ప్రధాన మంత్రి కార్యాలయం
దేశ ప్రజల ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
Posted On:
27 MAR 2019 2:11PM by PIB Hyderabad
దేశ ప్రజల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ప్రసంగించారు.
“ప్రతి దేశం యొక్క యాత్ర లో అత్యంత గర్వకారణమైనటు వంటి ఘడియ లు, అలాగే ముందు తరాల వారి పై ఒక చరిత్రాత్మక ప్రభావాన్ని చూపెట్టేటటువంటి ఘడియ లు ఉంటాయి. ఈ రోజు ను అటువంటి ఒక ఘడియ గా చెప్పవచ్చును. భారతదేశం ఉపగ్రహ నిరోధక (ఎఎస్ఎటి) క్షిపణి ని విజయవంతం గా పరీక్షించింది. మిశన్ శక్తి సఫలం అయిన సందర్భం లో ప్రతి ఒక్కరికీ ఇవే అభినందనలు.
మిశన్ శక్తి ఒక అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ. దీని ని అమిత వేగం తో, అసాధారణమైన ఖచ్చితత్వం తో నిర్వహించడం జరిగింది. ఇది భారతదేశం యొక్క విశిష్ట ప్రతిభాన్విత శాస్త్రవేత్తల ప్రావీణ్యాన్ని, మరి మన అంతరిక్ష కార్యక్రమం యొక్క కృతార్థత ను నిరూపించింది.
మిశన్ శక్తి 2 కారణాల రీత్యా ప్రత్యేకమైంది:
1) ఇటువంటి ఒక ప్రత్యేకమైన మరియు ఆధునికమైన సామర్ధ్యాన్ని సంపాదించుకొన్న నాలుగో దేశం గా భారతదేశం నిలచింది.
2) దీనికి సంబంధించిన కృషి అంతా కూడా దేశీయం గానే జరిగింది.
భారతదేశం ఒక రోదసి శక్తి గా సమున్నతం గా నిలబడింది. ఇది భారతదేశాన్ని బలవత్తరం గా, మరింత భద్రమైంది గా తీర్చిదిద్దడం తో పాటు శాంతి ని మరియు సామరస్యాన్ని ఇనుమడింప చేస్తుంది కూడాను” అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
**
(Release ID: 1569653)
Visitor Counter : 155