్ర‌త‌ ల కోసం, అభివృద్ధి కోసం ఒక బ‌ల‌మైనటువంటి, ప‌ర‌స్ప‌ర ప్ర‌యోజ‌న‌కారి అయినటువంటి మరియు స‌ర్వ‌ రంగాలలోనూ భాగ‌స్వామ్యాన్ని వర్ధిల్లజేసుకొంటూ ఉండటానికి తాను వచనబద్ధుడినై వున్నట్లు పున‌రుద్ఘాటించారు.  

ప్ర‌ధాన మంత్రి త‌న పార్టీ ని మ‌రియు తన కూట‌మి ని ఒక భ‌వ్య‌మైన‌, చారిత్రక మ‌రియు బ్ర‌హ్మాండ‌ విజ‌యం దిశ గా ముందుండి మరీ న‌డిపించారంటూ ప్ర‌ధాన మంత్రి కి శ్రీ మాధ‌వ్ నేపాల్ ఆత్మీయ అభిన‌ంద‌న‌లు తెలిపారు.  ముందు వ‌రుస‌ లో నిలచే ఒక ప్ర‌పంచ శ‌క్తి గా భార‌త‌దేశం ఆవిర్భ‌వించ‌గ‌ల‌ద‌న్న విశ్వాసాన్ని ఆయ‌న వ్య‌క్తం చేస్తూ, ఈ ప‌రిణామం యావ‌త్తు ప్రాంతం యొక్క గుణాత్మ‌క‌మైన ఎదుగుద‌ల కు తోడ్ప‌డ‌గ‌ల‌ద‌ని కూడా పేర్కొన్నారు.  శ్రీ మాధ‌వ్ నేపాల్ అందించిన ఆత్మీయ శుభాకాంక్ష‌ల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధ‌న్య‌వాదాలు పలుకుతూ నేపాల్ కు, భార‌త‌దేశాని కి మ‌ధ్య గ‌ల చ‌రిత్రాత్మ‌కమైన మైత్రీపూర్వ‌క మరియు బ‌హుముఖీన సంబంధాల ను మ‌రింత బ‌లోపేతం చేసుకోవాల‌న్న‌ది త‌న చిత్తశుద్ధి తో కూడినటువంటి అభిలాష గా ఉన్నద‌ని వెల్లడించారు.
 

**



(Release ID: 1572670) Visitor Counter : 126