మంత్రిమండలి
అనియంత్రిత డిపాజిట్ పథకాల నిషేధం ఆర్డినెన్సు, 2019 ని జారీ చేయడానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం
Posted On:
19 FEB 2019 9:24PM by PIB Hyderabad
అనియంత్రిత డిపాజిట్ పథకాల ఆర్డినెన్సు, 2019ని జారీ చేయడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
ప్రయోజనాలు:
అత్యాశ గల నిర్వాహక సంస్థ లు దేశం లో ఆరంభించిన అక్రమ డిపాజిట్ స్వీకరణ కార్యకలాపాల బెడద ను ప్రతిపాదిత ఆర్డినెన్సు తక్షణ ప్రాతిపదిక న అరికట్టగలుగుతుంది. ఈ సంస్థ లు ప్రస్తుతమున్న నియంత్రణ పరమైన లోపాల ను అడ్డం పెట్టుకొని మరియు కఠినమైన పాలన సంబంధిత చర్యలు కొరవడటం తో పేదల ను, అమాయకులైన ప్రజల ను వంచించి, వారి కష్టార్జితాన్ని దోచుకొంటున్నాయి. కాగా, అనియంత్రిత డిపాజిట్ పథకాల ను మొత్తం మీద నిషేధిస్తూ, మరి అలాగే ఆ విధమైన పథకాల ను ఏదో ఒక విధం గా డిపాజిట్ల ను చట్టవిరుద్ధం గా సమీకరిస్తున్న కేసుల లో ఆయా సంస్థ ల చేత సదరు డిపాజిట్ల ను తిరిగి చెల్లించడం / ఆయా సంస్థ లను శిక్షించేందుకు తగిన నియమ నిబంధన లను అమలు పరచడం ప్రతిపాదిత ఆర్డినెన్సు లక్ష్యం గా ఉంది.
**
(Release ID: 1565464)