మంత్రిమండలి

వైద్యాని కి, హోమియోప‌తి కి సంబంధించిన సాంప్ర‌దాయ‌క వ్య‌వ‌స్థ‌ ల రంగం లో భార‌త‌దేశం మరియు బ్రెజిల్ ల మ‌ధ్య‌ స‌హ‌కారాని కి ఉద్దేశించిన ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం.

Posted On: 06 FEB 2019 9:52PM by PIB Hyderabad

వైద్యాని కి, హోమియోప‌తి కి సంబంధించిన సాంప్ర‌దాయ‌క వ్య‌వ‌స్థ‌ ల రంగం లో భార‌త‌దేశం మరియు బ్రెజిల్ ల మ‌ధ్య‌ స‌హ‌కారాని కి ఉద్దేశించినటు వంటి ఒక అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పంద ప‌త్రానికి (ఎంఒయు కు) ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న జరిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది.

ప్ర‌యోజ‌నాలు:

వైద్యాని కి సంబంధించిన సాంప్ర‌దాయ‌క వ్య‌వ‌స్థ‌ ల రంగం లో భార‌త‌దేశం మరియు బ్రెజిల్ ల మ‌ధ్య ద్వైపాక్షిక స‌హ‌కారాన్ని ఈ ఎంఒయు ప్రోత్స‌హించ‌నుంది.  ఉభ‌య దేశాల ఉమ్మ‌డి సాంస్కృతిక వార‌స‌త్వాన్ని ప‌రిగ‌ణ‌న లోకి తీసుకొన్న‌ప్పుడు దీని కి విశేష ప్రాముఖ్యం ఉంది.

పూర్వ‌రంగం:

ఓష‌ధి మొక్క‌లు స‌హా సాంప్ర‌దాయ‌క వైద్య రంగం లో భార‌త‌దేశం లో చ‌క్క‌ గా అభివృద్ధి చెందిన వ్య‌వ‌స్థ‌ లు వేళ్ళూనుకొనివున్నాయి.  ప్ర‌పంచ ఆరోగ్య చిత్ర ప‌టం లో ఈ వ్య‌వ‌స్థ లు మ‌రింత గా రాణించేందుకు అవ‌కాశాలు ఉన్నాయి.  ద్వైపాక్షిక స్థాయి లో భార‌త‌దేశం మరియు బ్రెజిల్ లు చాలా స‌న్నిహిత‌మైన మరియు బ‌హుముఖీన సంబంధాన్ని క‌లిగివున్నాయి.  అంతేకాకుండా బిఆర్ఐసిఎస్ (బ్రిక్స్), బిఎఎస్ఐఎస్ (బేసిక్), జి-20, జి-4, బిఎస్ఎ, ఇంకా ఇతర బ‌హుళ దేశాల కు స‌భ్య‌త్వ‌ం ఉన్నటువంటి కూట‌ముల లోను, ఐక్య రాజ్య సమితి, ప్ర‌పంచ వాణిజ్య సంస్థ‌, యుఎన్ఇఎస్ సిఒ, ఇంకా ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ల వంటి భారీ బ‌హు పార్శ్విక సంస్థ ల‌లో కూడా భార‌త‌దేశం మ‌రియు బ్రెజిల్ లు క‌ల‌సి ప‌ని చేస్తున్నాయి.  యావ‌త్తు లేటిన్ అమెరికా, ఇంకా క‌రీబియ‌న్ ప్రాంతాల లో భార‌త‌దేశాని కి అత్యంత ముఖ్య‌మైన వ్యాపార భాగ‌స్వామ్య దేశాల లో ఒక దేశం గా బ్రెజిల్ ఉంది.

ఓష‌ధి మొక్క‌ల పై ఆధార‌ప‌డిన‌టు వంటి ఆరోగ్య సంర‌క్ష‌ణ ప‌ద్ధ‌తు లు అనేకం గా ఉన్న, మరి అలాగే సాంప్ర‌దాయ‌క ఔష‌ధాల వినియోగ చ‌రిత్ర కు ఆల‌వాల‌మైనటువంటి జీవ వైవిధ్యం ఇటు భార‌త‌దేశం లో, అటు బ్రెజిల్ లో స‌మృద్ధం గా విస్తరించివుంది.  ఆయుర్వేదం, యోగ‌, ఇంకా ఇత‌ర సాంప్ర‌దాయ‌క ప‌ద్ధ‌తు లు బ్రెజిల్ లో అమిత ప్ర‌జాద‌ర‌ణ కు పాత్రమయ్యాయి.


**



(Release ID: 1563315) Visitor Counter : 137