జల వనరులు, నదుల అభివృద్ధి మరియు గంగా నది శుద్ధి మంత్రిత్వ శాఖ
రోడ్డు విస్తరణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా హైదరాబాద్ లోని నల్లగండ్ల లో గల కేంద్ర జల సంఘం యొక్క భూమి ని సేకరించేందుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
Posted On:
27 MAR 2019 1:44PM by PIB Hyderabad
రహదారి ని విస్తరించి రేడియల్ రోడ్డు నెంబర్ 30 ని మెరుగుపరచేందుకు గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా హైదరాబాద్ లోని నల్లగండ్ల లో గల కేంద్ర జల సంఘం యొక్క భూమి లోని తూర్పు దిక్కున ఉన్నటువంటి ప్రహరీ గోడ (సుమారు 200 మీటర్లు) సహా 10 ఎకరాల భూమి లో నుండి 372 చదరపు గజాల భూమి ని సేకరించేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకోసం ఎటువంటి రుసుము ను చెల్లించడం జరుగదు.
ఈ విధం గా అభివృద్ధి పరచిన మార్గం కేంద్ర జల సంఘానికి ఉపయుక్తం కాగలదు. ఎందుకంటే కేటాయించిన భూమి లో ఒక ప్రావీణ్య కేంద్రాన్ని నిర్మిస్తామని ప్రతిపాదించడం జరిగింది.
**
(Release ID: 1569664)